.
హఠాత్తుగా ఫేస్‌బుక్‌లో అనేక యాడ్స్ కనిపిస్తున్నాయి… తెల్లారిలేస్తే కమ్యూనిటీ స్టాండర్డ్స్ అంటూ పిచ్చి పిచ్చి వాడికే అర్థం కాని ప్రామాణికాలతో అందరి ఖాతాలపై కత్తెర పెత్తనం చేస్తుంటాడు కదా…
నిజానికి వాడు డబ్బు తీసుకుని స్పాన్సర్ చేసే యాడ్స్ ఇవి… అంటే వాడు బాధ్యత వహించాలి… ఈ యాడ్ ఏకంగా ఈ దేశ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫేక్, ఎడిటెడ్, ఫాల్స్ వీడియోను వాడటమే కాదు… రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కూడా యాడ్‌లో వాడేశాడు…
Ads
ఇన్ఫోసిస్ సుధామూర్తి పేరును కూడా…! ఇండియాటుడే ఇంటర్వ్యూ అట… ఎన్డీటీవీ.కామ్ అట… జస్ట్, 21 వేలు డిపాజిట్ చేస్తే చాలు… రోజుకు 60, 70 వేలు.., 28 రోజుల్లో 17 లక్షలు సంపాదించవచ్చట… స్టేట్ బ్యాంకు, ఇన్ఫోసిస్, రిలయెన్స్ కలిపి ఓ ప్లాట్‌ఫామ్ క్రియేట్ చేశాయట…
కేంద్ర ప్రభుత్వం గ్యారంటీ ఇస్తున్నదట… ఒకసారి ఇవి చూడండి… సమయానికి దొరికిన రెండు యాడ్స్ ఇవి… ఫేస్‌బుక్‌లోనే కాదు, రీల్స్‌లో కూడా కనిపిస్తున్నాయి…
https://www.facebook.com/share/v/196DQVamYM/
https://www.facebook.com/share/1A8nB9SLsp/
ఈ సంపాదనకు టాక్సులు కూడా ఉండవట… జస్ట్, రిజిష్టర్ చేసుకొండి, ఇక లెక్కపెట్టుకొండి సంపాదనను… సైబర్ ఫ్రాడ్ భయంతో దాన్ని రిజిష్టర్ చేసుకునే సాహసానికి ఒడిగట్టలేదు గానీ… ఏకంగా సైబర్ ఫ్రాడ్స్ ఏకంగా మీడియా సంస్థల పేర్లను, రాష్ట్రపతి, ఆర్థిక మంత్రి పేర్లను వాడుతూ, ఫేక్ ఎడిటెడ్ వీడియోలు చేస్తూ సోషల్ మీడియాలోనే ప్రాపగాండా చేస్తుంటే పట్టుకోలేకపోతోందా మన యంత్రాంగం..?
అదీ ఆశ్చర్యం అనిపించింది… శ్రేయాఘోషాల్ కెరీర్ ఇక ఖతం, ఏం జరిగిందో తెలుసా అని కొన్ని యాడ్స్… ఇండియన్ ఐడల్ నేహా కక్కర్ సమయానికి మైక్ ఆపేశారనుకుని మాట్లాడేసింది, ఇక ఆమెకు అరెస్టే గతి… ప్రియమణి పాపం బుక్కయిపోయింది… ఇన్ఫోసిస్ నారాయణమూర్తి ఇంటర్వ్యూలో దొరికిపోయాడు… సద్దురు రవిశంకర్ దేశాన్ని నివ్వెరపరిచే వ్యాఖ్యానాలు చేశాడు… ఇలాంటి థంబ్ నెయిల్స్ యాడ్స్ కూడా చాలా కనిపించాయి ఇటీవల… అన్నీ ఒకే బాపతు…
ఇష్టారాజ్యంగా ఇండియన్ సెలబ్రిటీల పేర్లు వాడేసుకుంటున్నారు… ఇక్కడ సమస్య ఏమిటంటే ఫేస్‌బుక్ అఫీషియల్లీ స్పాన్సర్డ్ యాడ్స్ ఇవి… మన సైబర్ ఫ్రాడ్ కంట్రోల్ మెకానిజం ఇంత బలహీనంగా ఉందా..? చివరకు రాష్ట్రపతి హోదాను కూడా వాళ్ల ఫ్రాడ్ దందాలోకి లాగినా సరే..!! ఇదుగో వీడు ఏకంగా ప్రధాని మోడీ ఎడిటెడ్ వీడియో పెట్టేశాడు…
https://www.facebook.com/share/1AJBRn6aAU/
జస్ట్, 22 వేల పెట్టుబడి అట… వారానికి 8 లక్షల ఆదాయం అట…
Share this Article