ఎవరో ఏదో చెబుతారు.,. అన్నం, రొట్టెలు మానేసి కొబ్బరినూనె తాగండి అని… ఆ విధానమేంటో సరిగ్గా అర్థంగాక, అర్థమైనంతవరకు అడ్డదిడ్డంగా ఆచరించి ప్రాణాల మీదకు తెచ్చుకున్న కేసులు చూశాం… ఇంకొకరు జస్ట్, మిలెట్స్ ఓన్లీ అంటాడు… మరొకరు కీటో డైట్ అంటాడు… ఒకాయన రోజుకు 16 గంటల ఉపవాసాన్ని మించింది లేదు అంటాడు…
ఒబెసిటీ, బీపీ, సుగర్, థైరాయిడ్ వంటి నానా రకాల సమస్యలకు నానా రకాల పరిష్కారాల్ని యూట్యూబ్, సోషల్ మీడియా చెప్పేస్తుంది… అవి పరిస్థితులను మరింత దిగజారుస్తాయి… ఒకడు నెయ్యి వద్దంటాడు, మరొకడు ఎహె, అది సూపర్ న్యూట్రిషియస్ అంటాడు… ఒకడు గుడ్డు తింటే పోతావురోయ్ అంటాడు, మరొకడు కంప్లీట్ న్యూట్రిషియస్ ఫుడ్ గుడ్డే అంటాడు…
మరీ ఘోరం ఏమిటంటే..? ఎక్కువ నీళ్లు తాగండి, కిడ్నీలకు మంచిది అని కొందరు చెబితే, అబ్బే, కిడ్నీలపై భారం పెరుగుతుంది, కాస్త చూసుకుని తాగండి అనే సలహాలు కూడా చదివినట్టు గుర్తు… రష్యాలో ఇతను మరీ ఎక్స్‌ట్రీమ్… ఎంత అంటే… పచ్చి ఆహారం పిచ్చోడు… అంటే వండకూడదు ఆహారాన్ని… అన్నీ పచ్చిపచ్చివే తినేయాలి… అంతేకాదు, అసలు సూర్యరశ్మి అంత న్యూట్రిషియస్ ఇంకేముంది..? దాంతో బతకొచ్చు అంటాడు… కరెక్టే, మీరు మనసులో అనుకుంటున్నది… ఓరకం మానసిక సమస్యే…
Ads
కాకపోతే సమస్య ఎక్కడ వచ్చిందంటే… తన పిచ్చితో తన కొడుకు ప్రాణాలు తీశాడు.., సోషల్ ఇన్‌ఫ్లుయెన్సర్లు అన్నట్టుగా వీళ్లను రా ఫుడ్ ఇన్‌ఫ్లుయెన్సర్లు అంటారట… పేరు మాగ్జిమ్ లయూటీ… 44 ఏళ్లు… బ్లాక్ సిటీ దగ్గర సోచి తన ఊరు… ఎలాంటి ఆహారం ఇవ్వకుండా పిల్లాడిని కేవలం సూర్యరశ్మి మీద ఆధారపడేట్టు చేయడం ఈ పిచ్చోడి నిర్వాకం…
ఈ పైత్యం ఎక్కడి వరకు పోయిందంటే తన గరల్ ఫ్రెండ్ మిరనోవా, అనగా ఆ పిల్లాడి తల్లిని కనీసం బ్రెస్ట్ ఫీడింగ్ కూడా చేయనివ్వలేదు… పాపం, ఆమె ఈ పిచ్చోడికి దాదాపు బానిసలాగే బతికింది… ఆ పిల్లాడినే అలా బలితీసుకున్నాడంటే ఇక భార్యను ఎంత గోసపెట్టి ఉంటాడో అర్థం చేసుకోవచ్చు…
తరచూ పిల్లాడిని చల్లటి నీళ్లలోకి తీసుకెళ్లేవాడు… ఎందుకురా అంటే గట్టిపరచడానికి అట… ఆ పిల్లాడు సఫరవుతుంటే డాక్టర్ల వద్దకు కూడా తీసుకెళ్లేవాడు కాదు… గరల్ ఫ్రెండ్ మీద కూడా ఈ పచ్చి ఆహారం నిబంధనల్ని రుద్దేసరికి ఆమె ఐరన్ లోపంతో బాధపడేది… ఆ ప్రభావం కడుపులోని బిడ్డ మీద కూడా పడి కేవలం మూడున్నర పౌండ్ల బరువుతో పుట్టాడు అని కోర్టుకు మొరపెట్టుకుంది…
పోలీసులు ఆ పిల్లాడు మరణించాక కేసు పెట్టారు… పలు విచారణల తరువాత లయూటీ తన తప్పు అంగీకరించాడు… తన నిర్లక్ష్యం వల్లే ఇదంతా జరిగిందని చెప్పాడు… ‘నాకు నా కొడుకును చంపుకోవాలని ఉంటుందా..? వాడిని ఎంతగానే ప్రేమించాను… ఇది ఉద్దేశపూర్వకం కాదు’ అని జడ్జికి చెప్పుకున్నాడు… కానీ చివరకు కోర్టు శిక్ష విధించింది…
మిరనోవా తల్లి గెలినా ఏమంటుందంటే… ‘వాడు ఓ పిచ్చోడు అని చెప్పినా నా కూతురు వినలేదు, అదోరకమైన ఉన్మాదం అది… వాడి దగ్గర ఓ గినీ పందిలా, ఓ బానిసలా బతికింది’ అని కన్నీళ్లు పెట్టుకుంది… బంధువులు కూడా కోర్టుకు సాక్ష్యం ఇచ్చారు… బ్రెస్ట్ ఫీడింగ్ చేయనిచ్చేవాడు కాదు, రహస్యంగా అప్పుడప్పుడూ పాలు ఇవ్వడానికి ప్రయత్నించేది అని…
ఈ మొత్తం కథలో రెండు అంశాలు ఆసక్తికరం… భర్త ఇంత చేస్తున్నా సరే, పిల్లాడి ఆరోగ్యం మీద నువ్వెందుకు నిర్లక్ష్యం కనబరిచావు, ప్రాణాలో పోయేదాకా ఎందుకు ఉపేక్షించావు అంటూ కోర్టు ఆమెకు కూడా రెండేళ్ల జైలు శిక్ష విధించింది… మరో తీవ్రమైన ఐరనీ ఏమిటంటే..? విచారణ ఖైదీగా జైలులో ఉన్న ఈ ఏడాదిపాటు లయూటీ పాస్తాను, రెడ్ మీట్‌ను ఫుల్లుగా లాగించాడట..!!
కథలో నీతి… మన కడుపున మంచి పిల్లలు పుట్టాలని కాదు దేవుడిని కోరుకోవాల్సింది… మంచి పేరెంట్స్‌కు పుట్టాలని పిల్లలు పుట్టడానికి ముందే దేవుడిని కోరుకుని పుట్టాలి… (news source : The Mirror)
Share this Article