Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

కాషాయం వదిలేసిన పులిబిడ్డ … తమిళ జాతీయవాదానికి సై…

March 27, 2026 by M S R

.

తమిళ గడ్డపై ‘పులి’ వారసుల గర్జన: సీమాన్ వ్యూహంలో వీరప్పన్ కుమార్తె! తమిళనాడు రాజకీయ క్షేత్రం ఎప్పుడూ ఒక ఉద్వేగభరితమైన పోరాటమే… అయితే ఈసారి 2026 అసెంబ్లీ ఎన్నికల ముఖచిత్రం మరికాస్త భిన్నంగా మారబోతోంది… ద్రవిడ దిగ్గజాలైన DMK, AIADMKలకు సవాల్ విసురుతూ, మూడవ ప్రత్యామ్నాయంగా ఎదుగుతున్న సీమాన్ నేతృత్వంలోని నామ్ తమిళర్ కచ్చి (NTK), ఈసారి ఒక సంచలన అభ్యర్థిని బరిలోకి దించుతోంది… ఆమే… అడవుల రారాజుగా పిలవబడే వీరప్పన్ కుమార్తె విద్యా రాణి…

కమలం వదిలి.. మైక్ పట్టిన వారసురాలు … విద్యా రాణి రాజకీయ ప్రయాణం అనూహ్య మలుపులు తిరిగింది… వృత్తిరీత్యా లాయర్ అయిన ఆమె, మొదట్లో భారతీయ జనతా పార్టీలో చేరి ఆ పార్టీ ఓబీసీ విభాగ ఉపాధ్యక్షురాలిగా బాధ్యతలు నిర్వహించింది… అయితే, జాతీయ పార్టీ సిద్ధాంతాల కంటే ‘తమిళ జాతీయవాదం’ వైపే ఆమె మొగ్గు చూపింది… (ఇలాంటోళ్లను కాపాడుకోవడం బీజేపీకి చేతకాదు, రియాలిటీ ఇది)… ( అసలు అన్నామలైని కూడా ప్రొటెక్ట్ చేసుకోలేకపోయింది… అదొక విషాదం)…

Ads

2024 లోక్‌సభ ఎన్నికలకు ముందే బీజేపీకి గుడ్ బై చెప్పి సీమాన్ సమక్షంలో NTK తీర్థం పుచ్చుకున్నదామె… కృష్ణగిరి పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసి లక్షకు పైగా ఓట్లు సాధించి, తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది…. ఇప్పుడు ఆమె తన తండ్రికి పట్టున్న మెట్టూరు నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నది…

మరి ముత్తులక్ష్మి పయనం ఎటు? మరోవైపు వీరప్పన్ భార్య ముత్తులక్ష్మి రాజకీయ ప్రస్థానం కూడా చర్చనీయాంశంగా మారింది… గతంలో ఆమె ‘మణ్ కాక్కుమ్ వీరతమిళర్ పేరమైప్పు’ అనే సంస్థను స్థాపించి సామాజిక కార్యక్రమాలు చేపట్టింది… ఓ ప్రొటెక్షన్ ప్రయాస…

ఒకప్పుడు వైకో నేతృత్వంలోని MDMKకి మద్దతు పలికిన ఆమె, ప్రస్తుతానికి ఏ ప్రధాన పార్టీలోనూ చేరలేదు… కానీ, తన కుమార్తె NTKలో క్రియాశీలకంగా ఉండటంతో, ఆమె పరోక్ష మద్దతు సీమాన్ పార్టీకే ఉంటుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు… నో, నో, వేరే పార్టీ నుంచి అదే సీటులో పోటీచేస్తుందని మరో ప్రచారం… బహుశా అవి ఫేక్ ఊహాగానాలు కావచ్చు…

ఏమిటీ NTK స్పెషాలిటీ? తమిళనాడులో మరే పార్టీకి లేని కొన్ని ప్రత్యేకతలు NTK సొంతం… రొటీన్ ద్రవిడ భావజాలానికి కాస్త డిఫరెంట్… అవే ఆ పార్టీని యువతకు దగ్గర చేస్తున్నాయి….

  • తమిళ జాతీయవాదం…: “తమిళులను తమిళులే పాలించాలి” అనేది వీరి ఏకైక నినాదం… ద్రవిడ రాజకీయాల కంటే ఇది భిన్నమైన పంథా… (ఎంజీఆర్, జయలలిత, కరుణానిధి, స్టాలిన్… అందరి రూట్స్ నాన్- తమిళ్…)

  • 50% మహిళా రిజర్వేషన్…: చట్టాలతో సంబంధం లేకుండా, పార్టీలో సగం సీట్లను మహిళలకే కేటాయిస్తూ సీమాన్ ఒక విప్లవాత్మక నిర్ణయం తీసుకున్నాడు… గ్రేట్…

  • ప్రకృతి ఆరాధన…: వ్యవసాయాన్ని ప్రభుత్వ ఉద్యోగంగా మార్చాలన్నది వీరి ప్రధాన డిమాండ్…. పర్యావరణ రక్షణ వీరి మేనిఫెస్టోలో టాప్ ప్రయారిటీ…

  • ప్రభాకరన్ ఆరాధన: ఎల్టీటీఈ అధినేత ప్రభాకరన్‌ను తమ ఆదర్శంగా భావించే ఈ పార్టీ, ఉద్వేగభరితమైన ప్రసంగాలతో సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది…

తండ్రిపై ఉన్న నెగెటివ్ ఇమేజ్‌చెరిపేసి, ప్రజాసేవ ద్వారా కొత్త ముద్ర వేయాలని విద్యా రాణి భావిస్తున్నది… అటు సీమాన్ వ్యూహాలు, ఇటు వీరప్పన్ వారసురాలి ఎంట్రీతో మెట్టూరు నియోజకవర్గం ఇప్పుడు తమిళనాడు రాజకీయాలకు హాట్ స్పాట్‌గా మారింది…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • కాషాయం వదిలేసిన పులిబిడ్డ … తమిళ జాతీయవాదానికి సై…
  • సో కాల్డ్ కాంగ్రెస్ సీనియర్లు..! ఏదేదో మాట్లాడేస్తున్నారు..!!
  • అనేకానేక ‘మొగుడు’ సినిమాల్లో… ఇతడు ఈవీవీ మార్క్ ‘దొంగ మొగుడు…
  • ప్రతి పదమూ ఓ మంగళ వాయిద్యంగా వినిపించే పెళ్లి మురిపెం..!!
  • ఇండియా తొలి ప్రైవేటు శాటిలైట్ టీవీకి ఎన్నెన్నో పురిటినొప్పులు..!!
  • పెట్రో పానిక్ – చమురు పరుగులు…! మూసీపై మాత్రం ఏడుపులు..!!
  • హుందాగా సౌత్ ఇండస్ట్రీ ప్రశంసలు… కుళ్లుతో నిశ్శబ్దంగా బాలీవుడ్…
  • FDC కి సారథే లేడు..! ఢిల్లీలో స్టాల్ దేనికి..? ఏముందని..?
  • ఈ చమురు పాలిటిక్స్‌ను యండమూరి 1978లోనే చెప్పాడు…
  • IPL … అంటే ఇండియన్ ప్రీమియర్ లీగ్ కాదు… ఇండియన్ పైసా లీగ్…

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions