Murali Buddha… ఏమంటాడంటే..? ‘‘కాల మహిమ… ఈటీవీలో పాతాళ భైరవి సినిమా వస్తోంది… తోటరాముడు ఎన్టీఆర్ రహస్యంగా తోటలో రాజకుమారిని చూసి ఆమె అందానికి ముగ్దుడు అవుతాడు . చూస్తే మనల్ని చంపేస్తారు అంటాడు మిత్రుడు అంజిగాడు … అందమైన రాజకుమారి పక్కన నిలబడ్డాక చనిపోయినా పరవాలేదు అంటాడు తోట రాముడు …
రియాలిటీకి వస్తే, అంతటి అందగత్తె రాజకుమారి చివరి దశలో ఆలయంలో ప్రసాదంతో కడుపు నింపుకుంది … అనాథలా బతికి – కాచిగూడ ప్రభాత్ టాకీస్ గోడ కూలి చనిపోయింది … తోట రాముడు నేపాల మాంత్రికుడిని హతమార్చి రాజకుమారిని దక్కించుకుంటాడు సినిమాలో… నేపాళ మాంత్రికుడిని హతమార్చిన ఎన్టీఆర్ నిజ జీవితంలో పిల్లలు, అల్లుళ్ళ రూపంలోని బంధు మాంత్రికుల చేతిలో చిక్కి, క్షోభతో రాజ్యలక్ష్మిని వదిలి మరణించారు …’’
.
Ads
ఎందుకో ఇది చదవగానే సాక్షిలో ఓ వార్త కనిపించింది… అది సుప్రీంకోర్టులో రామోజీరావుకు ఎదురుదెబ్బ అనేది… అందులోనే పొలిటిషియన్ ఉండవల్లి వ్యాఖ్య ఒకటి… ‘‘రామోజీరావు అంటే అందరికీ భయం, కానీ రామోజీరావుకు నేనంటే భయం…’ ఇదీ వ్యాఖ్య… భయం అనేది పెద్ద వ్యాఖ్య కావచ్చుగాక, కానీ ఉండవల్లి పట్టువదలని విక్రమార్కుడిలా రామోజీరావు వెంటపడ్డాడు…
మార్గదర్శి మీద సుప్రీంకు వెళ్లి, ఏపీ ప్రభుత్వాన్ని ఇంప్లీడ్ చేయించాడు… కాకపోతే కేసీయార్ రామోజీరావు పట్ల సదభిప్రాయంతో ఉండటంతో తెలంగాణ ప్రభుత్వం ఆ కేసులో ఇంప్లీడ్ కాలేదు… ఇప్పుడది మళ్లీ తెలంగాణ హైకోర్టుకు వచ్చింది కేసు… మూణ్నాలుగు నెలల్లో సమగ్ర పరిశీలన జరిపి నిగ్గుతేల్చాలని సుప్రీం బెంచ్ చెప్పింది… అంతేకాదు, ఉండవల్లిని సహకరించాలని కోరింది…
కేసీయార్ గనుక వద్దనకపోతే ఇప్పటికే రామోజీరావును జగన్ లిఫ్ట్ చేసి ఉండేవాడు… అది నిజం… ఇప్పుడు రేవంత్ రెడ్డి చంద్రబాబు, రామోజీరావు బ్యాచ్ పట్ల పెద్ద వ్యతిరేకంగా ఉండడు గనుక… ఏమో, ఈ విషయంలో మాత్రం కేసీయార్ అనుసరించిన ధోరణినే తనూ అనుసరిస్తాడేమో… కానీ ఉండవల్లి వదలడు…
‘అందరి డిపాజిట్లూ వాపస్ ఇచ్చారేమో పరిశీలించాలని’ సుప్రీం చెబితే … ‘వాపస్ ఇచ్చారా లేదానేది ఎంత ముఖ్యమో, అసలు డిపాజిట్లు సేకరించడం నేరమో కాదో చూడాలి’ అని ఉండవల్లి స్పందించాడు… మరో సీరియస్ కామెంట్ సుప్రీం నుంచి… ఏపీ ప్రభుత్వం మాకు వ్యతిరేకంగా ఉందని రామోజీరావు న్యాయవాదులు చెబితే… ఈనాడు ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంది, ఆ ప్రభుత్వం ఈనాడుకు వ్యతిరేకంగా ఉంది… ఈనాడుకు వ్యతిరేకంగా ఉండకూడదని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించలేం కదా’ అని పేర్కొంది…
కేసు నడుస్తుంటే మరోవైపు 2300 కోట్లు సేకరించారని ఏపీ ప్రభుత్వ న్యాయవాదులు తెలిపారు… సో, ఇప్పుడు అనిపిస్తోంది… ఒకప్పుడు రామోజీరావు అంటే ఏమిటి..? ఇప్పుడు ఏమిటి..? ఒకప్పుడు ప్రభుత్వాలను శాసించాడు… ఎవరూ తనను టచ్ చేయలేకపోయారు… ఈరోజుకూ అమిత్ షా వంటి కఠోర పొలిటిషియన్స్ సైతం హైదరాబాద్ వస్తే రామోజీరావును కలవడానికి తను వెళ్తాడు తప్ప రామోజీరావు ఎవరి వద్దకూ వెళ్లడు…
వేల కోట్ల ఆస్తులు, డబ్బు, మీడియా, కులం మద్దతు, ఓ పార్టీ మద్దతు… సో వాట్… తీవ్ర అనారోగ్యం, మీదపడ్డ వయస్సు… మార్గదర్శి కష్టాలు… కోర్టుల్లో ఎదురుదెబ్బలు… మీడియా, ఫిలిమ్ సిటీలో బోలెడు వాటాల్ని రిలయెన్స్‌కు అప్పగింత… ఒడిదొడుకుల్లో తన గ్రూపు… మళ్లీ జగన్ అధికారంలోకి వస్తే, ఏమాత్రం చాన్స్ దొరికినా సరే రామోజీరావును అరెస్టు చేస్తాడు… తనకు రామోజీరావు వయస్సు, పలుకుబడి, ఆస్తులు గట్రా పట్టవు… పైన మనం ఏమని చెప్పుకున్నాం… కాలమహిమ అని కదా… ఎస్, ఇదే కాలమహిమ… సాగినంతకాలం సాగింది, ఇప్పుడు..?! ఉండవల్లి కూడా రామోజీరావుకు నేనంటే భయం అంటున్నాడు… అదే చేసి చూపిస్తున్నాడు..!!
Share this Article