ప్రపంచంలో ఎక్కడా జాబ్ మార్కెట్ బాగాలేదు… చాలా వార్తలు వింటున్నాం… లక్షలు పోసి అమెరికాలో ఎంఎస్ చేసి, నిరాశగా వెనుతిరిగిన వాళ్ల ఉదాహరణలు కూడా చదువుతున్నాం… ఏవేవో టెంపరరీ జాబ్స్ చేస్తూ, ఖర్చులు కనాకష్టంగా వెళ్లదీస్తున్న వాళ్లు వేలల్లో ఉన్నారు అక్కడే…
ఆస్ట్రేలియా, కెనడా, బ్రిటన్… ఎక్కడ చూసినా ఏమీ ఆశాజనకంగా లేదు… ఎస్, ఇండియాలోనూ అంతే… కాకపోతే మరీ వేరే దేశాల్లో ఉన్నట్టుగా తీసివేతలు లేవు కాబట్టి ఆ ఇంపాక్ట్ ఎక్కువగా కనిపించడం లేదు… కాకపోతే రిక్రూట్‌మెంట్లు బాగా తగ్గాయి… ప్రైమరీ ప్యాకేజీలు కూడా బాగా పడిపోయాయి…
మరీ చెప్పుకోదగిన విశేషం ఏమిటంటే… ప్రఖ్యాతి గాంచిన బాంబే ఐఐటీ ప్లేస్‌మెంట్లలో ఈసారి కనీస ప్యాకేజీ మరీ 4 లక్షలకు పడిపోయింది… నిజమే, మీరు చదువుతున్నది… పది మంది ఐఐటీ గ్రాడ్యుయేట్లు ఆ ప్యాకేజీకి కూడా సరేనని ఆఫర్ లెటర్లు తీసుకున్నారు… గత ఏడాది కనీస ప్యాకేజీ 6 లక్షలకు పైగా ఉండింది…
Ads
అసలు మొత్తం గ్రాడ్యుయేట్లకు ప్లేస్‌మెంట్లు దొరకలేదు… వచ్చాయి, బోలెడు మల్టీ నేషనల్ కంపెనీలు, ఇండియన్ కంపెనీలు వచ్చాయి… కానీ ఆచితూచి జాగ్రత్తగా ఎంపిక చేసుకున్నాయి… కొందరికి కోటి రూపాయల ప్యాకేజీలతో కూడా జాబ్స్ వచ్చాయి… మొత్తం 364 కంపెనీలు 1650 జాబ్స్ కోసం ప్రయత్నిస్తే … 22 మందికి కోటిరూపాయలపై ప్యాకేజీలు దక్కాయి…
ఈ ప్యాకేజీల మాటెలా ఉన్నా… ఇచ్చిన కొలువులు గతంకన్నా తక్కువ… 2414 మంది విద్యార్థులకు గాను 1979 మంది క్యాంపస్ ప్లేస్‌మెంట్లలో పాల్గొన్నారు… 1475 మందికి ఆఫర్ లెటర్స్ ఇచ్చారు… 78 మందికి విదేశీ జాబ్స్… ఇదీ స్తూలంగా ఐఐటీ బాంబే కొలువుల కథ…
ఇక్కడే ఇలా ఉందంటే… ఇక ఎన్ఐటీలు, ఇతర ఐఐటీలు, పేరున్న పెద్ద కాలేజీల్లో కథలు ఇంతకు భిన్నంగా ఏముంటాయి..? మామూలు కాలేజీల్లో చదివిన పిల్లల మాటేమిటి..? ఏమీలేదు, ఎంఎస్ అంటూ అమెరికాకు లక్షల అప్పులు చేసి వెళ్లడం… అక్కడ జాబ్ మార్కెట్ మరీ ఘోరంగా ఉండి, అయోమయంలో పడిపోవడం… అక్కడ ఉన్న కొలువులే ఊడిపోతున్నాయి, ఇక కొత్తవాటి మాట చెప్పనక్కర్లేదు…
ఈమధ్య పదే పదే అమెరికాలో రెసిషన్ అనే మాట ప్రచారంలోకి వస్తోంది… అదే గనుక నిజమైతే అమెరికా జాబ్ మార్కెట్ మరింత ఘోరంగా ఉండనుంది… ఆ ప్రభావం ఇండియన్ మార్కెట్ కూడా సహజంగానే నెగెటివ్‌గా పడనుంది…! రోజులు బాగాలేవు..!! (Source :: Money Control)
Share this Article