ఇదుగో దీన్నే ‘అతి’ అంటారు… టాలీవుడ్‌లో ‘అతి’కి చిరునామాగా పేర్కొనే దిల్‌రాజుకు నెట్‌లో తీవ్రమైన వెక్కిరింత ఎదురవుతోంది… దీని నేపథ్యం ఏమిటంటే..? శాకుంతలం సినిమా రిలీజ్ చేశాడుగా కష్టమ్మీద… ఎన్నోసార్లు వాయిదా పడీ పడీ, ఎట్టకేలకు అడ్డగోలు ఖర్చుతో ఫినిష్ చేసి, ఎలాగోలా రిలీజ్ చేశాం బాబూ అని ఊపిరి పీల్చుకున్నారు నిర్మాణ బాధ్యులు…
నిజానికి ఇది గుణశేఖర్ సొంత సినిమా… నిర్మాణ విలువల మీద బాగా రాజీపడినా సరే అడ్డగోలు వ్యయం జరిగిపోయింది… ఆ దశలో దిల్ రాజు భాగస్వామిగా ప్రవేశించాడు… డబ్బు సమకూర్చాడు… ఐనాసరే, నాసిరకం గ్రాఫిక్స్, నాసిరకం నిర్మాణ ప్రమాణాలతో సినిమా కళ కోల్పోయింది… గ్రాఫిక్స్ అయితే మరీ దారుణం… హనుమాన్ వంటి సినిమాలు తక్కువ ఖర్చుతోనే గ్రాఫిక్స్ విషయంలో దుమ్మురేపుతుంటే… చాలా అనుభవం ఉన్న గుణశేఖర్, దిల్ రాజు పరమ పీనాసితనం చూపించారు…
సరే, గుణశేఖర్ రకరకాల పైత్యాలన్నీ పనిచేసి సినిమా అట్టర్ ఫ్లాప్… ఈ ఫలితాన్ని ఎప్పటి నుంచో ఊహిస్తున్నదే… మొదటిరోజు మౌత్ టాకే దరిద్రంగా ఉంది… ఇక సినిమా లేవడం కష్టం… అయిపోయింది… అయితే ఈ దశలో దిల్ రాజు ప్రొడక్షన్ సంస్థ ఓ ప్రచారం మొదలుపెట్టింది… సే నో టు పైరసీ అంటూ ఇదుగో ఈ ప్రచార చిత్రాన్ని ప్రచారంలోకి తెచ్చింది…
Ads

dil raju
అసలు రెండు చికెన్ బిర్యానీలు, రెండు బాటిళ్లు బీరు ముందుపెడితే కూడా ఈ సినిమా చూడాలనే ఆసక్తి లేదు ప్రేక్షకుల్లో… ఈ స్థితిలో పైరేటెడ్ కాపీ చూడాల్సిన ఖర్మ ప్రేక్షకుడికి ఎక్కడుంది..? అసలు అంత ఇంట్రస్టింగ్ ఫ్యాక్టర్ ఏముంది సినిమాలో… రోగిష్టి హీరోయిన్, నటన తెలియని విలన్, ఓ రీతిలేని దర్శకత్వం, డోకొచ్చే గ్రాఫిక్స్… గుణశేఖర్ ఊరు గొప్ప, పేరు దిబ్బ… సేమ్, దిల్ రాజు… అన్ని సినిమాలు బలగం కాలేవు దిల్ రాజూ…
సరే, పైరసీ వద్దు అని పిలుపునిచ్చుకోవడాన్ని తప్పుపట్టలేం… టికెట్ల రేట్లు ఎంత ఘోరంగా ఉన్నా సరే, థియేటర్లకు వెళ్లి నిలువు దోపిడీ ఇచ్చి రమ్మనే బహిరంగంగా చెప్పాలి… ఈ నిర్మాతలు, ఈ దర్శకులు దేశోద్ధారకులు కదా మరి..! ఇదొక కళాఖండం మరి..!! ఈ మాత్రం దానికి దిల్ రాజు నిర్మాణ సంస్థ చేసిన ప్రకటన ఏమిటో తెలుసా..?
‘‘3 years of blood, sweat, and hard work have gone into giving you all visual spectacle to watch and enjoy in the THEATRES. Do not spoil the experience. Say no to PIRACY! #Shaakuntalam in your nearest cinemas from TODAY — Sri Venkateswara Creations (@SVC_official) April 14, 2023
నెటిజన్ల స్పందన కూడా భలే ఉంది… ఉచితంగా చూపించినా చూడంలే అని కొందరు, ఐబొమ్మలో కూడా చూడంలే అని ఇంకొందరు వెటకారాలు ఆడుతున్నారు నెట్‌లో… దిల్ రాజు “మూడేళ్లు మా రక్తాన్ని చెమటగా మార్చి తెరకెక్కించిన చిత్రం ఇది. మా కష్టాన్ని గుర్తించి థియేటర్లలో మాత్రమే చూసి ఆనందించండి. విజువల్ వండర్ ను ఫీలవ్వండి. పైరసీకి నో చెప్పండి” అని చెప్పుకోవడాన్ని అందరూ వెక్కిరిస్తున్నారు… అబ్బో, దిల్ రాజు తన రక్తాన్ని చెమటగా మార్చాడట, ఇది విజువల్ వండర్ అట, కాస్త మూసుకోవయ్యా రాజయ్యా అంటున్నారు నెటిజనం…!!
Share this Article