16 కోట్ల బడ్జెట్ సినిమా… అనితరసాధ్యమైన రీతిలో తెరకెక్కించాడు… దర్శకుడు తనే… హీరో తనే… సినిమా ఓ కొత్త చరిత్ర సృష్టిస్తూ 460 కోట్లు వసూలు చేసింది… కానీ కాంతార దర్శకుడు రిషబ్ శెట్టికి దక్కిందేమిటి..? హొంబళె ఫిల్మ్స్ వాళ్లు రిషబ్ శ్రమను, ప్రయాసను, క్రియేటివిటీనీ లైట్ తీసుకున్నారా..? రిషబ్ శెట్టికి దక్కింది ముష్టి మాత్రమేనా..? ఇదీ కన్నడ మీడియాలో కొత్త చర్చ…
ఈ చర్చ ఉద్దేశపూర్వకమా..? నిజంగానే రిషబ్ శెట్టికి అన్యాయం జరిగిందా..? నిజానికి రిషబ్ శెట్టి ఎక్కడ తప్పు చేశాడు..? కాస్త వివరాల్లోకి వెళ్దాం… ఒక సినిమా మంచి టాక్ వచ్చిందంటే చాలు, దర్శకుడికి ఖరీదైన కారు గట్రా గిఫ్టులు ఇవ్వడం కామన్… టాలీవుడ్‌లో ఆ సంప్రదాయం ఉంది… శంకర్ సినిమా లాభాల్లో వాటా తీసుకుంటాడు… లెక్క ప్రకారం… చాలామంది దర్శకులు ఇప్పుడు ఏరియా వైజ్ హక్కులు తీసుకుంటున్నారు… ఫాఫం, రిషబ్ అవేమీ చేయలేదు…
కాంతారకు ముందు రిషబ్ అంత పెద్ద దిగ్దర్శకుడు ఏమీ కాదుగా… అందుకని తన సినిమాకు ఓ మంచి బ్యానర్ దొరికింది, అదే పదివేలు అనుకున్నాడు… 16 కోట్ల బడ్జెట్‌లో 4 కోట్లు ఇస్తామనేసరికి సంబరపడిపోయాడు… ఇక డిమాండ్ చేయడానికి ఏముంది..? ఇప్పుడైతే తను వేరే డిమాండ్లు పెట్టేవాడేమో…! కానీ 460 కోట్ల వసూళ్లు చేసిన సినిమాకు కర్త, కర్మ, క్రియ అయిన ఓ వ్యక్తికి నిర్మాతలు చేసిన మర్యాద ఏముంది..? ఏమీ లేదు… ఆ 4 కోట్లు పడేశారు…
Ads
నిజానికి సినిమాలో మిగతా యాక్టర్స్‌కు కూడా బాగానే ఇప్పించాడు రిషబ్ శెట్టి… మామూలు పరిస్థితుల్లో తను తీసుకున్న 4 కోట్లు కూడా తక్కువేమీ కాదు… కానీ అంత పెద్ద మెగా హిట్ అయ్యాక సదరు నిర్మాతలు హీరో కమ్ దర్శకుడికి ఇచ్చిన అదనపు క్రెడిట్ ఏమిటి…? జీరో..!
సరిగ్గా ఇదే రిషబ్ శెట్టిని నొప్పి కలిగిస్తున్నట్టుంది… అందుకే కాంతార-2 సీక్వెల్‌పై ఇంకా ఏదీ ఖరారుగా మాట్లాడటం లేదంటున్నారు… కాంతారలో ఫారెస్ట్ ఆఫీసర్ మురళిగా నటించిన కిషోర్‌కు కోటి రూపాయలు ఇచ్చారు… నిజానికి ఇది చాలా ఎక్కువ తన రేంజుకు… సుధాకర్ అనే పాత్ర పోషించిన ప్రమోద్ శెట్టికి 60 లక్షలు ఇచ్చారు… విలన్‌గా నటించిన అచ్యుత్ కుమార్‌కు 40 లక్షలు, అంతెందుకు… అంత పెద్దగా పాపులారిటీ లేని హీరోయిన్ సప్తమి గౌడకు కూడా కోటి రూపాయలు ఇప్పించాడు రిషబ్…
తీరా చూస్తే… తనకు అన్యాయం జరిగిందనేది కన్నడ మీడియా విమర్శ… దీనిపై ఇప్పటికైతే రిషబ్ గానీ, హొంబలె ఫిలిమ్స్ అధినేత విజయ్ కిరగందూర్ గానీ కిక్కుమనడం లేదు… ఈ సినిమా అవకాశం ఇవ్వడమే ఎక్కువ, ఇంకా అదనంగా ఏమివ్వాలి అని గనుక విజయ్ భావిస్తుంటే, అది నిజంగా సినిమా ఇండస్ట్రీ మర్యాదల ప్రకారం అమర్యాదే… రిషబ్‌కు అవమానమే..!!
Share this Article