Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఎట్టాగో వున్నాది ఓలమ్మీ… ఏటేటో అవుతుందే చిన్నమ్మీ…

April 24, 2024 by M S R

Subramanyam Dogiparthi ….   ANR-వాణిశ్రీ జోడీ నట జైత్రయాత్రకు శ్రీకారం చుట్టిన సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ 1971 లో వచ్చిన ఈ దసరా బుల్లోడు . ఈ సినిమాకు యాభై ఏళ్ళ వయసు ఉందా అనిపిస్తుంది ఈరోజు చూసినా . ANR ఫస్ట్ గోల్డెన్ జూబిలీ సినిమా . యాభై వారాలు ఆడింది . ANR కెరీర్లో జనాన్ని ఒక ఊపు ఊపిన సినిమాలు మూడు . దసరా బుల్లోడు , ప్రేమ నగర్ , ప్రేమాభిషేకం . ఈ మూడు సినిమాలు నేను ఎన్ని సార్లు చూసానో ! ప్రముఖ నిర్మాత వి బి రాజేంద్రప్రసాద్ దర్శకత్వం వహించిన మొదటి సినిమా ఇది .


బావామరదళ్ళ సరసం , ఒకరినొకరు అల్లరి పెట్టడం ఆరోజుల్లో ఎక్కువగా ఉండేది . అవన్నీ ఉంటాయి ఈ సినిమాలో . ఎమోషన్స్ , డ్రామా , కధ , కధను నడిపించే తీరు , బిర్రయిన స్క్రీన్ ప్లే , ఎక్కడా రాజీ పడకుండా రిచ్ గా తీయటం , నటీనటుల నటన అన్నీ అద్భుతం . గ్రామీణ నేపధ్యంలో పులి ఆటలు , నెమలి నృత్యాలు , ANR కొత్త పంచె కట్టు వగైరా తిరణాల తిరణాలగా ఉంటాయి .

స్టెప్పులకు , డాన్సులకు పెట్టింది పేరు ANR . పక్కన వాణిశ్రీ . ఇంక చెప్పేదేముంది . ముతగ్గా చెప్పాలంటే ఇరగతీసారు . విజృంభించారు . పచ్చ గడ్డి కోసేటి పడుచు పిల్లో నీ పైట కొంగు జారిందే గడుసు పిల్లా , అరెరెరె ఎట్టాగో వున్నాది ఓలమ్మీ ఏటేటో అవుతుంది ఓలమ్మీ రెండు పాటలు ఈరోజుకీ ముసలాళ్ళ మనసుల్ని కూడా లాగేస్తాయి . చేతిలో చెయ్యేసి చెప్పు బావా పాటలో వాణిశ్రీ నటన మరచిపోలేనిది . మొదట హుషారుగా , రెండో సారి విషాదంగా , రెండు సార్లూ ఆమెకు ఆమే సాటి .

నల్లవాడే అమ్మమ్మా అల్లరి పిల్లవాడే పాటలో బావామరదళ్ళ సరసం , అల్లరి , గోము అన్నీ సమపాళ్ళలో కలిపారు . మళ్ళా వాడు నీవాడే నీవాడే అంటూ వాణిశ్రీ , చంద్రకళల పోటాపోటీ త్యాగాన్ని హృద్యంగా చూపాడు దర్శకుడు రాజేంద్రప్రసాద్ . ఓ మల్లయ్య గారి ఎల్లయ్య గారి కల్లబెల్లి బుల్లయ్యో పాటలో నాగభూషణాన్ని టీజ్ చేయటం బాగుంటుంది . వినరా సూరమ్మ వీరగాధలు వీనుల విందూగా , వెళ్ళిపోతున్నావా పాటలు కూడా బాగుంటాయి . కె వి మహదేవన్ సంగీత దర్శకత్వం సినిమాను 120 కి మీ స్పీడులో ఉరుకెత్తిస్తుంది .

ANR-వాణిశ్రీ-చంద్రకళల కాంబినేషన్ అద్భుతంగా పండింది . SVR, సూరేకాంతం కాంబినేషన్ , గుమ్మడి- అంజలీదేవి కాంబినేషన్ చాలా బాగుంటాయి . నాగభూషణం రూరల్ విలనీని కూడా బాగా చూపారు . పద్మనాభం , ఛాయాదేవి , ఝాన్సీ , రాధాకుమారి , బేబీ రాణి , మరెంతమందో నటీనటులు నటించారు . బ్లాక్ & వైట్ నుండి కలర్లోకి తెలుగు సినిమా ప్రయాణపు మొదటి రోజుల్లో వచ్చిన కలర్ సోడా ఇది . ఈ సినిమాలో మరో ఎట్రాక్షన్ ANR వాడే టాప్ లెస్ కారు . చాలా క్రేజీ కారు .

ఈ సినిమా చూడని వారు ఈ తరంలో కూడా ఉంటారని నేను అనుకోను . ఉంటేగింటే అర్జెంటుగా చూసేయండి యూట్యూబులో . వాణిశ్రీ అందమైన అల్లరి నటన మిస్సయితే ఎలా ! అలాగే ANR డాన్సులు . షడ్రసోపేత విజ్యువల్ , మ్యూజికల్ ఫీస్ట్ . ఈ సినిమా గురించి ఒక్కొక్కరు ఒక్కో ధీసిస్సే వ్రాస్తారు . #తెలుగుసినిమాలసింహావలోకనం #తెలుగుసినిమాలు

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఒకే ఒక సినిమా… ఫుల్ స్టాప్… నేనూ నా సంగీతం… అదే నా ప్రపంచం…
  • అగరుపొగలా, అత్తరులా… ఊహూఁ… ఆ శోభన తాంబూలంలోనే ఏదో వెలితి…
  • తమ్ముడు పెళ్లి – మామ భరతం..! ఈ కథాకమామిషు ఏమిటనగా..!
  • జాణవులే… నెరజాణవులే… వరవీణవులే… కిలికించితాలలో…
  • విశ్వనాథుడు కదా… జావళి పాటకీ జయమాలినితో డాన్స్ చేయించగలడు…
  • 132 డిగ్రీలు నడుం వంచి… గుమ్మానికి ఆనుకుని నిలిచి… ఏవో ఎదురుచూపులు…
  • నాలుగు దశాబ్దాల కెరీర్… సాఫీగా ఈరోజుకీ కుదుపుల్లేని జర్నీ…
  • ప్రేక్షకులకు తగిలే చెప్పు దెబ్బల మాటేమిటో కూడా చెప్పు..!!
  • ఎట్టకేలకు GST మోత కాస్త తగ్గిస్తున్నారు ప్రభువులవారు..!!
  • ఒప్పినోళ్లు మెచ్చనీ, ఒప్పనోళ్లు సచ్చనీ… కృష్ణ పేరిణి తాండవమంటే మజాకా..?!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions