Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

నటన, పాటలు, స్క్రీన్‌ప్లే, కథ, మాటలు, దర్శకత్వం… అన్నీ ఒక్కడే..!

December 18, 2024 by M S R

.

( దోగిపర్తి సుబ్రహ్మణ్యం ) ……. దాసరి మార్క్ సినిమా బుచ్చిబాబు . అన్ని పాటలూ ఆయనే వ్రాసుకున్నారు . ఓ అతిధి పాత్రలో MLA బూతుల పాపయ్యగా కూడా నటించారు . టోటల్ కధ , స్క్రీన్ ప్లే , మాటలు , పాటలు , నటన , దర్శకత్వం అన్నీ ఆయనే . షష్టావతారాలు .

ఆ ప్రజాప్రతినిధి పాత్రలో ఓటర్లు ఎంత అమాయకులో , చైతన్యరహితులో కూడా ఉపన్యాసం ఇస్తారు . ప్రజాప్రతినిధుల మీద వ్యంగ్య బాణాలను విసురుతారు . అన్నపూర్ణ ఆర్ట్స్ బేనరుపై నిర్మించబడిన ఈ బుచ్చిబాబు సినిమాకు అక్కినేని కుమారులు ఇద్దరూ నిర్మాతలు . తారాగణం భారీగా ఉన్నా సినిమా మాత్రం ఎబౌ ఏవరేజుగా ఆడింది .

Ads

మాంగల్యబలం సినిమాలోలాగా చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు బావామరదళ్ళు బొమ్మల పెళ్ళి ఆడుకుంటూ మాంగల్యధారణ చేసేసుకుంటారు . అమెరికా నుండి తిరిగొచ్చిన హీరో చిన్నప్పుడు తాను తాళి కట్టిన మరదల్నే పెళ్లి చేసుకునేందుకు డిసైడ్ అయిపోతాడు .

అందుకోసం హీరోయిన్ ఇంట్లో వంటవాడి అవతారం ఎత్తి , ఎత్తుల మీద ఎత్తులు వేసి , చివరకు కధ సుఖాంతాన్ని చేస్తాడు . సినిమాలో ప్రధాన కార్యక్రమం అత్త గారి మెడను వంచటం . ఆమె గర్వాహంకారాల భగ్నం . టూకీగా ఇదీ కధ .

దాసరి వ్రాసిన పాటలకు మసాలా సంగీతాన్ని చక్రవర్తి అందించారు . చక్రవర్తి సంగీతం వలనే సినిమా ఎబౌ ఏవరేజుగా ఆడింది . లేకుంటే సూపర్ ఫ్లాప్ అయిఉండేది . గుండమ్మ కధ సినిమాలో అంజి పాత్రలో యన్టీఆర్ సూర్యకాంతాన్ని గుండక్కా అని పిలిచినట్లు ఈ బుచ్చిబాబు సినిమాలో మర్యాదరామన్న పాత్రలో ANR సూర్యకాంతాన్ని వంటవాడయినా అత్తగారు అని పిలుస్తారు . ANR కి కొండదొర మారువేషం , ఆ మారువేషంలో హీరోయిన్ని టీజ్ చేసే పాటొకటి కూడా ఉంటుంది .

ఈ బుచ్చిబాబు సినిమాలో హీరోకి పద్యాలు కూడా ఉంటాయి . వాటిని దాసరి వ్రాయలేదు . పాలగుమ్మి పద్మరాజు వ్రాసారు . ఏడు పాటలూ హిట్టే . పసుపు పచ్చతాడు పసుపు కొమ్మకు తోడు , ఎర్రకోక కట్టినావె పిట్టా , చందమామ పైటేసింది , సిత్తరాల తోటలో ఉత్తరాలు దొరికాయి నువ్వు రాసావా నేను రాసానా , గుండాబత్తుల బుచ్చెమ్మా , వాల్మీకి ఇంటిలో లవకుశులు పుట్టారు , కంగారవుతోంది బేజారవుతోంది పాటలు థియేటర్లలో వినబుల్ గా ఉండటమే కాకుండా బయట కూడా హిట్టయ్యాయి . డ్యూయెట్ల చిత్రీకరణ చాలా బాగుంటుంది .

హీరోయిన్ గా నటించిన జయప్రదది గ్లామర్ పాత్ర . అందగత్తె కదా ! సినిమాలో అందం పార్టుని ఆమె ఒక్కతే అందించారు . ఇతర పాత్రల్లో గుమ్మడి , ప్రభాకరరెడ్డి , రావి కొండలరావు , మోహన్ బాబు , కె వి చలం , చలం , నిర్మలమ్మ , గీత , పుష్పలత , రమాప్రభ నటించారు . నూతన నటుడు రాజా . అతిధి పాత్రల్లో దాసరి , రాజబాబు , సుజాత , మురళీమోహన్లు కనిపిస్తారు . మోహన్ బాబు టిపికల్ & డిఫరెంట్ డైలాగ్స్ డెలివరీ ప్రేక్షకులకు విసుగుని కలిగిస్తాయి .

అయిననూ ANR , జయప్రదల జోడీ , చక్రవర్తి సంగీతం వలన సినిమా కమర్షియల్ గా సక్సెస్ అయింది . సినిమా , పాటల వీడియోలు యూట్యూబులో ఉన్నాయి . మార్చి 1980 లో విడుదల అయిన ఈ సినిమా అప్పట్లో చూడని అక్కినేని అభిమానులు , జయప్రద అందపిపాసులు ఇప్పుడు చూసేయవచ్చు . An entertaining , feel good and comic movie . #తెలుగుసినిమాలసింహావలోకనం #తెలుగుసినిమాలు



గమనిక …. సిత్తరాల తోటలో ఉత్తరాలు దొరికాయి వంటి పాటల్లో సాహిత్య వాసనల కోసం అన్వేషణ అర్థరహితమని భావించ మనవి….



 

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • స్మృతి మంధాన..! కప్ గెలుపు ప్రచారంలో ఎందుకో దక్కని ప్రాధాన్యత ..!!
  • వరల్డ్ కప్ గెలుపు సంబురాల్లో… ఈ వీల్ చైర్ భాగస్వామి ఎవరో తెలుసా..?
  • జస్ట్,, టైమ్‌ పాస్ పల్లీ బఠానీ… చిరంజీవి కదా… పైసలొచ్చేసినయ్…
  • అల్పపీడనాలు… అవి ప్రకృతి జారీ చేస్తున్న ప్రమాద హెచ్చరికలు…
  • జగన్ మానసిక వైకల్యం సరేగానీ… నార్సిసిస్ట్ కానివారెవ్వరు ఇప్పుడు..?!
  • ఇదుగో గ్రహాంతర జీవులు… వస్తున్నాయి, పోతున్నాయి, గమనిస్తున్నాయి…
  • సో వాట్..? ఈ కెప్టెన్ కూడా ఆటలో పదే పదే ప్రార్థిస్తూ కనిపించింది..!
  • ఎవల్యూషన్, ట్రాన్స్‌ఫార్మేషన్… ఓ psychological angle లో చూద్దాం…
  • లెజెండ్ సచిన్ టెండూల్కర్ క్రికెటరా..? యాక్టరా..? ఓ ఇంట్రస్టింగ్ స్టోరీ..!!
  • క్రికెట్‌లోకి ఈ ఆల్‌రౌండర్ ఎంట్రీకి దారివేసింది ఓ పర్‌ఫెక్ట్ థ్రో..!!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions