శరత్ కుమార్ చింత…. ఆదిపురుష్ విజువల్ ఎఫెక్ట్స్ క్వాలిటీ అసలు బాగాలేదు అని డైరెక్టర్ కి చెప్తే అసలు నాకు టీజర్ ని యూట్యూబ్ లో పెట్టడమే ఇష్టం లేదని, మీకు యూట్యూబ్ లో చిన్న మొబైల్ స్క్రీన్ మీద చూస్తే అలాగే అనిపిస్తుంది, Big Screen మీద చూస్తే మాత్రం పిచ్చెక్కిపోతుంది అంటున్నారు డైరెక్టర్ ఓం రౌత్..
ఒక్కసారి గమనిస్తే ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ లో ‘రింగ్స్ ఆఫ్ పవర్’, హాట్ స్టార్ లో ‘హౌస్ ఆఫ్ ది డ్రాగన్’ అనే రెండు హాలీవుడ్ వెబ్ సిరీస్ లు ట్రెండింగ్ లో ఉన్నాయి.. ఈ రెండు సిరీస్ ల్లో మనము చూసే ప్రతి ఫ్రేమ్ విజువల్ ఎఫెక్ట్.. మొత్తం విజువల్స్ అన్ని గ్రాఫిక్స్ అయినప్పటికీ చాలా రియలిస్టిక్ గా ఉంటాయి. 90% ఆడియన్స్ మొబైల్ లోనే ఈ సిరీస్ లు చూసి ఫిదా అయిపోయారు. ఒక్కరు కూడా ఈ రెండు సిరీస్ ల C.G work మీద కంప్లైంట్ చేయలేదు. అలాంటిది ఆదిపురుష్’ టీజర్ ను యుట్యూబ్ లో చూడగానే ఎందుకు వేలెత్తి చూపిస్తారు?
డబ్బులు ఎంతైనా ఖర్చు పెట్టే T Series లాంటి పెద్ద సంస్థ ఉండగా ఇలా నాసిరకమైన గ్రాఫిక్స్ తో సినిమా పూర్తి చేసి టీజర్ ని ఎవరితో చెక్ చేయించకుండా, అభిప్రాయాలు తీసుకోకుండా నేరుగా రిలీజ్ చేయడం వల్లే ఇప్పుడీ పరిస్థితి వచ్చింది.
అసలు ఏ పాయింట్ మీద ట్రోల్ చేస్తున్నారో తెలియకుండా మాట్లాడితే అది ఖచ్చితంగా ఓం రౌత్ తప్పే… యుట్యూబ్ లో చూస్తే క్వాలిటీ ఉండదు.. థియేటర్ లో చూస్తే సూపరుంటుంది అని దర్శకుడు చెబుతుంటే.. మరి ఆడియన్స్ చెవిలో ఏకంగా ఆదిపురుష్ టీజర్లో ఉన్న గ్రాఫిక్స్ పువ్వుల్ని పెట్టేస్తున్నాడని అర్ధమవుతుంది. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే.. టీజర్ మీద జరుగుతున్న ట్రోలింగ్ కి, ఈయనిచ్చిన రెస్పాన్స్ కి.. దండేసి దణ్ణం పెట్టాలి.
ఒక్క విషయం మాత్రం డైరెక్టర్ ఓం రౌత్ ఓపెన్ గా చెప్పారు.. ఈ నెగెటివ్ రెస్పాన్స్ తనలో కాన్ఫిడెన్స్ తగ్గించందని..! T Series మాత్రం ఈ ట్రోల్స్ ని సీరియస్ గా తీసుకుంది. విజువల్స్ అన్నింటినీ మరోసారి ఎడిట్ చేసేందుకు ఆలోచిస్తుంది. టీజర్ మీద వచ్చిన అభ్యంతరాలపై వివరణ ఇవ్వాలని, తమ వెర్షన్ చెప్పాలని ‘ఆదిపురుష్’ టీం ఫిక్స్ అయింది. నేడు హైదరాబాద్‌లో ‘ఆదిపురుష్’ టీం ప్రెస్ మీట్ ఉండొచ్చు… ((ఈ దర్శకుడు ఒక ట్వీట్‌లో vfzwaala అని ట్యాగ్ చేశాడు… బాబోయ్, ఆదిపురుష్‌కు మేమేం పనిచేయలేదు మహాప్రభో అని సదరు సంస్థ ఖండించింది… గుర్తుంది కదా… ఇదీ సదరు దర్శకుడి స్థాయి..))
Share this Article