Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

వెకిలితనం… వెగటుదనం… అదొక దిక్కుమాలిన షో… ఓ నెత్తిమాశిన హోస్ట్…

July 27, 2022 by M S R

మనకూ ఉన్నాయి వందలాది యూట్యూబ్ చానెళ్లు… థంబ్ నెయిల్ జర్నలిజం అనే పేరు కొత్తగా కాయిన్ చేయబడింది వీటితోనే… షాక్ తింటారు, కన్నీళ్లు ఆగవు, ఏడ్చేస్తారు భయ్యా, కుమ్మేసింది, అన్నీ చూపించింది, సెగలు పుట్టించింది వంటి చెత్తా టైటిళ్లు ఇప్పుడు పాతబడిపోయాయి… పెట్టే టైటిల్ ఒకటి, లోపల రాసే రాతలు మరొకటి… పూర్తిగా ప్రేక్షకులను తప్పుదోవ పట్టించే రాతలు, చేష్టలు… సరే, వాటి మీద సమీక్ష కాదు ఇది… కానీ హిందీలో వచ్చే కరణ్ జోహార్ చాట్ షో ఉందికదా, కాఫీ విత్ కరణ్ షో… ఇది వందల తెలుగు యూట్యూబ్ వీడియోలను మించిన దరిద్రం…

టీవీలు, ట్యూబ్ వీడియోల్లో, ఓటీటీల్లో సెలబ్రిటీలను కూర్చోబెట్టి అడ్డమైన ప్రశ్నలడగడం, ఏవో పిచ్చి గేమ్స్ ఆడించడం ఏనాటి నుంచో ఉన్నదే… ఎక్కువగా వాటికి హాజరయ్యేది సినిమాలు, టీవీల తారలే… పొలిటిషియన్స్, ఇతర సెలబ్రిటీలు రారు… వ్యక్తిగత అంశాలపై కుచ్చి కుచ్చి పిచ్చి ప్రశ్నలు వేస్తే లేచి అక్కడే యాంకర్స్‌ను తంతారు వాళ్లు… పైగా సినిమా వాళ్లయితే ప్రేక్షకులు కాస్త ఆసక్తిగా చూస్తారు… లలిత్ మోడీ ఎవరి సాయంతో విదేశాలకు పారిపోయాడనే స్టోరీని ఎవడూ చూడడు… సుస్మితా సేన్‌తో డేటింగ్ స్టోరీని కోట్లల్లో చూస్తారు…

ప్రస్తుతానికి వస్తే… ఈ కాఫీ విత్ కరణ్ షో పరమ నాసిరకం… ఇది ఇప్పటికే ఆరు సీజన్లు పూర్తిచేసుకుందట… ఇప్పుడు ఏడో సీజనట… ఇందులోనే సమంత తన పాత మొగడు చైతూ మీద ఏదేదో ఏడ్చింది… జాన్వీ కపూర్, ఆలియా భట్, రణబీర్‌సింగ్, అక్షయ్, సారా అలీ ఖాన్, విజయ్ దేవరకొండ, అనన్య పాండే గెస్టులుగా వచ్చారు… పిలిచేదేమో పెద్ద కేరక్టర్… అసలే బాలీవుడ్ మాఫియా… షోకు గెస్టుగా పిలిస్తే కాదనలేరు… తీరా అక్కడికి వెళ్లాక కరణ్ అనబడే చెత్తా కేరక్టర్ అడిగే ప్రశ్నలన్నీ…. గెస్టుల అక్రమ సంబంధాలు, డేటింగులు, బ్రేకప్పులు, కొత్త రిలేషన్స్, ఫస్ట్ అనుభవాల కథలు, ఆపుకోలేని తమకాలు… అన్నీ ఇలాగే ఉంటయ్… తాజాగా విజయ్ పాల్గొన్న షో ట్రెయిలర్ ఓసారి చూడండి, క్లారిటీ వస్తుంది… ఈ షో ఏమిటో కూడా తెలుస్తుంది… ((ఓటీటీ ప్రోగ్రామ్స్ అంటే ఖచ్చితంగా ఇలాంటి ‘ఏ’ మసాలా ఉండాలా..?)

Ads

నిజానికి ఒరిజినల్ వీడియోలు చూసేది తక్కువే… కానీ అందులో కంటెంటును పార్టులుగా పార్టులుగా పీకి, ఇంకాస్త మసాలా జల్లి, యూట్యూబర్లు, మీడియా, సోషల్ మీడియా యాక్టివిస్టులు కొత్త కొత్తగా రాసుకుంటారు… కొందరు మాత్రమే కొన్ని ప్రశ్నలకు ఆన్సర్ ఇవ్వరు, కానీ మొహమాటం, ఒత్తిడి… ఏదో వాగి, బదనాం అవుతుంటారు… కొందరు దులిపేసుకుని, ఏమైనా చూపించుకోనీ అనుకుంటారు… ఈ సీజన్‌లో ఆల్‌రెడీ ఆలియా భట్, రణబీర్ సింగ్ కరణ్ బారిన పడ్డారు కదా… ఆ ఇద్దరి నిజజీవిత భాగస్వాములు దీపిక పడుకోన్, రణబీర్ కపూర్ మాత్రం ఎహెపో అని ఆ షోకు వెళ్లడానికే తిరస్కరించారుట… పలుసార్లు అడిగినా కుదరదు, ఇష్టం లేదు అని చెప్పేశారుట… అదీ నచ్చింది…

deepika

అంటే వీళ్లు ఇలాంటి షోలు, ఇంటర్వ్యూలకు దూరమని కాదు… కాకపోతే కరణ్ షో నడిచే తీరు మీద వాళ్లకు సదభిప్రాయం లేదు… పైగా వీళ్ల వ్యక్తి‘గత’ జీవితాల్లో చాలా వెలుగునీడలున్నయ్… అవన్నీ షేర్ చేసుకోవడం ఇష్టం లేదు… ఒక దశలో తను వ్యక్తిగత జీవితంలోని ప్రెజర్ తట్టుకోలేక, బ్యాలెన్స్ చేసుకోలేక దీపిక మెంటల్‌గా కూడా డౌన్ అయిపోయింది… ఇప్పుడు ఈ దిక్కుమాలిన షోకు వెళ్తే మళ్లీ అన్నీ అవే ప్రశ్నలు… అవీ మర్యాదకరంగా ఏమీ ఉండవు… వెకిలిగా, వెగటుగా… ఏముంటుంది..? తవ్వేకొద్దీ పెంకాసులే, పాత శిథిలాలే కదా…

సో వాట్..? కరణ్ అయితే ఏంటట..? తమ ప్రైవసీని తాకట్టు పెట్టి, తమను తవ్వీ, గెలికీ టీఆర్పీలు, వ్యూస్ కోసం గుచ్చబడే వెకిలి ప్రశ్నలకు జవాబులు ఇవ్వాలా..? ఎస్, దీపిక నిర్ణయం కరెక్టు… ఎస్, రణబీర్‌ కపూర్ నిర్ణయం కరెక్టు… మరి వీళ్ల ఒరిజినల్ లైఫ్ పార్టనర్స్ వెళ్లారు కదా అనేది ఓ చిక్కు ప్రశ్న… అది వాళ్ల ఖర్మ అని వదిలేసి ఉంటారు… సరే, ఇవన్నీ ఎలా ఉన్నా… నిజంగానే ఈ తోపు కరణ్ ఒక్కసారి…. కంగనా రనౌత్‌ను పిలిచి, తనకు అలవాటైన వెకిలి ప్రశ్నలు సంధిస్తే ఆమె ఎలా స్పందిస్తుందో చూడాలని ఉంది… ప్చ్, ఈ కోరిక తీరుతుందో లేదో…!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • పేరుకు గోల్డ్ ఫ్లేక్ కింగ్ … గణేష్ బీడీ పొగ… శ్రీశ్రీశ్రీ రాజావారి లంకచుట్ట పొగ…
  • ఇండియాలోకెల్లా హయ్యెస్ట్ పెయిడ్ ఫిమేల్ టీవీ ఆర్టిస్ట్ ఎవరో తెలుసా..?!
  • వేములవాడ ఆవులు, కోడెల ఉసురు ఎవరికి తగలబోతోంది..?!
  • ఈవారం తెలుగు టీవీ వినోద చానెళ్ల స్థితిగతులు, రేటింగులు ఇవీ…
  • తెలుగు టీవీ న్యూస్ చానెళ్లలో ప్రస్తుతం ఎవరు ఏ ప్లేసులో..?!
  • బాలయ్య దంచూదంచూ అని దరువేశాడు గానీ… దంచికొట్టింది భానుమతే…
  • ఫాఫం అనసూయ..! కాస్త మారిందేమో అనుకున్నారా..? నో, నెవ్వర్..!!
  • ట్రంపుపై మస్క్ పేల్చిన చీకటి బాంబు… అమెరికాలో కలకలం… అసలు కథ ఇదీ…
  • దిక్కుమాలిన క్షుద్రానువాదాలు… దరిద్రపు పర్యవేక్షణ అంటే ఇదే…
  • సిల్క్ స్మిత హర్టయ్యింది… ఆ గ్రేట్ కొరియోగ్రాఫర్ కెరీర్ క్లోజయ్యింది…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions