థంబ్ నెయిల్స్ మాయలో పడి చెప్పడం లేదు… నిజంగానే షాక్ తిన్నట్టయింది… బాహుబలి వంటి హైబడ్జెట్ చిత్రాల్లో కూడా పాడుతున్న కీరవాణి శిష్యరత్నం, కాస్త పద్దతిగా కనిపించే రమ్య బెహరా నోటి వెంట ఆ డైలాగ్ వినడం నిజంగా షాకే…
అదీ ఓ మ్యూజిక్ కంపిటీషన్ రియాలిటీ షోలో… జీతెలుగులో ఆల్రెడీ సీరియళ్లను భ్రష్టుపట్టించారు తెలిసిందే కదా… మాటీవీకి పోటీ ఇవ్వలేక ఎదురీదుతోంది… ఆ ఈటీవీ దరిద్రపు ప్లానింగ్ పుణ్యమాని వేరే దిక్కులేక జనం మాటీవీతో పాటు జీతెలుగును చూస్తున్నారు గానీ… లేకపోతే ఇప్పటి దాని క్రియేటివ్ లెవల్స్ మహా నాసిరకం… గత సీజన్‌లో అనంత శ్రీరామ్ పిచ్చిగెంతులు… అంతకుముందు ప్రదీప్ పిచ్చి కామెడీ ఎట్సెట్రా…
సరిగమప అని ఓ సినిమా సాంగ్స్ షో చేస్తోంది కదా ఆ చానెల్… ఆల్రెడీ గత సీజన్లో దాన్ని జస్ట్, ఓ ఎంటర్‌టెయిన్‌మెంట్ షోగా మార్చేసిన తీరు మనం ఆల్రెడీ చెప్పుకున్నాం… కామెడీ, చిల్లర వెగటు వినోదపు వేషాలతో దాన్ని మ్యూజిక్ షో కాదు, మరో శ్రీదేవి డ్రామా కంపెనీగా మార్చేశారు…
Ads
గీతామాధురి అండ్ టీం ఆల్రెడీ ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ షోను భ్రష్టుపట్టించారు కదా… కనీసం ఈ జీతెలుగు సరిగమ కాస్త పాఠాలు నేర్చుకుంటుందేమో అనుకుంటే… గత సీజన్లకన్నా నాసిరకంగా మార్చేస్తున్నారు… ఇప్పటికే మనం ఒకసారి చెప్పుకున్నాం… మరీ ఎస్పీ బాలు 3 వేలకు పాటలు పాడిన రోజులున్నాయి అని కంపోజర్ కోటి అదేదో పిచ్చి కూతకు దిగిన తీరు గురించి…
ఫాఫం, ఎస్పీ శైలజ… పాటలకు చాన్సులు ఎవరూ ఇవ్వకపోతే మరీ ఇలాంటి షోలకు రావాలా తల్లీ..? ఇజ్జత్ పోయినట్టు అనిపించడం లేదా..? రమ్య బెహరా డైలాగ్ ఏమిటో తెలుసా..? ‘‘చీరె చిరిగిపోద్ది..’… ఇది మ్యూజిక్ రియాలిటీ షో అట, మనం నమ్మాలట… మస్తు నీతులు మాట్లాడుతుంది కదా సింగర్ చిన్మయి… ఏమ్మా, ఇలాంటి డైలాగులు మహా రంజకంగా ఉన్నాయా తమరికి..? రేవంత్, విజయ్ ఏసుదాసు, అనుదీప్ ఎట్సెట్రా చాలా పెద్ద మొహాలున్నాయి… చివరకు దాని క్వాలిటీ ఇదా..?
తనెవరో… పరదేశి అట… జబర్దస్త్ షోలోనూ ఒక్క డైలాగూ చెప్పలేడు… పరిణతి లేదు… ఒక్క స్కిట్ లేపలేడు… ఆమధ్య దొరబాబుతో కలిసి అక్కడెక్కడో వ్యభిచారం కేసులో అరెస్టయినట్టు గుర్తు… తను ఈ జీతెలుగుకు డైలాగ్ రైటర్..? షేమ్… అసలు హైపర్ ఆది బాపతు కల్చరే టీవీ షోలను ఎటెటో తీసుకుపోతుంటే, చివరకు తన శిష్యరత్నాలు ఏకంగా స్క్రిప్టులు రాయడం, దాన్ని జీతెలుగు యాజమాన్యం కళ్లకద్దుకోవడం…
ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ షోకు కమెడియన్ హరి డైలాగ్స్, స్క్రిప్ట్స్ రాస్తున్నాడు… ఏదో ఎపిసోడ్‌లో థమన్‌తో ప్రాసతో ‘ఉ-’ అనే పదం పలికించబోయి, శ్రీరామచంద్రతో ఆపండి ఆపండి అనిపించి ఆపేశారు…
జబర్దస్త్ బాపతు క్రియేటివ్ రైటర్స్ రాస్తే అలాగే కంపు కొడతాయి మరి… మరి ఆయా చానెళ్ల క్రియేటివ్ టీమ్స్‌కు ఇదేం దరిద్రం..? ఎవడూ రాసేవాడే దొరకడం లేదా..? అమ్మా శైలజా… అయ్యా కోటీ… ఇంకో అయ్య కాసర్లా… తల్లీ రమ్యా బెహరా… ఎంతకు దిగజారిపోతున్నారు బాబోయ్..!! ఇంకెన్ని వికారాలు చూడాలో ఏమో… ఖర్మ… శైలమ్మా, ఏం కరువొచ్చిందని ఈ పిచ్చి షోలలో నీ ఉనికి..?!
Share this Article