Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

అరైవ్ అలైవ్..! సేఫ్టీ ఫస్ట్..! తెలంగాణ పోలీసుల గుడ్ క్యాంపెయిన్…!!

January 13, 2026 by M S R

.

మనం గుర్తించడం లేదేమో గానీ… రోడ్డు ప్రమాదాలే అత్యంత ప్రాణాంతకాలు… గణాంకాలు చెబుతున్నదీ ఇదే సత్యం… ఏటా తెలంగాణలో 800 మంది దాకా హత్యలకు గురవుతుంటే… రోడ్డు ప్రమాదాల్లో మరణించేవారి సంఖ్య ఎంతో తెలుసా..? 7500 మంది దాకా..! అంటే రోజుకు 20 మందికి పైగా..!!

మరేం చేయాలి..? రోడ్డ ప్రమాదాల సంఖ్యను తగ్గించడం, అంటే బ్లాక్ స్పాట్లను గురించి, నివారణ చర్యలు చేపట్టడం… అంతకుమించి ప్రమాదాల్లో గాయపడిన వాళ్లను శీఘ్రంగా హాస్పిటళ్లకు తరలించడం, స్పాట్‌లోనే ప్రాథమిక చికిత్స అందడం… ఈ గోల్డెన్ అవర్ అత్యంత కీలకం…

Ads

ఎస్, తెలంగాణ డీజీపీ బి.శివధర్ రెడ్డి చేపట్టిన ‘అరైవ్- అలైవ్’ ప్రోగ్రాం నిజంగా ఓ సత్సంకల్పం… ఆల్రెడీ ఈ దిశలో కొన్ని ఫలితాలు కనిపిస్తున్నాయి కూడా… డ్రగ్స్ మహమ్మారిపై ఈగల్, సైబర్ నేరాలపై సీ-మిత్రలాగే రోడ్డు ప్రమాదాలపై ఈ అరైవ్ అలైవ్ ప్రోగ్రాం… ఇది శ్రద్ధ పెట్టాల్సిన కార్యక్రమమే…

రీసెంటుగా హైదరాబాద్, యూసుఫ్‌గూడాలో జరిగిన ‘అరైవ్‌ అలైవ్‌ – ఏ క్యాంపెయిన్‌ ఫర్‌ సేఫర్‌ రోడ్స్‌ ఇన్‌ తెలంగాణ’ కార్యక్రమాన్ని సోమవారం సీఎం ప్రారంభించి మాట్లాడాడు, పోలీసులను అభినందించాడు… ఈ సందర్భంగా డీజీపీ వెల్లడించిన కొన్ని వివరాలు గమనించదగినవే…

shivadhar

‘‘తెలంగాణలో సుమారు 30 వేల కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది రహదారి నెట్‌వర్క్‌… ప్రతి ఏడాది దాదాపు 27 వేల రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటే,, సుమారు 7,500 మంది ప్రాణాలు కోల్పోతున్నారు… గత ఏడాది 800 మంది హత్యలకు గురైతే, అదే కాలంలో రోడ్డు ప్రమాదాల్లో 7,500 మంది మరణించారు… అంటే హత్యలకన్నా 9–10 రెట్లు ఎక్కువ మంది రోడ్లపై ప్రాణాలు కోల్పోతున్నారు…

తరచూ రోడ్డు ప్రమాదాలకు లోనయ్యే బ్లాక్ స్పాట్లు 935 గుర్తించాం… 2025లో ప్రమాదాల సంఖ్య పెరిగినా మరణాల సంఖ్య తగ్గడానికి ప్రధాన కారణం ‘గోల్డెన్‌ అవర్‌’లో బాధితులను ఆసుపత్రికి తరలించే శిక్షణ… రోడ్ల పక్కన ఉన్న షాపులు, హోటళ్లు, రెస్టారెంట్ల సిబ్బందికి ఫస్ట్‌ ఎయిడ్‌ శిక్షణ ఇచ్చి, ప్రమాదం జరిగిన వెంటనే ప్రాథమిక చికిత్స అందించేలా చేసిన ప్రయత్నాల ఫలితం ఇది…

ప్రమాదాల్లో మృతుల్లో 75 నుంచి 80 శాతం మంది ద్విచక్ర వాహనదారులు, పాదచారులు… పైగా ఎక్కువగా 20–40 ఏళ్ల ఉత్పాదక వయసు గలవారే… హెల్మెట్‌ తప్పనిసరిగా ధరించడం ముఖ్యం, అదీ పిలియన్‌ రైడర్‌కూ అవసరం… కార్లలో ముందు–వెనుక సీట్లలో ఉన్నవారందరూ సీట్‌బెల్ట్‌ పెట్టుకోవడం సేఫ్…

డ్రైవింగ్‌ సమయంలో మొబైల్‌ ఫోన్‌ వాడటం, మద్యం సేవించి వాహనం నడపడం మరీ ప్రాణాంతకంగా మారతున్నాయి… రాంగ్‌ సైడ్‌ డ్రైవింగ్‌, సిగ్నల్‌ జంపింగ్‌, స్టాప్‌లైన్‌ దాటడం, హైవేలపై ఆటోలు నడపడం, ఓవర్‌ లోడింగ్‌, హైబీమ్‌ లైట్లు, ఎడమ వైపు నుంచి ఓవర్‌టేక్‌ వంటి ఉల్లంఘనలే ప్రమాదాలకు ప్రధాన కారణాలు…

గ్రామం నుంచి జిల్లా స్థాయి వరకు ట్రాఫిక్‌ సేఫ్టీ కమిటీలను పటిష్టంగా ఏర్పాటు చేసి, సర్పంచులు, వార్డు సభ్యులు, టీచర్లు, అంగన్‌వాడీ కార్యకర్తలు, యువత, ఆటో డ్రైవర్లు, ట్రాక్టర్‌ యజమానులు సహా అందరినీ భాగస్వాములను చేయాలనేది తెలంగాణ పోలీసుల సంకల్పం, ప్రాధాన్యం…

జనవరి 13 నుంచి 24 వరకు పది పని దినాలతోపాటు ఈ క్యాంపెయిన్‌ను నిర్వహిస్తాం… అంతిమంగా రోడ్ సేఫ్టీ మా ప్రయారిటీ… అందుకే ఈ అరైవ్- అలైవ్… అంటే సేఫ్ జర్నీ, సేవ్ లైఫ్…’’ ఇదీ డీజీపీ వివరణ… మంచి కార్యక్రమం… ఐతే రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణాల్లో హైబీమ్ లైట్లు… దీనిపై పోలీసులు దృష్టి సారిస్తే మరిన్ని మంచి ఫలితాలు గ్యారంటీ…!!

 

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • వామ్మో వాయ్యో…! సంక్రాంతి బరి నుంచి మరో పందెం కోడి ఔట్…!!
  • ఇండియా కొత్త బాట..! ఐనవాడే అందరికీ… ఐనా లొంగడు ఎవ్వరికీ..!!
  • అరైవ్ అలైవ్..! సేఫ్టీ ఫస్ట్..! తెలంగాణ పోలీసుల గుడ్ క్యాంపెయిన్…!!
  • ‘బాబు బూచి’… ఫ్రీజోన్ కుట్ర అట… బీఆర్ఎస్ గాయిగత్తర రాజకీయం…
  • ముత్యమంత ముద్దు..! ఓ అబ్సర్డ్ నవలకు దారితప్పిన మూవీకరణ..!!
  • పవన్ కల్యాణ్… ఓ యుద్ధ ఖడ్గం… ఓ బిరుదు ప్రదానం… ఓ క్లారిటీ..!!
  • హఠావో లుంగీ- బజావో పుంగీ..! వీళ్లు వారసులా..? విద్వేష వైరసులా..?!
  • మళ్లీ ఓ చిరంజీవి రెట్రో లుక్కు… జోడీగా ఇదే నయనతార… ఏమిటది..?!
  • హైడ్రోజన్ రైల్..! ఈ పైలట్ రన్స్ గనుక సక్సెసైతే… రవాణా విప్లవమే..!!
  • ‘‘తెలంగాణ వ్యతిరేకులతో కలిసొస్తాం.., కాస్త కరుణించి వోట్లేయండి ప్లీజ్..!!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions