కడుపు చించుకుంటే కాళ్ల మీద పడుతుంది… వర్తమాన జర్నలిజం గురించి ఏం రాసినా అంతే… ఎవరో పెద్దగా సాధనసంపత్తి లేని, అనుభవశూన్యులైన, శిక్షణ లేని జర్నలిస్టులు ఏదో రాస్తే, యూట్యూబ్‌లో ఏదో చూపిస్తే… వాళ్ల స్థాయి అదేనని జాలి చూపించవచ్చు… కానీ డెక్కన్ క్రానికల్ వంటి సుదీర్ఘ చరిత్ర ఉన్న పత్రిక కూడా తప్పు చేస్తే..? దాన్నేమనాలా..? జాలిపడటం కాదు, కోపగించాలి… ఈ కథనం అదే…
సోషల్ మీడియా కథ వేరు… ఎవడో ఏదో రాస్తాడు, ఏదో కూస్తాడు… జవాబుదారీతనం ఏముంది అందులో..? 60, 70 శాతం ఫేక్ అకవుంట్లు, పార్టీల సోషల్ మీడియా వింగ్స్ అబద్ధాలు, బురదకు మాత్రమే ఇప్పుడు ఫేస్‌బుక్, ట్విట్టర్ ఉపయోగపడుతున్న దరిద్రం ఇప్పుడు… సో, అందులో వచ్చిన ఏ పోస్టునైనా నమ్మడానికి లేదు, అలాగని తీసిపారేయాల్సిన పని కూడా లేదు…
సినిమా వాళ్ల ఫ్యాన్స్, రాజకీయ నాయకుల సోషల్ వింగ్స్ సక్సెస్‌ఫుల్‌గా సోషల్ మీడియాను భ్రష్టుపట్టించాయి కాబట్టే ఇదంతా చెప్పుకోవడం… కానీ మెయిన్ స్ట్రీమ్‌లోని టీవీలు గానీ, పత్రికలు గానీ ఒకటికి రెండుసార్లు వార్తను ధ్రువీకరించుకోవాలి… అది జర్నలిజంలోని బేసిక్ రూల్, బేసిక్ సెన్స్… ఒకవేళ సోషల్ మీడియాలో వచ్చిన ఏదేని వార్తను పబ్లిష్ చేయాల్సి వస్తే ధ్రువీకరించుకోవడంతోపాటు వాల్యూ యాడిషన్ జరగాలి, కన్సర్న్‌డ్ వ్యక్తుల వివరణ కూడా ట్రై చేయాలి… అది కనీసవిధి…
Ads
డెక్కన్ క్రానికల్ ఒక వార్త విషయంలో ఇవేవీ పట్టించుకోలేదు… అత్యంత బాధ్యతారహితంగా రోజా మీద ఓ వార్తను వేసిపారేసింది… సంస్కారం గురించి పవన్ కల్యాణ్ మాట్లాడటం సన్నీలియోన్ వేదాలు వల్లించినట్టుంది అనేది రోజా విమర్శ… అది పవన్ కల్యాణ్ మీద విమర్శ… సన్నీ లియోన్‌ను టార్గెట్ చేసింది కాదు, పైగా అందులో ఆమెను బూతుతార అని ఏమీ ప్రస్తావించలేదు… పైగా సన్నీ లియోన్ పాత వృత్తి అందరికీ తెలుసు… కానీ సన్నీలియోన్ పేరిట ఆ ట్వీట్‌కు రిప్లయ్ కనిపించింది సోషల్ మీడియాలో…
నేను ఆ వృత్తిలో గతంలో ఉన్నాను… దాని గురించిన చింత నాకేమీ లేదు ఇప్పటికీ… మీలాగా కాదు, నేననుకున్నది ధైర్యంగా చేశాను… తేడా ఏమిటంటే, నేను ఆ ఇండస్ట్రీ వదిలేశాను, మీలాగా పట్టుకు వేలాడటం లేదు…. అనేది ఆ రిప్లయ్ సారాంశం… ఆ ట్వీట్ ఆధారం చేసుకుని డెక్కన్ క్రానికల్ పత్రిక ఏకంగా రోజాకు సన్నీలియోన్ కౌంటర్ అంటూ పెద్ద ఫీచర్ రాసిపారేశారు.
చూస్తేనేమో ఆ సన్నీలియోన్ ట్విట్టర్ ఖాతా అసలైంది కాదని, ఎవరో ఒక నకిలీ ఖాతా తెరిచి అందులో నుంచి రోజాకు రిప్లై ఇచ్చారని తేలింది. ఆ ట్విట్టర్ ఖాతా నకిలీది అని తెలియని క్రానికల్ విలేకరి ఏకంగా పెద్ద వార్త రాసి, రోజా ప్రతిష్టకు భంగం కలిగించాడు… దీన్ని వైఎస్సార్ కాంగ్రెస్ సోషల్ మీడియా విభాగం పట్టుకుని ట్విట్టర్ లో డెక్కన్ క్రానికల్ ఎడిటర్ మీద కామెంట్ల దండ యాత్ర చేసింది.. తలాతోకా లేకుండా వార్తలు రాస్తారా అంటూ ఎటాక్ చేసేసరికి పాపం ఎడిటర్ రోజాకు క్షమాపణ చెప్పాడు… ఈరోజు పత్రికలో ‘సంతాపం’ కూడా ప్రచురించారు… సోషల్ మీడియాను నమ్మి వార్తలు రాస్తే, ఇదుగో ఇలాగే ఉంటుంది…
Share this Article