.
శబరిమల అయ్యప్ప గుడిలో రుతమహిళల ప్రవేశానికి సంబంధించి మొన్న సుప్రీంకోర్టు చేసిన కొన్ని వ్యాఖ్యల్ని తెలుగు మీడియా సరిగ్గా కవర్ చేయలేదు… తెలుగు మెయిన్ స్ట్రీమ్ మీడియాకు కులగజ్జి గోకుళ్లు తప్ప ప్రొఫెషనలిజం ఎక్కడేడ్చిందని..! నిజానికి ఇది సీరియస్ మ్యాటర్… ఎందుకో చెప్పుకుందాం…
అమరనాథ్ గంటల ధ్వని, ఉజ్జయిని లింగంపై అభిషేక సామగ్రి, శనిశింగాపూర్ స్పర్శదర్శనం నుంచి శబరిమల రుతుమహిళల ప్రవేశం దాకా కోర్టులు ఇష్టారాజ్యంగా స్పందిస్తున్నాయి… అసలు హిందూ ఆగమాలు, గుళ్ల సంప్రదాయాల మీద వాటికున్న అథారిటీ ఏమిటి..? విశ్లేషించే, నిర్ణయాధికారం ఏమిటి..? ఇది ఇండియా కాబట్టి అన్నీ చల్తా…
Ads
వరుసగా అన్ని దేశీయ వ్యవస్థల నుంచీ ఏళ్లుగా ముక్కదెబ్బలు తింటున్న హైందవజాతి అసహాయత, అసమర్థత పుణ్యమాని..! 2018లో ఏం జరిగింది..? రుతుమహిళలకూ ప్రవేశం ఉండాలన్నది సుప్రీం… కారణాలేమిటి..? ఏదో చెప్పింది… కానీ తరాలుగా కోట్ల భక్తగణం ప్రదర్శించే విశ్వాసం మాత్రం దానికి కనిపించలేదు… అది ఈ దేశం దుర్గతి…
ఇప్పుడు 9 మంది న్యాయమూర్తుల ధర్మాసనం విచారిస్తోంది… 2018 నాటి సుప్రీం తీర్పును ఛల్ హట్ అని పక్కకు పెట్టేస్తున్నట్టు వ్యాఖ్యలు చేసింది… చాలా ఇంపార్టెంట్… ముందుగా ఆ వివరాల్లోకి వెళ్దాం… (మన మీడియాకు దాన్ని కవర్ చేసేంత తెలివి ఏడ్వలేదు కాబట్టి, ఇంగ్లిష్ మీడియా కవర్ చేసిన వార్తల సారాంశం చెప్పుకుందాం…)

1. సుప్రీంకోర్టు తాజా సంచలనం…: “పాటించు లేదా బయటే ఉండు” … చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని తొమ్మిది మంది సభ్యుల ధర్మాసనం ఈ కేసును విచారిస్తూ అత్యంత కీలకమైన వ్యాఖ్యలు చేసింది…
-
సంప్రదాయమే సుప్రీం…: ఒక ఆలయానికి వెళ్లే వ్యక్తి ఆ క్షేత్ర ‘సంప్రదాయాన్ని’ (Sampradaya) అనుసరించాల్సిందే…
-
వ్యక్తిగత హక్కులకు పరిమితి..: “నాకు నమ్మకం ఉంది కదా అని నేను ఎలాగైనా వెళ్తాను అంటే కుదరదు… ఆలయ ఆచారాలను మార్చే హక్కు ఏ వ్యక్తికీ లేదు… ఒకవేళ ఆ ఆచారం మీకు ఇష్టం లేకపోతే, మీరు ఆ సంప్రదాయం నుండి బయట ఉన్నట్లే లెక్క” అని జస్టిస్ సుందరేష్ స్పష్టం చేశారు…

2. పూర్వరంగం: 2018 నాటి ఉప్పెన …. 2018లో తీర్పు మీద నిరసనగా … నైష్టిక బ్రహ్మచారి అయిన అయ్యప్ప స్వామి కొలువై ఉన్న ఆ క్షేత్ర ఆచారాలను కోర్టులు మార్చకూడదని లక్షలాది మంది భక్తులు రోడ్లపైకి వచ్చారు…
3. నాటి లెఫ్ట్ ప్రభుత్వం మొండితనం … 80 ఏళ్ల వయస్సులో మళ్లీ ముఖ్యమంత్రి కావాలని అనుకుంటున్న పక్కా హిందూ వ్యతిరేకి పినరై విజయన్ ఆ 2018 తీర్పు తరువాత దూకుడుగా వెళ్లాడు… అత్యుత్సాహం ప్రదర్శించాడు… ఇప్పటికిప్పుడు ఇక భారతదేశంలో హిందూమతం లేకుండా చేయాలనేంత దుశ్చర్యలోకి వెళ్లిపోయాడు… అఫ్‌కోర్స్, ఈ దేశ కమ్యూనిస్టులందరూ అదే బాపతు కదా…

-
నవోత్థానం పేరుతో..: కోర్టు తీర్పును సామాజిక సంస్కరణగా అభివర్ణిస్తూ, మహిళలను ఆలయంలోకి పంపేందుకు ప్రభుత్వం పోలీసు బలాన్ని ప్రయోగించింది… ఓ ఇద్దరు రుతుమహిళల్ని ఈ హిందూ వ్యతిరేక ముఖ్యమంత్రి పోలీసు బందోబస్తుతో తీసుకుపోయాడు గుడికి… ఎందుకంత కక్ష? వేరే మతాల మీదకు వెళ్లగలడా..? ఈ ముసలిస్వరానికి వణుకు…
-
మహిళా గోడ (Women’s Wall): తీర్పుకు మద్దతుగా రాష్ట్రవ్యాప్తంగా మహిళలతో భారీ గోడను నిర్మించింది… ఇది భక్తుల ఆగ్రహానికి కారణమైంది… తరువాత సీపీఐ లెంపలేసుకుంది…. కరడుగట్టిన హిందూవ్యతిరేక సీపీఎం మాత్రం మారలేదు…

4. హైదరాబాద్ పర్వర్టెడ్ జర్నలిస్ట్ దుశ్చర్య… హైదరాబాద్‌కు చెందిన మోజో టీవీ (Mojo TV) రిపోర్టర్ కవితా జక్కల్, మరో కెమెరామన్ కూడా శబరిమలలో ఎంట్రీకి దుస్సాహసం చేశారు… వాళ్ల చీఫ్ పేరు రేవతి… కవితా జక్కల్ పోలీసు హెల్మెట్, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ధరించి కొండ ఎక్కింది… పదునెట్టాంబడి (18 మెట్లు) కి చేరువలోకి వెళ్లింది… వందలాది మంది భక్తులు ఆమెను అడ్డుకున్నారు… చివరికి ప్రధాన అర్చకులు (తంత్రి) “మహిళలు ప్రవేశిస్తే గుడి మూసేస్తాం” అని అల్టిమేటం ఇవ్వడంతో పోలీసులు ఆమెను వెనక్కి తీసుకొచ్చారు…

ఇక్కడ రేవతి గురించి చెప్పాలి… ఆ దుస్సాహసం తరువాత ఆ పాపఫలితం అనుభవించింది ఆ పర్వర్టెడ్ ఫేక్ జర్నలిస్టు… మోజో లేదు, వేరే బతుకు లేదు అన్నప్పుడు బీఆర్ఎస్ క్యాంపు ఎంగేజ్ చేసుకుంది, దిగజారి రేవంత్ రెడ్డి మీద డర్టీ క్యాంపెయిన్ వీడియోలకు పూనుకుంది… అరెస్టయింది… (రవిప్రకాష్ సమాజం మీద వదిలిన యాంటీ సొసైటీ శక్తులు, వ్యక్తులు ఎన్నో… అఫ్‌కోర్స్, తనూ యాంటీ హిందూయే కదా…)
- కేటీయార్ సహా పింక్ క్యాంపు సపోర్టు చేసింది… ఎస్, ఆ అయ్యప్ప శాపమే గత ఎన్నికల్లో మట్టిగొట్టుకుపోయంది ఆ పార్టీ… నాస్తికుడు కేటీయార్‌కు పెద్దగా ఫరక్ పడదేమో…. కానీ ఆయుత చండీయాగాల కేసీయార్, ఆస్తికుడు హరీష్‌రావు నోటమాట లేదు ఇంతవరకూ… రేవతిని సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కడూ అనుభవిస్తున్నాడు…!!

5. కేరళ ప్రభుత్వం ఇప్పుడు ఎందుకు ‘యూ-టర్న్’ తీసుకుంది? …. 2018లో “ప్రగతిశీలం” అన్న ప్రభుత్వం, 2026 నాటికి పూర్తి స్థాయిలో వెనక్కి తగ్గింది… తలబొప్పి కట్టి, స్థానిక ఎన్నికల సహా ప్రతిచోటా హిందువులు సంఘటితమై పినరై విజయన్‌ను చావుదెబ్బ కొడుతుండటంతో… 2019 ఎన్నికల్లో పరాభవంతో తత్వం బోధపడి… ఏప్రిల్ 9, 2026న కేరళలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, భక్తుల ఓట్ల కోసం ప్రభుత్వం తన పాత పంతాన్ని వీడింది… యూటర్న్ తీసుకుంది…
-
ఏకాభిప్రాయం మంత్రం..: “కోర్టు తీర్పు ఏదైనా, భక్తులు, పండితులు, అందరి ఏకాభిప్రాయం తర్వాతే ఆచారాల మార్పు జరగాలి” అంటూ ఇప్పుడు కొత్త రాగం అందుకుంది… పక్కా అవకాశవాదం, ఈ జాతికి వ్యతిరేకం…

ముగింపు …. 2018లో మొదలైన ఈ సంఘర్షణ ఇప్పుడు ఒక తార్కిక ముగింపుకు చేరువలో ఉంది… సుప్రీంకోర్టు తాజా వ్యాఖ్యలు “మతపరమైన హక్కులు” – “ఆలయ సంప్రదాయాల” మధ్య ఉన్న లక్ష్మణ రేఖను స్పష్టం చేస్తున్నాయి..!! ఒక కేటీయార్- ఒక పినరై విజయన్ పక్కా హైందవ వ్యతిరేకతలో ఎవరూ తక్కువ కాదు… ఇదే కేటీయార్ జైశ్రీరాం అనకండి అని పిలుపునిచ్చిన సంగతి తెలుసు కదా..!!

వాళ్లయ్య,, బొందుగాళ్లు, శూర్పణఖ జన్మభూమి అనే కొక్కిరింతలతో చివరకు ఇల్లు కదలని బందీఖానా శిక్షకు గురయ్యాడు… అదీ తెలుసు కదా..!! ఆ గుణం తెలుసు కాబట్టే… ఆయుత చండీయాగం పూర్ణాహుతి వేళ తాటాకు కప్పులు తగులబడిపోయి, ఆ అమ్మ తన ఆగ్రహాన్ని ప్రదర్శించి, తను హైందవానికి ఎంత నష్టకారకుడో చెప్పింది..!! అధికారమదంతో విజ్ఞత కోల్పోతే జరిగే నష్టం అది..!!

మరి తిరుమలను భ్రష్టుపట్టించిన శక్తుల మాటేమిటి అంటారా..? వేచి చూడుడు..!!
Share this Article