Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

నితిన్‌ హిట్… సాయిధరమ్‌ బిలో యావరేజ్… ఆది ఫ్లాప్… జ్యోతిక అట్టర్ ఫ్లాప్…

February 4, 2022 by M S R

నిజమే… హీరో నితిన్‌కు కాస్త రిలీఫ్… స్టార్ మాటీవీలో తన సినిమా మేస్ట్రో రిలీజ్ చేశారు ఆమధ్య (23 జనవరి) … హైదరాబాద్ కేటగిరీలో 6.59 టీఆర్పీలు వచ్చినయ్… మొత్తంగా లెక్కేస్తే 8 నుంచి 8.50 దాటి ఉంటుంది… నిజానికి ఇప్పుడున్న స్థితిలో ఇవి కాస్త మంచి రేటింగ్సే… పైగా ఇది అప్పుడెప్పుడో హిందీలో వచ్చిన అంధాధున్ సినిమాకు రీమేక్… టీవీల్లో, ఓటీటీలో చూసీ చూసీ బాగా పాతచింతకాయ పచ్చడి అయిపోయింది… దాన్ని ఇప్పుడు నితిన్ హీరోగా రీమేక్ చేయడం అంటే సాహసమే…

ఐనా సినిమా నిర్మాణం 2020లోనే ప్రారంభించారు, కరోనా ఇతర అడ్డంకులతో గత సెప్టెంబరులో రిలీజ్ చేశారు… మస్తు మంది తారాగణం… నితిన్, నభా నటేష్, తమన్నా, శ్రీనివాస్ రెడ్డి, అనన్య నాగళ్ల, నరేష్, జిష్షు సేన్ గుప్తా, శ్రీముఖి, హర్షవర్ధన్, రచ్చ రవి, మంగ్లీ (సత్యవతి)  ఇలా బోలెడు మంది… హిందీ సినిమా చూసినవాళ్లకు పెద్దగా నచ్చలేదు గానీ తెలుగు మాత్రమే చూసినవాళ్లు పర్లేదన్నారు… మాటీవీ ఎలాగూ రీచ్ ఎక్కువ కాబట్టి రేటింగ్స్ కూడా బాగానే వచ్చినయ్… నితిన్‌కు కాస్త రిలీఫ్… (టీవీల రేటింగ్స్ ఇప్పటికిప్పుడు డబ్బు తీసుకురాకపోవచ్చు, కానీ భవిష్యత్తు సినిమాల మార్కెట్ మీద ప్రభావం ఉంటుంది… ప్లస్ ఇండివిడ్యుయల్ పాపులారిటీకి ఉపయోగకరం…)

ఆమధ్య బైక్  ప్రమాదానికి గురైన మెగా హీరో సాయిధరమ్ తేజ్ సినిమా రిపబ్లిక్ ఆ ప్రమాదానంతరమే రిలీజ్ అయినట్టుంది… ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన లభించింది… పెద్దగా అప్లాజ్ ఏమీ రాలేదు… ఐశ్వర్య రాజేష్ హీరోయిన్‌కు మరో చేదు అనుభవం తెలుగులో… సినిమాలో రమ్యకృష్ణ ఉన్నా ఆమె పాత్ర పెద్దగా సినిమాకు ఉపయోగపడింది కూడా ఏమీ లేదు… తాజాగా జీటీవీలో 23న ప్రసారం చేశారు… జస్ట్, 3.79 టీఆర్పీలు… మరీ ఫ్లాప్ కాదు గానీ, బిలో యావరేజ్ బాపతు ఫలితం…

Ads

ఈసారి బార్క్ జాబితాలో కనిపించిన మరో సినిమా పేరు గరం… సాయికుమార్ కొడుకు ఆది హీరో… తనే నిర్మాత… ఆదా శర్మ హీరోయిన్… అప్పుడెప్పుడో 2016లోనే రిలీజై నాలుగు రోజులకే పత్తా లేకుండా పోయింది… దాన్ని ఈటీవీ ప్రసారం చేసింది… సేమ్, అదే 23 జనవరి రోజున… మరీ 2.42 టీఆర్పీలు వచ్చినయ్… అంటే ఫ్లాప్ అన్నమాటే… అస్సలు గరం లేదు, చల్లగా…

బార్క్ జాబితాలో కనిపించిన మరో సినిమా రాక్షసి… ఇది జ్యోతిక సినిమా… ఇది కూడా అప్పుడెప్పుడో 2019లోనే తమిళంలో రిలీజైంది… దాన్ని తెలుగులోకి తీసుకొచ్చారు… తెస్తే తెచ్చారు గానీ… పోయి పోయి జెమిని మూవీస్‌లో 22న ప్రసారం చేసినట్టుగా కనిపిస్తోంది జాబితాలో… నేరుగా జెమినిలోనే వేయొచ్చు కదా…!! మరీ ఘోరంగా ఒకే ఒక టీఆర్పీ… అనగా అట్టర్ ఫ్లాప్ అని అర్థం… ఇంతకీ ఇది ఇంతకుముందే జెమినిలో వేశారా..? ఏమోలెండి… బార్క్ జాబితా పరిశీలన కూడా రాను రాను కష్టతరంగా మారుతోంది… సో, 4 సినిమాలు, 4 చానెళ్లు, 4 ఫలితాలు…!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • కథ కన్నీళ్లు పెట్టిస్తుంది… కానీ ఈ కథ ఎక్కడిది..? ఎవరిది..? ఆ కథేమిటి..?!
  • టెలిగ్రాఫ్ వ్యాఖ్య… జర్మనీలో ఇది మరో ఆపరేషన్ సిందూర్ అట…
  • ఆ పాటల షోలో ఇంకా ఆ ప్రవస్తి పాడుతూనే ఉంది ఫాఫం…
  • ఇలాంటి ‘టూరిస్ట్ ఫ్యామిలీ’ మన పొరుగిల్లు అయితే బాగుండు…
  • ఆపరేషన్ సిందూర్‌ను పొడిగించకపోవడమే మంచిదైందట…!!
  • టెక్నాలజీ మాత్రమే తెలిస్తే చాలదు… టెక్నిక్ కూడా తెలియాలి…
  • విజయ బాపినీడు ప్రేక్షకుల్ని ఏదో మాయ చేయబోయాడు కానీ…
  • ఉక్రెయిన్ యుద్ధతంత్రం… ఇండియాకు ఓ పెద్ద మేలుకొలుపు…
  • సారీ… నాటి నాయకన్‌కు ఆమడల దూరంలో ఆగిపోయింది ఇది..!
  • ఐపీఎల్… ఇదొక వికృత క్రీడ… ఆటగాళ్ల వేలంవెర్రి… ఓ పిచ్చి…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions