Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

‘మగ శివాజీ’ లీడ్ రోల్… దండోరా ఓ మంచి ప్రయత్నమే… కానీ..?!

December 25, 2025 by M S R

.

రెండు రోజులుగా శివాజీ సామాన్ల డర్టీ వ్యాఖ్యలు… దానిపై వ్యక్తమైన అభ్యంతరాలు, వ్యతిరేకత… అనసూయకు నీ రుణం తీర్చుకుంటానంటూ శివాజీ బెదిరింపులు… చాల్లే అన్నట్టు అనసూయ ప్రతిస్పందన… మొత్తానికి తెలుగు నెటిజనం రెండుగా చీలిపోయి సమర్థనలు, ఖండనలు… ఓ దుమారం…

ఆ శివాజీ నటించిన దండోరా సినిమానూ, ఈ వివాదాన్ని కలిపి చూడనక్కర్లేదు… కానీ బయట దుమారంతో శివాజీ మీద మనసులో ఏర్పడిన ఓ అభిప్రాయం ప్రభావం ఖచ్చితంగా ఆ పాత్రను మనం చూసే తీరు మీద ఉంటుంది… (ఆల్రెడీ గరుడ పురాణం బాపతు నెగెటివిటీ తనపై ఉంది ఇప్పటికీ)…

(ఇదే శివాజీ ఈ సామాన్ల వ్యాఖ్యలే కాదు, గతంలో బిగ్‌బాస్‌ షోలో శోభాశెట్టి, ప్రియాంక జైన్‌ల మీద ‘ఇదే నా ఇంటి ఆడపిల్లలయితే చంపి పాతరేసేవాణ్ని’ అని రెచ్చిపోయాడు, తను మొదటి నుంచీ అంతే… ఓ మిత్రురాలి భాషలో చెప్పాలంటే మేల్ చావనిస్ట్…)

Ads

ఇప్పుడొచ్చిన దండోరా సినిమాలో తనదే లీడ్ రోల్… (ఈ సినిమా ప్రిరిలీజ్ ఫంక్షన్‌లోనే సామాన్ల కంట్రవర్సీకి బీజం పడింది)… కుల పిచ్చి, పట్టింపులు ఉన్న ఒక తండ్రి (శివాజీ) చుట్టూ ఈ కథ తిరుగుతుంది… తన కుల అహంకారం తన ఇద్దరు పిల్లల జీవితాలను ఎలా ప్రభావితం చేసింది..? సమాజంలోని కుల వివక్షను ఎదిరించి తన తప్పును అతను ఎలా తెలుసుకున్నాడు..? అనేదే ఈ ‘దండోరా’ చిత్ర మూల కథ…

ఈ పాత్ర మొదట్లో శివాజీ ఒరిజినల్ కేరక్టర్ అనిపిస్తుంది సామాన్ల వివాద ప్రభావంతో… కొంతమంది ప్రేక్షకులకైనా… తరువాత ఆ పాత్ర స్వభావం మారినా సరే, దాని ఇంపాక్ట్ ఇక కలిగించలేకపోయింది… సో, శివాజీ వ్యాఖ్యలు సినిమాకు ఎంతోకొంత నష్టం చేసినట్టే… (ఆమధ్య పృథ్విరాజ్, రాజేంద్ర ప్రసాద్ ప్రిరిలీజు ఫంక్షన్లలో ఇలాంటి కూతలకే దిగితే సినిమాలకు నష్టమనే భావనతో సినిమా బాధ్యులు లబోదిబో మొత్తుకున్నారు)…

దర్శకుడు మురళి కాంత్ ఎంచుకున్న పాయింట్ చాలా సీరియస్ అండ్ సోషల్లీ రెలవెంట్… స్టోరీ లైన్ బాగుంది… పల్లెటూరి వాతావరణం, అక్కడి పాత్రల ఎంపిక కూడా బాగుంది… ఎటొచ్చీ సినిమా ప్రారంభం నుండే కథనం కొంత పాత మూసలో (Formulaic) సాగుతుంది…

ప్రథమార్ధంలో వచ్చే లవ్ ట్రాక్, తండ్రీ కొడుకుల మధ్య గొడవలు మనం ఇప్పటికే చాలా సినిమాల్లో చూసినట్లు అనిపిస్తాయి… ఇంటర్వెల్ పాయింట్ కూడా ముందే ఊహించేలా ఉండటం కొంత మైనస్…

కానీ, సెకండాఫ్‌లో సినిమా కాస్త బెటర్… ముఖ్యంగా శివాజీ, బిందు మాధవి మధ్య వచ్చే ఎమోషనల్ సీన్స్ కొంత మెప్పిస్తాయి… (బిందు మాధవిని ఇండస్ట్రీ ఎందుకు సరిగ్గా వాడుకోవడం లేదో అర్థం కాదు… బాగా చేయగలదు…) తను చేసిన తప్పును శివాజీ గ్రహించే సన్నివేశాలు బాగానే ఉన్నా… క్లైమాక్స్ రొటీన్‌గా ఉండిపోయింది…

  • శివాజీ గతంలో ‘మంగపతి’ లాంటి పాత్రలో బాగా చేశాడు… కానీ ఓ అనవసర కంట్రవర్సీ నెత్తికెత్తుకుని, ఈ సినిమాలో ఈ పాత్ర బాగానే చేసినా సరే… అంత ఇంప్రెసివ్ అనిపించకుండా పోయింది…

  • నందు బాడీ లాంగ్వేజ్ నుండి ఎమోషన్స్ వరకు బాగా చేశాడు… నవదీప్, రవికృష్ణ, మురళీధర్ గౌడ్ వోకే… బిందుమాధవికే మంచి మార్కులు…  చాలా పరిణతితో నటించాడు… నవదీప్ మంచి నటుడే కానీ ఈ పాత్ర తనకు పెద్దగా ప్లస్ కాాలేదు…

స్జూలంగా... స్టోరీ లైన్ వోకే... నటీనటుల పర్‌ఫామెన్స్ వోకే... సెకండాఫ్‌లో కొన్ని మంచి ఎమోషనల్ సీన్లు పడ్డాయి... సామాజిక స్పృహ కలిగిన కథాంశం కూడా ఆసక్తికరమే... కానీ ఫస్టాఫ్ పెద్ద సాగదీత... 'దండోరా' ఒక నిజాయితీ గల ప్రయత్నం... కుల వివక్ష వంటి సామాజిక అంశాల మీద తీసిన సినిమాలను ఇష్టపడే వారికి మాత్రం ఇది ఒక మంచి ఆప్షన్...

(ఇది ఓ ఎన్ఆర్ఐ అభిప్రాయం)

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • మెప్పించావు దర్శకా..! చాలా క్లిష్టమైన ప్రయోగాన్ని ఛేదించావుపో…!!
  • రోషన్… హీరో మెటీరియలే…! కానీ ఈ పాత్ర మోయలేనంత బరువు..!!
  • ‘మగ శివాజీ’ లీడ్ రోల్… దండోరా ఓ మంచి ప్రయత్నమే… కానీ..?!
  • ఈషా (Eesha) – ఈ దెయ్యం భయపెట్టలేదు… చిరాకెత్తించింది…
  • ఒకే ఒక డైలాగ్… బలమైన జంగిల్ రాజ్, మాఫియా రాజ్ కూలిపోయింది…
  • తక్కువ మంది అతిథులతో పెళ్లి… ఆశీస్సులు, పలకరింపులు, మర్యాదలు…
  • అసలే వాణిశ్రీ… పైగా చిరంజీవి… విజయశాంతీ ఉండనే ఉంది… ఇంకేం..?!
  • దృశ్యం-3… రాంబాబు మార్క్ ‘ట్విస్ట్’… అడుగు దూరంలో అసలు క్లైమాక్స్!!
  • ఏరు దాటాక బోడి మల్లన్న… ఇది పవర్ లిఫ్టర్ ప్రగతి మరో మొహం…
  • అక్రమాల తిరుమల చీకట్లలో… ఒకటీఅరా మంచి నిర్ణయాలు… ఇలా…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions