Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఇరాన్‌లో చిక్కుకున్న అమెరికన్ పైలట్‌ను కాపాడింది ఇదేనా..?!

April 6, 2026 by M S R

.

ఇరాన్‌లో కూలిన తమ యుద్ధవిమానం పైలట్‌ను అత్యంత క్లిష్టమైన, సాహసోపేతమైన రెస్కూ ఆపరేషన్‌లో రక్షించి, తమ దేశానికి తీసుకొచ్చేసినట్టు సాక్షాత్తూ ట్రంప్ ప్రకటించాడు… దీనికోసం అనేక యుద్ధ విమానాలను పంపించినట్టు, అవి ఇరాన్ ఎయిర్‌డిఫెన్స్‌ను బ్రేక్ చేసినట్టు కూడా బోలెడు వార్తలు వస్తున్నాయి… ఇలా రక్షించారు, అలా చేశారు అని బోలెడు కథనాలు…

ఆపరేషన్ తీరు ఇదీ అని ఏ దేశమూ చెప్పదు… అమెరికా అస్సలు చెప్పదు… రక్షించడం వరకు మాత్రం నిజం… కొందరేమో అమెరికా నేవీ సీల్స్ ఈ అపరేషన్ చేశారంటుంటే, మరికొందరు ఇజ్రాయిల్ కమాండ్ ఫోర్సెస్ ఈ రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించినట్టు చెబుతున్నారు… ఇరాన్ ఎయిర్‌ డిఫెన్స్ బ్రేక్ చేయడమే నిజమైతే మరి ఆ యుద్ధ విమానాన్ని (స్టెల్త్) ఇరాన్ ఎలా కూల్చేసినట్టు..? ఇరాన్‌కు నిజంగానే ఆ సత్తా ఉంటే అమెరికా సరిహద్దులు దాటి మరీ తన పైలట్‌ను ఎలా రక్షించినట్టు..? సో, ప్రస్తుతానికి అన్నీ మిస్టరీలే… అత్యంత గొప్ప యుద్ధవిమానం అని అమెరికా ప్రచారం చేసుకునే ఎఫ్-35 ఏమాత్రం సేఫ్ కాదా..?

Ads

కూలిపోయింది F-15E స్ట్రైక్ ఈగిల్ … ఏప్రిల్ 3, 2026న ఇరాన్ భూభాగంలో కూలిపోయిన విమానం F-15E స్ట్రైక్ ఈగిల్ (F-15E Strike Eagle)... అంతేతప్ప అది ఎఫ్-35 కాదు అని అమెరికన్ వర్గాలు చెబుతున్నాయి… ఈ శిథిలాలు, ఫోటోలు కూడా బయటకు వచ్చాయి… ఈ విమానంలో ఇద్దరు సిబ్బంది (పైలట్, వెపన్ సిస్టమ్స్ ఆఫీసర్) ఉండేవారు… వీరిద్దరూ విమానం నుండి సురక్షితంగా బయటకు (eject) దూకారు, ఆ తర్వాత అమెరికా ప్రత్యేక దళాలు వీరిద్దరినీ వేర్వేరు రెస్క్యూ ఆపరేషన్లలో రక్షించాయి…

  • సోషల్ మీడియాలో ఓ వార్త ప్రచారంలో ఉంది… వెపన్ సిస్టమ్ ఆఫీసర్ వద్ద CSEL పరికరం ఉంది, దాని స్పెషాలిటీయే తన ఉనికిని తమ సొంత దేశపు మిలిటరీ శాటిలైట్లకు రహస్య సంకేత భాషలో సిగ్నల్స్ పంపించడం… అదుగో దాని సాయంతోనే అమెరికా రక్షించిందని ఆ వార్త సారాంశం… కానీ ఈ వార్త ఇప్పటిది కాదు… ఆ ఒరిజినల్ కథ ఓసారి చదువుదాం…

 



csel

ఇది జరిగింది ఇరాన్‌లో కాదు, లిబియాలో (2011లో)… అప్పట్లో లిబియా నియంత గడ్డాఫీ దళాలపై అమెరికా నేతృత్వంలోని నాటో (NATO) దళాలు దాడులు చేస్తున్నప్పుడు, ఒక అమెరికన్ F-15E స్ట్రైక్ ఈగిల్ సాంకేతిక లోపంతో కూలిపోయింది… ఆ సమయంలో పైలట్లు తప్పించుకున్న తీరు, శత్రువుల కళ్లుగప్పి రెస్క్యూ టీమ్‌తో కనెక్ట్ అయిన విధానం రక్షణ రంగంలో ఒక సంచలనం…

ఆపరేషన్ ‘ఒడిస్సీ డాన్’: ఒక అద్భుతమైన రెస్క్యూ స్టోరీ

తేదీ: మార్చి 21, 2011 అర్ధరాత్రి…

ప్రదేశం: లిబియాలోని బెంఘాజీ సమీపంలోని ఒక మారుమూల ప్రాంతం.

మేజర్ మార్క్ మైయర్స్, అతని వెపన్ సిస్టమ్స్ ఆఫీసర్ (WSO) ఒక F-15E యుద్ధ విమానంలో గడ్డాఫీ సైనిక స్థావరాలపై బాంబులు కురిపిస్తున్నారు… అకస్మాత్తుగా విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది… విమానం నియంత్రణ కోల్పోవడంతో, గంటకు వందల కిలోమీటర్ల వేగంతో కిందకు పడిపోతోంది… వేరే దారి లేక ఇద్దరూ Ejection Seats ద్వారా విమానం నుండి బయటకు దూకేశారు…

1. నిశ్శబ్ద పోరాటం మొదలైంది… పారాచూట్ ద్వారా కిందకు దిగుతున్నప్పుడే పైలట్లకు తెలుసు… తాము శత్రువుల ఇలాకాలో ఉన్నామని… కింద పడగానే వారు చేసిన మొదటి పని తమ వెస్ట్‌కు ఉన్న CSEL (Combat Survivor Evader Locator) రేడియోను యాక్టివేట్ చేయడం…

2. CSEL మాయాజాలం: మాటల్లేవు.. మ్యాజిక్ మాత్రమే… సాధారణ రేడియోలు వాడితే శత్రువులు ఆ సిగ్నల్స్‌ను ‘ట్రయాంగులేట్’ చేసి పైలట్ ఎక్కడున్నాడో నిమిషాల్లో కనిపెట్టేస్తారు… కానీ CSEL అలా కాదు…

  • సైలెంట్ మెసేజింగ్: పైలట్ మాట్లాడాల్సిన అవసరం లేదు… కేవలం కొన్ని బటన్లు నొక్కితే చాలు, తన ఖచ్చితమైన GPS లొకేషన్ శాటిలైట్ ద్వారా అమెరికా కమాండ్ సెంటర్‌కు వెళ్ళిపోతుంది…

  • ఫ్రీక్వెన్సీ హాపింగ్: ఇది సిగ్నల్స్‌ను సెకనుకు అనేక సార్లు మారుస్తుంది… దీనివల్ల శత్రువుల రేడార్లకు అది కేవలం ఒక చిన్న శబ్ద కణం (Noise) లాగా కనిపిస్తుంది తప్ప, ఒక సిగ్నల్ లాగా దొరకదు…

  • టెక్స్ట్ మెసేజ్: “నేను క్షేమంగా ఉన్నాను”, “శత్రువులు 500 మీటర్ల దూరంలో ఉన్నారు” వంటి సందేశాలను పైలట్ కేవలం టెక్స్ట్ రూపంలో పంపాడు…

3. రెస్క్యూ టీమ్ ఎంట్రీ (The Bold Rescue) … పైలట్ పంపిన సిగ్నల్ అందగానే, ఇటలీలోని ఒక యుద్ధ నౌక (USS Kearsarge) నుండి MV-22 Osprey విమానాలు గాల్లోకి లేచాయి… వీటికి రక్షణగా AV-8B Harrier జెట్ విమానాలు తోడయ్యాయి…

పైలట్ తన చుట్టూ గడ్డాఫీ మద్దతుదారులు తిరుగుతున్నా, గడ్డివాముల్లో, పొదల్లో దాక్కుంటూ CSEL ద్వారా రెస్క్యూ టీమ్‌కు తన అప్‌డేట్స్ ఇస్తూనే ఉన్నాడు… రెస్క్యూ టీమ్ పైలట్‌కు కేవలం కొన్ని మీటర్ల దూరంలోకి వచ్చే వరకు పైలట్ ఎటువంటి శబ్దం చేయలేదు…

4. క్లైమాక్స్: 90 నిమిషాల్లో ముగిసిన ఆపరేషన్ … హెలికాప్టర్లు దిగగానే, పైలట్ తన గుర్తింపును నిరూపించుకోవడానికి ఒక చిన్న కోడ్ పంపాడు… కేవలం కొద్ది నిమిషాల్లోనే రెస్క్యూ టీమ్ అతన్ని విమానంలోకి ఎక్కించుకుని సురక్షితంగా వెనక్కి తీసుకువచ్చింది… విమానం కూలినప్పటి నుండి పైలట్‌ను రక్షించే వరకు పట్టిన సమయం కేవలం 90 నిమిషాలు…


ఈ కథ నేర్పే పాఠం… టెక్నాలజీ అనేది కేవలం ఆయుధాల్లోనే కాదు, ప్రాణాలను కాపాడే పరికరాల్లో కూడా ఎంత కీలకంగా ఉంటుందో ఈ ఘటన నిరూపించింది… ఈ రోజుకు కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అమెరికన్ పైలట్లు తమ ప్రాణాలకు భరోసాగా ఈ CSEL సిస్టమ్‌ను నమ్ముతారు… మరి ఇరాన్‌లో కూడా ఇదేనా కాపాడింది..? బయటపడాల్సి ఉంది..!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఇరాన్‌లో చిక్కుకున్న అమెరికన్ పైలట్‌ను కాపాడింది ఇదేనా..?!
  • ఏడేళ్ల ‘బాలీవుడ్ బాద్‌షా’ పీఠానికి ఎసరు..! తొలిసారి రణబీర్‌కు కిరీటం..!
  • కొబ్బరి బొండాం..! అప్పట్లో కామెడీ హీరో అంటే ఓన్లీ రాజేంద్ర ప్రసాద్..!
  • అర్చకుల విదేశీ ప్రయాణాలు నిషిద్ధమా..? శృంగేరీ చెప్పిందే ఆగమమా..?!
  • అసెంబ్లీ నక్సలైట్..! ముందస్తు జాగ్రత్తగా ఉపా కేసు వర్తిస్తుందా యువరానర్..!!
  • అన్నదాత చెమట చుక్కకు తెలుసు మెతుకు విలువ… అవమానించకండి…
  • గాలికదుపు లేదు- కడలికంతు లేదు… ప్రతి పదంలోనూ మార్మిక భావన…
  • జంట నెలవంకలుండే నింగి ఉంటుందేమో…. ‘అలాంటి పిల్ల’ దొరకదు…
  • గురువును కేజ్రీ వదిలేశాడు… కేజ్రీని మిగతా నేతలు వదిలేస్తున్నారు…
  • కాళేశ్వరం చిక్కుముళ్లు..! సీఎం పే-ద్ద కొరడా పట్టుకుంటేనే ‘రిపేర్లు’..!!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions