.
Sreekumar Gomatham ……. మనుషులందరూ ఏదో రకంగా అవకాశవాదులే! Those who can afford, cross the border legally finding loopholes. Those who can’t, cross the border illegally finding holes.
నేను, నా లాంటి కొన్ని లక్షల మందికి, మేమేదో పెద్ద పీకేసామనో, సూపర్ స్మార్ట్ అనో, ఇక్కడికొచ్చి వాళ్ళను ఏదో ఉద్ధరిస్తామన్న ఉద్దేశంతో పిలిచి మరీ అమెరికా వాళ్ళు వీసా ఇవ్వలేదు. అవకాశం వచ్చింది వాడుకున్నాం. అలాంటి నిజమైన ఉద్దారకులు ఒక లక్షలో పది మంది ఉంటారేమో! కాదనట్లేదు.
Ads
ఇక్కడ employer లకు skilled labor (చీప్ గా) దొరకట్లేదు కాబట్టి బయట దేశాల నించి తెచ్చుకుందాం అన్నది H1B ఉద్దేశం. Consultancies పేరుతో దళారీ వ్యవస్థ తయారు చెయ్యాలని కాదు. కానీ తయారయ్యింది, లీగల్ గానే! అవి కంపెనీలు పెట్టిన వాళ్లకు వచ్చిన అవకాశం.
1996 లో MCA అయ్యాక బాంబేలో అవకాశం వచ్చిందని 1997లో అక్కడికి వెళ్లా. అవకాశం వచ్చిందని 1998 లో అమెరికా వచ్చా. నాకు ఆ రెండూ సమానమే. దేశం మారితే laws, rules, regulations మారుతాయి కానీ, బ్రతుకు తెరువు కోసం, ఇంకా మంచి (?) జీవితం కోసం మనిషి పడే తపన, ఆరాటం మారవు. కొందరు ఇంకా ఇంకా సంపాదించాలి అన్న ఆశ తో అవకాశాలు వెతుక్కుంటారు. అత్యాశ ఉంటే ఫ్రాడ్ చేసే అవకాశాలు వెతుక్కుంటారు.
లేని డిగ్రీలు కొనుక్కొని H1B వీసాలు తెచ్చుకున్న వాళ్ళు, ఉన్నత విద్య పేరుతో F1 (కొనుక్కొని) తద్వారా H1B కోసం ఎదురు చూసే వాళ్ళు, లేని experience పెట్టి అమెరికన్ల నెత్తిన చెయ్యిపెట్టి, ఇంకెవరితోనో ఇంటర్వ్యూలు చేయించి ఉద్యోగాలు తెచ్చుకునే వాళ్ళు, వాళ్ళని ఎంకరేజ్ చేసి, ఫోర్జరీలు ఫ్రాడ్ లు చేసి సపోర్ట్ చేసే వాళ్ళ employers – ఇలా ప్రతీ ఒక్కరూ వాళ్లకు వచ్చిన అవకాశాల్ని వాడుకుంటున్న వాళ్ళే.
మూడు పూటలా తిండి కోసం కొందరు, ఉన్న చోట బ్రతుకు భయంతో కొందరు, ఇలా ఏదో రకంగా మనుషులు అవకాశం ఉన్న చోటికి వలస పోతూనే ఉన్నారు, ఉంటారు. జంతువులూ, పక్షులూ పోతాయి వనరులు ఉన్న చోటికి.
ఇల్లీగల్ గా లక్షన్నర మంది భారతీయులు వచ్చారట పోయిన సంవత్సరం! Immigration laws ప్రకారం ఇల్లీగల్ గా వచ్చిన వాళ్ళు దొరికితే వెనక్కి పంపించడం అనేది అమెరికా వాళ్ళ సమస్య, పరిష్కారం.
వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు.
కాళ్ళకు చేతులకు సంకెళ్లు వేయించుకొని 40 గంటలు మిలటరీ విమానాల్లో కూర్చొని డిపోర్ట్ చేయబడ్డ భారతీయుల గురించి ఇక్కడ అమెరికాకు వచ్చిన వాళ్ళు (పైన చెప్పినట్టు అన్ని రకాల అవకాశవాదులు), అక్కడ ఇండియాలో కూర్చొని కడుపు నిండా తిని, కాఫీ తాగుతూ “బాగా అయ్యింది… అలాగే కావాలి” అన్న ఫీలింగ్ తో పెట్టే పోస్టులు చూసి ఇది రాస్తున్నా!
ఓపెన్ బోర్డర్ కావాలని అనట్లేదు. ప్రాణాలను పణంగా పెట్టి, రెండు నెలల పాటు అన్ని రకాల కష్టాలు పడి ఎలాగోలా అమెరికాలోకి రావాలనుకొనే వాళ్ళకే తెలుసు ఎందుకు వస్తున్నారో, ఎందుకు ఆ అవకాశం తీసుకున్నారో. మనకెలా తెలుస్తుంది!?
ప్రయత్నిస్తారు. వస్తే వస్తారు. లేకపోతే సరిహద్దులో ఆగిపోతారు. లోపలికి వచ్చాక దొరికితే వెనక్కి పోతారు. అది వాళ్ళ సమస్య. అమెరికా సమస్య. గత ముప్పై ఏళ్లలో ఇండియా నించి పాతిక ముప్పై లక్షల మంది “లీగల్”గా అమెరికా వచ్చారు . ఇంకా లక్షల్లో వస్తున్నారు ప్రతీ సంవత్సరం. ఎందువల్ల? అదీ అసలు ప్రశ్న!
Share this Article