‘‘మా నాన్న వెజిటేరియన్… మా తాత, బామ్మ కూడా అంతే… నేనేమో ఎగిటేరియన్… నాకు కావల్సిన ప్రొటీన్ల కోసం తప్పదు… చాలా ఎగ్స్ తింటుంటా… నా అవసరం అది… దాదాపు రోజుకు 12 ఎగ్స్ తప్పవు… అవేం సరిపోతాయి..? అందుకే పుష్కలంగా కార్బొహైడ్రేట్స్, ప్రొటీన్ షేక్స్ కూడా డైట్‌లో తప్పనిసరి…
పొద్దున్నే ఓ ఎగ్ శాండ్‌విచ్, ఏదైనా ఫ్రూట్ జ్యూస్… మధ్యాహ్నభోజనంలోకి కాస్త ఎక్కువ మోతాదులోనే అన్నం, అందులోకి పాలకూర వంటి ఏదైనా ఆకుకూర ప్లస్ పప్పు తప్పనిసరి… అఫ్‌కోర్స్, వాటితోపాటు ఎగ్స్… ఎక్కువగా బాయిల్డ్ ఎగ్స్… సాయంత్రం ఎగ్ పరాటాలు… లేదంటే మళ్లీ ఎగ్ శాండ్‌విచ్…’’
…. వేదాంత మాధవన్… వయస్సు 17 ఏళ్లు… సినిమా నటుడు మాధవన్ కొడుకు… చిన్నప్పటి నుంచీ స్విమ్మింగ్ మీద ఇష్టం… అనేక పోటీల్లో పాల్గొన్నాడు… బోలెడు మెడల్స్… తాజాగా కోపెన్‌హేగ్‌లో జరిగిన డానిష్ ఓపెన్ అంతర్జాతీయ పోటీల్లో ఒక గోల్డ్, ఒక సిల్వర్ గెలిచాడు… (800 మీటర్ల ఫ్రీ స్టయిల్‌లో గోల్డ్, 1500 మీటర్ల ఫ్రీ స్టయిల్‌లో సిల్వర్)… 200 మీటర్ల ఫ్రీ స్టయిల్‌లో తన పాత రికార్డును కాస్త మెరుగుపరుచుకున్నాడు… 12వ ప్లేసు…
Ads
తన గురించిన వివరాల్లో ఆసక్తిగా అనిపించింది తన డైట్… అన్ని క్రీడల్లాగే స్విమ్మింగ్‌కు కూడా మంచి డైట్ కావాలి… నిజానికి కాస్త ఎక్కువే కావాలి… కుటుంబం ఏమో వెజిటేరియన్… (తమిళ హిందూ కుటుంబం)… కేవలం వెజిటేరియన్‌గా ఉంటే ఆ డైట్ తనకు కావల్సిన శక్తిని, ప్రత్యేకించి ప్రొటీన్లు ఇవ్వలేదనే భావనతో ఎగ్స్ అలవాటు చేసుకున్నాడు… కాగా తక్షణ శక్తికి మాత్రం అన్నం… అందులోని కార్బొహైడ్రేట్స్ తప్పవు…
స్విమ్మింగులో పాత అంతర్జాతీయ రికార్డులతో పరిశీలిస్తే వేదాంత ఇంకా చాలాదూరం ప్రయాణించాలి, ఇంకా మెరుగుపడాలి… కానీ ప్రతి పోటీలో పదును పెట్టుకుంటున్నాడు… ఇంకా బోలెడు కెరీర్ ముందుంది… తొందరేమీ లేదు… తాత రంగనాథన్ శేషాద్రి, టాటా స్టీల్స్‌లో ఎగ్జిక్యూటివ్… బామ్మ పేరు సరోజ… బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మేనేజర్… తల్లి సరితా బిర్జే… ఆస్ట్రియాలోని లాగెన్‌ఫర్ట్‌లో ‘సరిత’ పేరిట ఓ బట్టల షాపు ఉంది ఆమెకు… మొదట్లో ఎయిర్ హోస్టెస్, తరువాత కొన్ని మాధవన్ సినిమాలకు కాస్ట్యూమ్ డిజైనర్‌గా చేసింది… ఇక మాధవన్ గురించి తెలిసిందే కదా…
అన్నట్టు… మరీ ఎగ్స్ అంత ఎక్కువగా తీసుకోవద్దు సుమా… వేదాంత ప్రొఫెషనల్ స్విమ్మర్ కాబట్టి, రోజూ ప్రాక్టీస్ ఉంటుంది కాబట్టి అన్నీ హరాయించుకోగలడు… పెద్ద ఫరక్ పడదు… నిజానికి దేహానికి కావల్సిన పోషకాల కోణంలో ఎగ్స్ మంచివే కానీ… అతిగా కాదు… వేదాంతను చూసి అలవాటు చేసుకుంటారేమో… వద్దు,.. వద్దు… నిజంగానే అంతర్జాతీయ పోటీల కోసం దేశదేశాలు తిరిగే ప్రొఫెషనల్ క్రీడాకారులు కేవలం వెజిటేరియన్లుగా కొనసాగడం కష్టమే… అంతే కదా…!!
Share this Article