Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఎరుపు లోలాకు కులికెను కులికెను… ఆమె గుర్తుందా మీకు..?!

April 8, 2026 by M S R

.

ఓ చిన్న వార్త… పక్కా ‘కవరేజీ’ వార్త… ఏమిటయ్యా అంటే…  ప్రియాంక అనే ఓ కొత్త నటి ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వబోతోంది… తెలుగులో కాస్త హిట్టయిన కోర్ట్ అనే రీసెంట్ డ్రామా మూవీకి రీమేక్ అట… అందులో శ్రీదేవి అనే ఓ కొత్త నటి పోషించిన పాత్రలో ఈమె డెబ్యూ అట…

ఈ సినిమాకు త్యాగరాజన్ దర్శకత్వం వహిస్తుండగా, స్టార్ హీరో ప్రశాంత్ లాయర్ పాత్రలో నటిస్తున్నాడుట… చెన్నైలో రీసెంటుగా ఆ సినిమాకు కొబ్బరికాయ కొట్లారట… గుడ్, ఆహ్వానిద్దాం… సో వాట్… ఎందరో తారల బిడ్డలు రావడం లేదా..? ఆ వందల మందిలో ఆమె ఒకతి, వాటీజ్ స్పెషాలిటీ అనిపించింది… కానీ చదువుతుంటే హఠాత్తుగా ఓచోట మౌజ్ కదలనంది… ఎందుకో తెలుసా..,.?

Ads

ఆమె నటి దేవయాని బిడ్డ అట… అది చదువుతుంటే ఓ పాత పాట గుర్తొచ్చింది… బహుశా ఈతరానికి గుర్తులేకపోవచ్చు గాక… కానీ అప్పట్లో… అంటే 1996లో… తమిళ బ్లాక్ బస్టర్ మూవీ ‘కాదల్ కోటై’ (Kadhal Kottai) కి తెలుగు అనువాదం పేరు ప్రేమలేఖ… 

ఇప్పుడుంటే వైట్ అండ్ వైట్ అజిత్ కావచ్చు… కానీ అప్పట్లో తెలుగు, తమిళ ఆడ ప్రేక్షకుల కలల హీరో అజిత్… అందులో హీరోయిన్ దేవయాని… ఓ పాట ఏమిటంటే..?



  • ఎరుపు లోలాకు కులికెను కులికెను
    ముక్కు బుల్లాకు మెరిసెను మెరిసెను
    అమ్మమ్మా అందమే ఏనుగెక్కి పోతుందే
    కళ్లతో కొంటెగా సైగలేవో చేస్తుంది
    రాజస్థానీ కన్నెపిల్ల వయసుకి వన్నెలు వచ్చిన వేళ


ఎంత బాగుందో కదా… తమిళంలో రచయిత ఏం రాశాడో గానీ, తెలుగులో మాత్రం పక్కా లైవ్‌లీ అనువాదం… ఓ రాజస్తానీ కన్నెపిల్ల ఏనుగుపై వెళ్తుంటే హీరో భావన అది… దాంతోనే దేవయాని తెలుగు ప్రేక్షకుల మనస్సుల్లో ముద్ర వేసింది…

ఎక్కడా చిల్లర ఎక్స్‌పోజింగ్ లేదు… పవన్ కల్యాణ్, అజిత్, కమలహాసన్… ఎందరితోనే నటించింది… మంచి మార్కులు కొట్టేసింది… తరువాత తమిళ దర్శకుడు రాజకుమారన్‌ను పెళ్లి చేసుకుంది, పెద్దల ఆమోదం లేకుండానే… తరువాత మెల్లిగా సినిమాలకు దూరమైంది…

అడపాదడపా ఏవో చిన్న పాత్రలు చేస్తోంది, టీవీ సీరియల్స్ ఎట్సెట్రా… ఇద్దరు పిల్లలు… అందులో ఒకరు ప్రియాంక… ఆమెను సినిమాల్లోకి తీసుకొస్తున్నారు… ఇదీ నేపథ్యం… బట్, ఆమె లుక్కు చూస్తే…? వద్దులెండి, పాపం శమించుగాక… ఎవరి అదృష్టం ఏమిటో…. మనం దేవయానిని ప్రేమించలేదా ఏమిటి..?!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఎరుపు లోలాకు కులికెను కులికెను… ఆమె గుర్తుందా మీకు..?!
  • ఆ పాట చరణాల సొగసు చూడతరమా…? వేటూరి మేథోమథనం కథ..!!
  • మళ్లీ ఇజ్జత్ తీసుకున్న పాకిస్థాన్… ఈసారి ఏకంగా దాని ప్రధాని వంతు…
  • నోటి తుత్తర ఎంత ప్రమాదకరమో చెప్పే సినిమా… మధురానగరిలో…
  • దేవనపల్లి కవిత..! టీఆర్ఎస్ కాదు… తెలంగాణ జాగృతి పార్టీయే..!!
  • అందరికీ శకునాలు చెప్పే బల్లి కుడితి తొట్టెలో పడినట్టు…!!
  • ఇరాన్ యుద్ధనీతిని అస్సలు అంచనా వేయలేని ట్రంప్ వైఫల్యం…
  • ఇదే డెస్టినీ అంటే..! కేసీయార్ సార్, ఓసారి ఇది తాపీగా చదవగలరు…!!
  • అమెరికా, ఇజ్రాయిల్ తప్పులో కాలేశాయి..? మొస్సాద్‌కు మొదటిసారి షాక్..!!
  • సర్కారు సకాల స్పందన… రిటైర్డ్ ఉద్యోగులందరికీ భారీ ఊరట

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions