.
దాసరి వెంకట రమణారెడ్డి అలియాస్ దిల్ రాజు వచ్చాడు గానీ… దాసరి చిరంజీవి ఎందుకు రాలేదు..? సోకాల్డ్ రాజమౌళి, ప్రభాస్, మహేశ్ ఎట్సెట్రా ఎందుకు రాలేదంటారూ..?
అసలు నిందితుడు అల్లు అర్జున్ ఎందుకు రాలేదు..? క్రీస్తుపూర్వం నాటి సినిమా సెలబ్రిటీలు కొందరు, సెకండ్ గ్రేడ్ సెలబ్రిటీలు కొందరు… అసలు వర్తమానంలో ఎవరూ పట్టించుకోనివారు మరికొందరు… మొత్తానికి దిల్ రాజు భలే గ్యాదర్ చేశాడు… కానీ, వీరిలో ఇండస్ట్రీని శాసించగలిగే శక్తి ఉన్నవాళ్లు ఎవరు..?
Ads
సిండికేట్ సభ్యులైన దగ్గుబాటి సురేష్, డీల్ చేస్తున్న దిల్ రాజు తప్ప..! దాన్ని బ్రేక్ చేయడం ఎలాగూ రేవంత్ రెడ్డి అండ్ టీమ్ వల్లకాని పని… డిస్ట్రిబ్యూటర్ కమ్ ప్రొడ్యూసర్ కమ్ ఎగ్జిబిటర్ కమ్ ఇండస్ట్రీ ఆపరేటర్ … ఈ పాత్ర గురించి రేవంత్‌రెడ్డి విని ఉండడు, విన్నవాళ్లు చెప్పి ఉండరు… చెప్పినా మన దిల్ రాజు కదా అనుకుని ఉంటాడు…
నో, నో, ఇకపై బెనిఫిట్ షోలు ఉండవు, టికెట్ రేట్ల పెంపు ఉండవు అని ఖండితంగా చెప్పాడు రేవంతుడు… గుడ్… కీపిటప్… అవే కాదు, ప్రిరిలీజులు, తొక్కలో సినిమా ఫంక్షన్లు, ఫ్యాన్ల గేదరింగులకు ఉండకూడదు… అలా చేస్తేనే కదా ఒక పల్లవీ ప్రశాంత్‌కు, ఒక అల్లు అర్జున్‌కూ తేడా లేకుండా పోయింది…
భయపడాల్సిందేమీ లేదు… ఇండస్ట్రీ ముఖ్యులెవడూ ఇక్కడ ఆస్తులు అమ్మేసుకుని అమరావతి పారిపోరు… అక్కడికి వెళ్తే నాలుగు రోజులు ఉండలేరు… ఈలోపు మళ్లీ జగన్ గనుక అధికారంలోకి వస్తే జింతాక జితాజితా తప్పదు…
తెలంగాణ సమాజం ఏం కోరుకుంటున్నదో రేవంత్ రెడ్డికి సమజ్ కాలేదు… కాదు కూడా… ఎన్టీయార్ 100 అడుగుల విగ్రహానికి తగిన భూకేటాయింపుకి సహకరిస్తామని ఎప్పుేడైతే చెప్పాడో తనకు తెలంగాణ సోయి ఏమాత్రం లేదని అర్థమైంది… ఎందుకు ఎన్టీయార్ భారీ విగ్రహానికి తెలంగాణలో చోటు ఇవ్వాలి పాలకా..?
ఇప్పటి సినిమా పెద్దలందరూ ‘అక్కడి వాళ్లే’ కానీ ఇక్కడి వాళ్లు కాదు… అది సత్యం… ఆ గుండెలు కొట్టుకునేది ఆ ప్రాంతం కోసమే… అది విపత్తు సాయాల వేళల్లో కూడా నిరూపితమైంది… పోనీ, ఇంత లోతుగా నేనెందుకు వెళ్లడం అని రేవంత్ అనుకుని ఉంటే… ఈ కొత్త భేటీ ప్రహసనాలు అక్కర్లేదు…
మొత్తం దిల్ రాజుకు అప్పగించేయడం బెటర్… ఆఫ్టరాల్ సాంస్కృతిక కాలుష్యమే కదా… తెలంగాణకు ఇది కొత్తేమీ కాదు… సమయం దొరికినప్పుడు తిరగబడటమూ కొత్త కాదు… ఎటొచ్చీ, లోతుగా వెళ్లడానికి దిల్ రాజేమో పక్కా వ్యాపారి… రేవంత్ రెడ్డి అంతకన్నా వందరెట్లు పక్కా రాజకీయ నాయకుడు… అక్కడొచ్చింది సమస్య…
పోనీలే… కాలం ఏం చెబుతుందో చూద్దాం…!! అసలే తెర నటుల్ని మించి పొలిటికల్ నటుల కాలం ఇది..! కానీ ఒక కులం శాసిస్తున్న ఇండస్ట్రీ అది… గాయపడ్డ కులం… అది నటిస్తున్నది తప్ప, అంత తేలికగా వదలదు పాలకా..? చంద్రబాబు నీకు ఎంత సన్నిహితుడైనా సరే..!!
.
.
చివరిగా… బెనిఫిట్ షోస్, టికెట్ రేట్లు ప్రస్తావనే రాలేదు అని దిల్ రాజు చెబుతున్నాడు… ఏదో తేడా కొడుతోంది…
Share this Article