….. యూట్యూబ్ చానెల్ ఉంది కదాని ఏది పడితే అది రాస్తే… కొన్నిసార్లు బూమరాంగ్ శతఘ్నులై రివర్స్ వచ్చి, వాళ్ల మీదే పేలిపోవచ్చు కూడా… భావప్రకటన స్వేచ్చ గట్రా పదాలు ఏవీ రక్షించలేవు… పెద్ద పెద్ద మీడియా హౌజుల ఎడిటర్లు, ఓనర్లే కొత్తగా పరువునష్టం దావాలకు యాడ్ అయిపోయిన క్రిమినల్ కేసులకు భయపడిపోతున్నారు… పరువునష్టం కేసులు వేసుకుంటే వేసుకోనీ అనే ఓ బేఫర్వా వైఖరి గతంలో ఉండేది… కానీ ఎప్పుడైతే క్రిమినల్ కేసులు అంటున్నారో ఆ ధీమాలు, విశ్వాసాలు పగిలిపోతున్నయ్…
ఒక యూట్యూబర్… బీహార్… హీరో అక్షయ్ కుమార్ మీద ఎడాపెడా వీడియోలు, ఫోటోలు పెట్టేసి, తోచిన ప్రతి కథా పెట్టేశాడు… మరీ ఇప్పుడు ముంబై సినిమా ఫీల్డులో సుశాంత్ ఆత్మహత్య కేసు హాట్ టాపిక్ కదా… పైగా ఆర్నబ్ గోస్వామి దాకా ఆ సెగ పాకిపోయింది… సుప్రీం దాకా వెళ్లింది… ముంబై పోలీసులు అసలే ఈ కేసు మీద జరిగే ప్రచారాలన్నింటి మీద కసికసిగా ఉన్నారు… ఎందుకంటే… చాలా సైట్లు, ట్యూబ్ చానెళ్లు శివసేన యువరాజు ఆదిత్య ఠాక్రేను ఇందులోకి లాగుతున్నారు గనుక…
ఈ ట్యూబర్ అక్షయ్ కుమార్ మీద ఎడాపెడా రాసేస్తూ… సుశాంత్ మాజీ ప్రియురాలు రియా కెనడాకు పారిపోయి తప్పించుకోవడానికి అక్షయ్ సాయం ఉందనీ, ఆదిత్య ఠాక్రేతో, పోలీసు అధికారులతో రహస్య భేటీలు జరిగాయని పోస్టులు పెట్టేసింది… ఎవరో చూపించేసరికి అక్షయ్‌కు ఎక్కడో కాలింది… అసలే తను కాస్త నేషనలిస్టిక్ నేచర్… తనను ఈ సుశాంత్ హత్య కేసులోకి లాగుతూ ఉండటంతో… ఇక ఓ లీగల్ నోటీసు పంపించాడు… ఎంతకో తెలుసా..? 500 కోట్లు… మీరు సరిగ్గానే చదివారు… అక్షరాలా అయిదు వందల కోట్లు… ఆ చానెల్ పేరు ఎఫ్ఎఫ్ న్యూస్… ఓనర్ పేరు రషీద్ సిద్దిఖి…
Ads
వాడెవడో పొట్టతిప్పల కోసం పనిచేసుకునేవాడు… ఈడ్చితంతే నలభై యాభై వేలు రాలవు… ఈ 500 కోట్లు మాటేమిటని ఆశ్చర్యపోకండి… అదీ అక్షయ్ రేంజులో ఉండాలి కదా మరి… ‘‘బాబూ, నువ్వు ఆధారాల్లేని పిచ్చి పిచ్చి ఆరోపణలతో వీడియోలు పెట్టేస్తున్నావు… నువ్వు గనుక మూడు రోజుల్లో బేషరతు క్షమాపణలు చెప్పి, ఆ స్టోరీ వీడియోలన్నీ డిలిట్ కొట్టకపోతే కోర్టుకు ఈడుస్తాను, 500 కోట్ల పరిహారం కట్టాల్సి ఉంటుంది’’ అనేది ఆ నోటీసుల సారాంశం…
ఇది సరే… ముంబై పోలీసులు కూడా అర్జెంటుగా ఓ కేసు బుక్ చేశారు… అదీ పరువునష్టం కేసే… అయితే అది తమను పరువు నష్టం పాలుజేస్తున్నారనేది కేసు… రషీద్ ఆల్రెడీ యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకున్నాడు… అదంతా వేరే కథ… అయితే 500 కోట్లకు పరువు నష్టం దావా వేయగానే సరిపోదు… దానికి సరిపడా అయిదు నుంచి పది కోట్ల దాకా అక్షయ్ డిపాజిట్ చేయాల్సి ఉంటుంది… ఒకసారి కోర్టుకు డబ్బు డిపాజిట్ చేశాక కథ తెలిసిందే కదా… ఇవి గాకుండా కోర్టు ఫీజులు కూడా భారీగానే ఉంటయ్… లీగల్ సర్వీసు ఛార్జీలు సరేసరి… ఇంతాచేస్తే, చివరకు సదరు రషీదుడు క్షమాపణలు చెప్పి, ఆ వీడియోలన్నీ డిలిట్ చేసి, కోర్టు ముందు కూడా తలవంచి సారీ చెబితే… మరి ఈ ఖర్చులన్నీ..?
సో, భారీగా నష్టపరిహారం, పరువునష్టం దావాలు వేయడం కాదు పరిష్కారం… అదేసమయంలో ఏదిపడితే అది రాసేస్తే, ఇంతకుముందులా ఈజీగా సేఫ్‌గా చెలామణీ కావచ్చుననే భ్రమలూ అవసరం లేదు… అదీ ఈ స్టోరీలోని చివరి నీతివాక్యం…
Share this Article