Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

పోలీసులు భలే పట్టేశారు దొంగను… అయితే ఇక్కడ కొన్ని వేధించే ప్రశ్నలు…

July 17, 2022 by M S R

ముందుగా ఓ వార్త చదవండి… చైనాలోని ఫుజియాన్ ప్రావిన్స్‌లోని ఫుజౌ… ఓ దొంగ ఒక రెసిడెన్షియల్ కంపౌండ్‌లోకి అర్ధరాత్రి ఒంటిగంట ప్రాంతంలో ప్రవేశించాడు… విలువైనవిగా కనిపించినవి మూటగట్టుకున్నాడు… మెయిన్ డోర్ జోలికి పోలేదు… తను జొరబడటమే బాల్కనీ నుంచి… కిచెన్‌లోకి వెళ్లాడు… రెండు ఎగ్స్, నూడుల్స్ వాడుకుని ఓ వంట ప్రిపేర్ చేసుకున్నాడు… కడుపు నిండా తిన్నాడు… ఓ బ్లాంకెట్ కప్పుకుని కాసేపు ముసుగుతన్నాడు…

కానీ దోమలు… నిద్ర రావడం లేదు… వెతికితే మస్కిటో కాయిల్స్ కనిపించాయి… వెలిగించాడు… ఐనా లాభం లేదు… తన రక్తం తాగి గోడ మీద వాలిన రెండు దోమల్ని కొట్టేశాడు… అవి కింద పడ్డాయి… అవి తాగిన దొంగ రక్తం ఆ గోడ మీద మరకగా మిగిలింది… కాసేపాగి తన దోవన తను వెళ్లిపోయాడు… తెల్లవారాక పోలీసులు వచ్చేశారు… ఫోరెన్సిక్ వాళ్లు వేలి ముద్రల కోసం వెతుకుతున్నారు… నేల మీద పడ్డ రెండు దోమల మృతదేహాలు కనిపించాయి… గోడ మీద రక్తపు మరకలు కనిపించాయి… అవి ఎప్పటివో పాతబడిన మరకలుగా గాకుండా తాజా మరకలు అని గుర్తించారు…

సో, ఆ నెత్తుటి మరకలు, మరణించిన ఆ దోమలవే అని నిర్ధారించుకుని, కలెక్ట్ చేసి, డీఎన్ఏ పరీక్షలకు పంపించారు… పరీక్ష ఫలితాలు వచ్చాయి… తమ దగ్గరున్న డీఎన్ఏ డేటాతో సరిపోల్చారు… చాయ్ అనే ఇంటిపేరున్న ఓ పాత దొంగ రికార్డుతో సరిపోయింది… మొన్నటి నెలాఖరున వాడిని అరెస్టు చేశారు… నాలుగు తగిలించారు… నేరం అంగీకరించాడు… అదొక్కటే కాదు, మరో నాలుగు దొంగతనాలు చేసినట్టు కూడా చెప్పాడు…

చైనీస్ సోషల్ మీడియా వుయ్ చాట్, వీబోలలో పోలీసులే ఈ వివరాలన్నీ చెప్పారు… అనేక నేరాల్లో డీఎన్ఏ రికార్డులు సాయపడుతున్నాయనీ వివరించారు… ఓ చైనీస్ మీడియా ఈ వార్త రాస్తూ… కొన్నాళ్ల క్రితం తూర్పు చైనాలోని జీజాంగ్ పోలీసులు ఇలాగే ఓ కేసు ఛేదించారని గుర్తుచేసింది… ఓ మహిళ ఓ మొక్కజొన్న కంకిని ఎన్నో అంతస్థుల పైనుంచి కిందకు నిర్లక్ష్యంగా విసిరేసింది… అది నేల మీద ఓ ముసలావిడి ఎత్తుకునిపోతున్న ఎనిమిదేళ్ల ఓ బేబీ తలకి తగిలింది… తీవ్రంగా గాయం, రక్తం… హాస్పిటల్‌కు పంపించారు…

Ads

ఎవరిని అడిగినా ఆ కంకిని ఎవరు విసిరారో ఎవరూ అంగీకరించలేదు… ఆ కంకిని కొరికిన ఎంగిలి (ఉమ్మి)ని జాగ్రత్తగా కలెక్ట్ చేసి డీఎన్ఏ పరీక్షలకు పంపించారు… ఫలితాల్ని ఆ అపార్ట్‌మెంట్లలో ఉండే మహిళల్లో ఎవరైతే సంఘటన రోజు మొక్కజొన్న కంకులు కొన్నారో, వారి డీఎన్ఏ డేటాతో సరిపోల్చారు… జూ అనే మహిళ డేటాతో సరిపోలింది… ప్రశ్నిస్తే మొదట మొరాయించింది… కానీ చివరకు అంగీకరించింది… కావాలని కాదు, రూఫ్ మీద ఎండిన బట్టల్ని కలెక్ట్ చేసుకుంటూ చేతిలో ఉన్న కంకిని పారేశానని చెప్పింది… ఆమెను అరెస్టు చేశారు… ఇదీ వార్త… కనీసం పదిశాతం కేసుల్ని డీఎన్ఏ డేటా పరిష్కరిస్తోంది… ఇదీ చైనా పోలీసులు అబ్జర్వేషన్…

సీన్ కట్ చేయండి… ఇండియాకు రండి… పాత నేరస్థుల డీఎన్ఏ తీసి, ఆ డేటాను అన్ని ప్రాంతాల పోలీసులకు అందుబాటులో ఉంచాలని ప్రభుత్వం అనుకుంది, ఓ బిల్లు ప్రవేశపెట్టింది… అదొక రచ్చ… గోప్యత హక్కు, డేటా సెక్యూరిటీ హక్కు అంటూ అడ్డుపడ్డారు… మీడియాలో నెత్తిమాశిన వ్యాసాలు… అనుమానితుల డీఎన్ఏ సేకరించడానికి కూడా ఆ బిల్లు ఉపకరిస్తుంది… నిజానికి ఒక వ్యక్తి నడత మంచిదైతే తన డీఎన్ఏ వివరాలు పోలీసుల దగ్గర ఉంటే ఎందుకు భయపడాలి..? ఈ ప్రశ్నకు మాత్రం ఎవడూ జవాబు చెప్పడు… అదీ ప్రజలందరి డీఎన్ఏ డేటా కలెక్ట్ చేస్తామంటే ఏమంటారో ఇక..? డీఎన్ఏ పరీక్షలకు విస్తృత అందుబాటు కూడా అవసరం… ప్రస్తుతం 70 దేశాలు డీఎన్ఏ డేటా విషయంలో కఠినంగా ముందున్నాయి… ఇండియాలో మాత్రం ఇలాంటివి చెల్లవు…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • విషాదమే… కానీ ఉన్మాదం… కర్నాటక సర్కారు ఘోర వైఫల్యం…
  • ఒక ఫోటో… కవితకు అసలు తెలియదో లేదో… గుర్తుందో లేదో ఫాఫం…
  • 500 రూపాయల నోట్ల చెలామణీపై వార్తలేమిటి..? నిజాలేమిటి…?
  • బాలీవుడ్ డింపుల్ క్వీన్… ప్రీతి మరో మొహం… 34 మంది పిల్లల తల్లి…
  • ఆ పాత్ర దెబ్బతినేసింది… ఫాఫం రాజేంద్ర ప్రసాద్ మెడ విరిగింది…
  • మాటే పాటైనవాడు. పాటే బాటైనవాడు. మనకు కర్ణామృతమైనవాడు
  • ఎంత డబ్బిచ్చినా సరే.., మోహన్‌బాబుతో మాత్రం పోను అంటుందామె..!!
  • రేయ్, ఫుడ్ బ్లాగర్లూ… నా మొహం కూడా మాడింది ఆ మసాలా దోశలాగే…
  • 2 ఫ్లాట్లు… 639 కోట్ల రికార్డు ధర… ఇంతకీ ఆ ధనికురాలు ఎవరంటే..?
  • అదే సీన్… 2 పాటలు… ఒకటి తండ్రి, మరొకటి కొడుకు… కానీ ఎంత తేడా…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions