Padmakar Daggumati……… ఇరవై ఏళ్లకిందట ఒకసారి ఏదో చిన్న వీక్లీలో ఒక అప్రధానమైన పేజీలో ఐన్‌స్టీన్ ఫోటోతో ఏదో విశేషం కనపడితే చదివాను. అది నన్ను భలే ఆకర్షించింది.
ఏదైనా ఒక విషయం తాలూకు ఖచ్చితత్వం నిర్ధారించడానికి స్థలం, కాలం ప్రాతిపదికన మాత్రమే మనం స్పష్టంగా వివరించగలం. స్థలం విషయంలో చాలావరకు మనం అంతరిక్షం, చంద్రుడు ఇంకా ఇతర గ్రహాల విషయాలలో సైన్స్ సహాయంతో ఖచ్చితత్వం సాధిస్తున్నాము. అయితే కాలం విషయంలో మాత్రం లభించగలిగిన గతం, వర్తమానం వరకూ మాత్రమే విషయాలను వివరించగలం. అంటే నిన్న/మొన్న/లేదా 2012/ఆగస్టు/29/మధ్యాహ్నం/2 గంటలా-29 నిమిషాల-57 సెకండ్లకు- // ఫలానా దేశం/రాష్ట్రం/ జిల్లాలో/ నగరంలో/స్థలంలో/ ఫలానా జరిగింది అని నిర్ధారించగలం. కానీ రేపు ఫలానా స్థలంలో ఫలానా కాలంలో ఫలానా జరిగింది అని నిర్ధారించలేము.
అయితే ఆ వ్యాసంలో ఐన్‌స్టీన్ పేరుతో రాసిన మాటలలో కాలం అనే డైమెన్షన్ కూడా (రేపైనా/వచ్చే 2024 ఎవరు ప్రధానమంత్రి/ముఖ్యమంత్రి వంటివి కూడా ఇప్పటికే నిర్ధారించబడి ఉంటాయి అని అందులో సారాంశం. అంటే మనం బస్సు/రైలు/విమానం.. ఇలా ఏదైనా వాహనంలో ఒక స్థంలంనుంచి మరో స్థలానికి చేరుకుంటాము. ఆ స్థలం అప్పటికే ఉన్నది. అప్పటికే ఉన్న స్థలంలోకి మనం చేరుకుంటుంటాము. ఇదే విషయాన్ని కాలంలో కాలంలో కూడా అప్లయ్ చేస్తూ ఉందా రచన.
Ads
అంటే ఉదాహరణకు ఇప్పుడు నువ్వు సింగపూర్ పోతావు, అది నువ్వేమీ నిర్మించవు. నిర్మించబడి ఉన్న సింగపూర్ కి నువ్వు చేరుకుంటావు. అలాగే కాలం అనే డైమెన్షన్ కూడా పనిచేస్తుంది. అంటే రేపు ఎక్కడ/ఏ ఊరిలో/ఏ సమయానికి/ఏం జరగాలో అది స్క్రిప్టెడ్ అనీ, ఆ స్థలంలో ఆ కాలానికి నువ్వు చేరుకుంటావనీ, పొలిటికల్ భాషలో చెప్పాలంటే నువ్వు కొత్తగా తపనపడి, పరిశోధించి, పీకేదేం లేదనీ.
ఈ విషయం ఉత్సాహంగా మా గురువు ఒకతనికి ఫోన్ చేసి వినిపించాను. ఆయన ఐన్‌స్టీన్ పేరుతో ప్రతి అడ్డమైన వెధవా నాలుగు అక్షరాలు చదివించడానికి ఏదేదో రాస్తుంటారంటూ ఆ వార్తనీ, నన్నూ తుక్కుతుక్కుగా సైంటిఫిక్ గా చావగొట్టాడు. ఆ దెబ్బలేవీ ఇప్పుడు గుర్తులేవు.***నిన్న రాత్రి BRO సినిమాకి పోయాను. సినిమా క్లైమాక్స్ లో నేను పైన చెప్పిన సిద్దాంతం ఆధారంగానే చివర్లో దేవుడు పాత్రధారి పవన్ కళ్యాణ్ మాట్లాడతాడు.
ఆ సినిమా ప్లాప్ అవుతుందని ముందుగా తెలిసుంటే బహుశా తీసుండకపోయేవాడేమో అనిపించింది. అలాగే 2019 లో జగన్మోహన్ రెడ్డి సియం కాలేడు, ఇది శాసనం అని ప్రకటించేవాడు కాదేమో. అలాగే 2024లో ఎట్టిపరిస్థితుల్లోనూ వైసీపీ అధికారంలోకి రాదు అనేవాడు కాదేమో. అలా అనకపోయినా పవన్ కళ్యాణ్ 2024లో సియం అవుతాడేమో. పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేస్తుంటే చంద్రబాబు, జగన్ పక్కపక్కనే కూర్చుని ముచ్చటించుకునే ఫోటో ఆంధ్రజ్యోతి, ఈనాడు, సాక్షి పత్రికల్లో బాక్స్ కట్టి వేస్తారేమో…
Share this Article