demigods are more powerful than original gods… నిజమే… వ్యక్తిపూజ నరనరాన ఇంకిన మన దేశంలో దేవుళ్లు కోట్లాదిమంది ఉండవచ్చుగాక… కానీ వాళ్లకు మించిన దేవుళ్లు సినిమా హీరోలు, వాళ్ల కొడుకులు, బిడ్డలు, నాయకులు ఎట్సెట్రా… సైకోఫ్యాన్స్… ఈ ఫ్యాన్స్ భజనలతో వీళ్లు కూడా తాము నిజంగానే దైవాంశ సంభూతులమేమో అనే సందేహంలో పడి, అది ముదిరి, చివరకు అవే భ్రమల్లో కూరుకుపోతారు… అంతెందుకు..? అసలు దేవుళ్ల దగ్గరకు పూజకు వెళ్లడానికి కూడా పౌండ్రక వాసుదేవుళ్ల రేంజులో కదిలి వెళ్తుంటారు…
సోషల్ మీడియాలో దాదాపు ప్రతి సెలబ్రిటీకి ఓ ట్రోలింగ్ బ్యాచ్ ఉంటుంది… వాళ్ల పని ఒక్కటే… ఎవడైనా తమ దేవుడిని ఏమైనా అంటే రెచ్చిపోయి బూతులతో దాడి స్టార్ట్ చేయడమే… వాడికి వేరే బుర్ర ఉండదు… తెలుగు సినిమాలకు సంబంధించిన పైత్యాలు బహుముఖాలు… అంటే కేవలం నటన, తొక్కాతోలు అక్కర్లేదు… వయస్సు, లుక్కు అస్సలు అక్కర్లేదు… కులం ముఖ్యం… అక్కడికి వాళ్లు తమ కులాలకు ఏదో తోడిపెడుతున్నట్టు..?
ఆచార్య సినిమా గురించి కాసేపు వదిలేయండి… చిరంజీవి ఆలోచన ధోరణి ఇలాగే కొనసాగితే ప్రేక్షకుల తిరస్కరణ ఇంకా పెరుగుతుంది… కానీ మొన్న ఆయన గారి కొడుకులుంగారు శ్రీమాన్ రాంచరణ్ విజయవాడలో అమ్మవారి గుడికి వెళ్లిన తీరు, అక్కడ తన అభిమానుల ధోరణి ‘‘చిల్లరన్నర’’… చీదరన్నర… ఈమధ్యకాలంలో దేవుళ్ల దగ్గర కూడా ఈస్థాయిలో తమ అట్టహాసాన్ని, దర్పాన్ని, అవిధేయతను… ఇంకా చాలా చాలా లక్షణాల్ని చూపించుకున్న దృశ్యం మరొకటి లేదు…
Ads
నిజంగా ఓ పవిత్రస్థలిని రాంచరణ్ అభిమానులు అపవిత్రం చేశారు… డౌట్ లేదు… సదరు అమ్మవారి మీద రాంచరణ్‌కు, ఆయన తండ్రికి ఏమాత్రం విశ్వాసం ఉన్నా, భక్తి ఉన్నా క్షమాపణలు చెప్పేవారు… తమ అభిమానులకు ఓ బహిరంగ మందలింపు వచ్చి ఉండాల్సింది… అవేమీ లేవు… అన్నింటికీ మించి ఆశ్చర్యపరిచిన ఓ సమాచారం ఏమిటంటే..? రాంచరణ్ వెళ్లిపోయాక పూజారులు సంప్రోక్షణ చేశారట… మంచిదే… కొంత శుద్ధి అవసరమే… కానీ నిజానికి శుద్ధి అనేది అక్కడి ఈవో భ్రమరాంబ అమ్మవారిని అక్కడి నుంచి బదిలీ మీద పంపించడంతో ప్రారంభం కావాలి…
రాంచరణ్ ఫ్యాన్స్ అపచారాలకు అక్కడ యంత్రాంగానిదే బాధ్యత… అంతమంది ఎలా వచ్చారు..? అసలు అంతమంది బౌన్సర్లు, పోలీసుల రక్షణ, చుట్టూ వలయం దేనికి..? ముఖమండపం దాకా ఎవరు పడితే వారు వచ్చేయవచ్చా..? అంటే గుడిలో భద్రత ఏర్పాట్లు అంత ఘోరంగా ఉన్నాయా..? రేప్పొద్దున ఏ అల్లరి గుంపైనా అలవోకగా అక్కడిదాకా జొరబడవచ్చా..? మొత్తం ఏపీ దేవాదాయశాఖ సిగ్గుతో తలదించుకోవాలి… బట్, అక్కడ ఎవరి మీద ఏ చర్యలూ ఉండవు…
ఎందుకంటే..? జగన్‌కు తీరిక లేదు… మంత్రులకు నిర్ణయాధికారం లేదు… తాడేపల్లి నుంచి ఆర్డర్స్ రానిదే అధికారులు కదలరు… పైగా చిరంజీవి మన శ్రేయోభిలాషి… ఆయన కొడుకు ఏం చేసినా పర్లేదు… సోకాల్డ్ హిందూ పరిరక్షక ఫోజుధారులు బీజేపీ లీడర్లు, శారదా పీఠ హిందూమత మహా సంరక్షకులకు కూడా నోటమాట పెగలదు… మరి రాంచరణ్ జోలికి వెళ్లేంత సాహసమా వాళ్లకు..?
అందుకే అప్పుడప్పుడూ అనిపిస్తుంది నిజంగా ఈ ప్లేసులో యోగి ఉండి ఉంటే..? తప్పకుండా ప్రభుత్వం వైపు నుంచి చర్య ఉండేది… ఉండేది… చిరంజీవా..? సో వాట్..? అంటూ నాలుగు బుల్‌డోజర్స్ ఫోర్త్ గేర్స్ వేసుకునేవి… చెప్పినట్టు వినకపోతే థియేటర్ల నుంచి ఆచార్య బొమ్మే మాయమయ్యేది… కానీ జగన్ కదా… సార్, సార్, పాపం, సినిమా డిజాస్టర్ అట… ప్రేక్షకులు ఇక వచ్చే స్కోప్ లేదు, మరింతగా టికెట్ల రేట్లు పెంచుకోవడానికి పర్మిషన్ ఇచ్చేయండి ప్లీజ్ …! అమ్మవారి గుడే కదా, అపవిత్రమైతే ఎవడికేం పట్టింది..!! ఎన్ని సంఘటనలకు భక్తగణం లోలోపల కుమిలిపోవడం లేదు… ఇదీ అంతే…
Share this Article