Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఫాఫం తెలుగు సినిమా… దిల్ రాజు రాగద్వేషాల గుప్పిట్లో అవార్డులు….

May 30, 2025 by M S R

.

ముందుగా ఓ చిన్న డిస్‌క్లెయిమర్……. ఒక ముఖ్యమంత్రో, ఒక సినిమా మంత్రో పెద్దగా అవార్డుల జోలికి వెళ్లరు… మా ఆబ్లిగేషన్స్ ఇవీ అని చెప్పరు… కానీ మధ్యమార్తాండులు డీల్ చేస్తుంటారు అన్నీ…

ఎస్, ఒక దిల్ రాజు… పక్కా సినిమా వ్యాపారి, బోలెడు రాగద్వేషాలు… సిండికేట్లు… ఒక జయసుధ… మహానటిని మించిన నటి… సరే, ఇక గద్దర్ అవార్డుల జోలికి వెళ్దాం ఓసారి… గత సంవత్సరానికి మొత్తం అన్ని విభాగాల్లోనూ అవార్డులు ప్రకటించిన జ్యూరీ 2014 నుంచి ఇప్పటివరకు ఉత్తమ, ద్వితీయ, తృతీయ, జ్యూరీ అవార్డులకు ఎంపికల్ని ప్రకటించింది…

Ads

ముందే చెప్పుకున్నాం కదా… జయసుధ గురించి… ఆమెను కూడా తప్పుదోవ పట్టించగల దిల్ రాజు గురించి… తెలుగు ఇండస్ట్రీ తన కనుసన్నల్లో నడవాలని, తను చెప్పిందే శాసనమనీ భావించే మగ శివగామి తను… అవును, మగ శివగామి…

ఓ మిత్రుడి పోస్టు చూశాను.,. ఇంట్రస్టింగు… ‘‘పాపులర్ సినిమాలు వేరు, మంచి సినిమాలు వేరు… ప్రతీ పాపులర్ హిట్ సినిమా మంచిదని కాదు… మంచి సినిమా పాపులర్ హిట్ కావాలనీ లేదు…’’ ఆహా… సూపర్…

ఉదాహరణకు పుష్ప-2… చెత్తా… ఓ స్మగ్లర్ జీవితం… దాన్నొక ఆదర్శంగా చెప్పదలుచుకుందా జ్యూరీ అల్లు అర్జున్‌కు ఉత్తమ నటుడి అవార్డు ఇవ్వడంలో… లేక పాత అరెస్టు బాపతు నెగెటివిటీకి విరుగుడు అనుకుందా..? లేక త్వరలో అల్లు అర్జున్‌తో దిల్ రాజుకు ఇంకేమైనా సినిమా బాపతు వ్యాపార సంబంధాల  ప్రయోజనాలు ఉన్నాయా..,?

తెలుగు రాష్ట్రాల్లో బాగా వైరల్ అయిన ఓ కార్టూన్ చూడండి… అది జనం అభిప్రాయాలకు సూచిక… ఆ వీడియోను సాంకేతిక కారణాలతో ఇన్‌క్లూడ్ చేయలేను గానీ… ఇదీ దాని చిత్రం…

gaddar awards

ఫాఫం, జయసుధకు గానీ, జ్యూరీ సభ్యులకు గానీ మంచి సినిమాకూ పాపులర్ హిట్ సినిమాకూ నడుమ తేడా తెలియదు… అసలు ఓ స్మగ్లర్ పాత్రకు ఉత్తమ నటి అవార్డును ఇవ్వడం అంటే… సమాజానికి తప్పుడు సంకేతం అనే భావన సమాజంలో విస్తృతంగా వ్యాపించింది ఇప్పుడు…

దిల్ రాజు, జయసుధ అవేమీ పట్టించుకోరు, మహా ముదుర్లు… సరే, ఓసారి 2014 నుంచి 2023 వరకు ఉత్తమ, ద్వితీయ, తృతీయ చిత్రాలను ఎంపిక చేసి ప్రకటించారు… పక్కాగా దిల్ రాజు ముద్ర ఉంది… జయసుధ జస్ట్ ఓ పాత్రధారి, అంతే… దాదాపుగా పాపులర్, గుడ్ కలెక్షన్లనే ప్రాతిపదికగా చేసుకున్నట్టున్నారు… ఫాఫం, దిల్ రాజు శాసిస్తుంటే అంతకుమించి మెరుగుదల ఏం కోరుకోగలం..?

తను సినిమా వ్యాపారి కదా… మొత్తం బ్యాలెన్స్ చేశాడు… దాదాపుగా ప్రతీ సినిమా హీరో కవరయ్యాడు… ఎలాగంటే..?

… 2014 రన్ రాజా రన్ , పాఠశాల, అల్లుడు శీను…. అల్లుడు శీను హీరో ప్రముఖ సినిమా కుటుంబ వ్యక్తి…

2015  రుద్రమ్మ దేవి, కంచె , శ్రీమంతుడు… అల్లు అర్జున్ కవరయ్యాడు, మహేశ్ బాబు, మెగా ఫ్యామిలీ బాపతు వరుణ్ కూడా కవరయ్యాడు…

2016 శతమానం భవతి, పెళ్లి చూపులు, జనతా గ్యారేజ్… దేవరకొండ విజయ్, జూనియర్ ఎన్టీయార్, చివరకు శర్వానంద్ కూడా కవరయ్యాడు…

2017 , బాహుబలి 2 , ఫిదా , ఘాజీ… దగ్గుబాటి ఫ్యామిలీ, ప్రభాస్ కవరైపోయారు… పనిలోపనిగా తెలంగాణ ఎమోషన్ కూడా కవరైంది ఫిదా అవార్డుతో…,

2018 మహానటి, రంగస్థలం , కేరాఫ్ కంచరపాలెం… మెగా మరో హీరో రాంచరణ్ కూడా కవరయ్యాడు… హమ్మయ్య, దిల్ రాజుకు ఇక ఢోకా లేదు…

2019… మహర్షి, జెర్సీ, మల్లేశం… చివరకు నాని, ప్రియదర్శిని కూడా కవర్ చేశారు… మహేశ్ సరేసరి….

2020… అల వైకుంఠపురంలో , కలర్ ఫోటో, మిడిల్ క్లాస్ మెలడీస్…. అల్లు అర్జున్‌కు మళ్లీ మళ్లీ ప్రయారిటీ…

2021… , ఆర్ఆర్ఆ,ర్ అఖండ, ఉప్పెన… అరె, మన అభిమాన నందమూరి లేకపోతే ఎలా..? సో, అఖండ వచ్చేసింది జాబితాలోకి… జూనియర్ ఎన్టీయార్ వచ్చాడు, రాంచరణ్ మళ్లీ వచ్చాడు…

2022, సీతారామం, కార్తీకేయ 2 , మేజర్… ఏమో, రేప్పొద్దున ఏ హీరోతో ఏం అవసరం వస్తుందో… దుల్కర్ సినిమా, చివరకు నిఖిల్ సిద్ధార్థ్ కూడా…

2023 బలగం, హనుమాన్, భగవంత్ కేసరి… అరె, నందమూరి బాలకృష్ణ మాటేమిటి..? అసలే ఇగోయిస్ట్, పైగా రేవంత్ రెడ్డికి దోస్త్… సో, భగవంత్ కేసరి కూడా జాబితాలోకి వచ్చేసింది అర్జెంటుగా… ఆల్రెడీ అఖండకు ఇచ్చినా సరే, బాలయ్య ఏ సినిమా చేసినా అవార్డు గ్యారంటీ… అదే దిల్ రాజు గ్యారంటీ…

ఇవేకాదు… ఎన్టీఆర్ అవార్డ్ బాలకృష్ణకి… పైడి జయరాజ్ అవార్డ్ మణిరత్నంకి… బిఎన్ రెడ్డి అవార్డ్‌ సుకుమార్‌కు… నాగిరెడ్డి చక్రపాణి అవార్డ్ అట్లూరి పూర్ణచంద్రరావుకి… కాంతారావ్ అవార్డ్ విజయ దేవరకొండకు… రఘపతి వెంకయ్య అవార్డ్ యండమూరి వీరేంద్రనాథ్‌కు…

అరె, అవార్డుల ఎంపికకు ప్రామాణికాలు ఏముంటయ్..? సెలెక్ట్ చేసేయడమే.., చివరగా, నిక్కచ్చిగా చెప్పుకునే ఓ మాట… స్పెషల్ జ్యూరీ అవార్డు ప్రజాకవి కాళోజీకి ఇచ్చారు, గుడ్, అర్హమైందే… పక్కా తెలంగాణ సినిమా… కానీ ఆ సినిమా రిలీజుకు నిర్మాతకు ఎన్ని కష్టాలు, ఇదే సిండికేట్ లీడర్ దిల్ రాజు ఏం సాయం చేశాడు..?

అవార్డులు కాదోయ్, ఆ సినిమా పది మందీ చూశారా..? చూసే అవకాశం ఇచ్చావా నువ్వు..? ఫాఫం రేవంత్ రెడ్డి… దిల్ రాజు వంటి పక్కా కమర్షియల్, మిస్ గైడింగ్ కేరక్టర్‌ను నమ్మితే ఏమొస్తుంది..? ప్చ్…!!

 

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ‘‘అబ్బో, ఆమె చాలా కాస్ట్‌లీ అట, ఎక్కువ డిమాండ్ చేస్తుందంటున్నారు…’’
  • ఫిక్సేనా..? ‘ఈసాల కప్ నమ్‌దే’ నిజమేనా..? ఈ జోస్యం ఫలిస్తుందా..?
  • ఈమె సోనియాని మించిన హక్కుదారు..!? అడుగడుగునా ఓవరాక్షన్..!!
  • రియల్ సూపర్‌స్టార్ కృష్ణను సరిగ్గా ఆవిష్కరించిన కథనం ఇది..!!
  • మొక్కు కోడెల ఉసురు… కలుక్కుమనిపించే మరణాల వార్తలు…
  • ‘మిస్ బిహేవ్’ అంటే… మిస్ వరల్డ్ వివాదం రేవంత్ మెడకు చుట్టడమా..?!
  • నాటి జతొజడ జమజచ్చ జంట… ప్లెయిన్, ఫెయిర్ మూవీ…
  • మూడు ‘నందుల’ ముచ్చటైన ‘ఉషాకిరణం’… కాంచనగంగ…
  • కామాఖ్య కాదు… మన ‘మహా నేతలూ’ నమ్మిన ఈ తాంత్రిక గుడి వేరు…
  • ఉహుహుహు… మనవాళ్లు వణికే చలిలోనూ వేడి పుట్టించగలరు సుమీ…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions