Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

కర్నాటక డీకే శివకుమార్ మరో జయలలిత కాబోతున్నాడా..? చూడబోతే అదే..!!

November 10, 2023 by M S R

వేడెక్కుతున్న కర్ణాటక రాజకీయం!

కాంగ్రెస్ అంటే ముఠా తగాదాల రాజకీయం!

కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు సహజమే!

Ads

దానికి మా పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ అని ప్రచారం చేసుకుంటుంది!

అసలు రెండు లేదా మూడు వర్గాలుగా చీలిపోయి పాలన చేసిన రాష్ట్రాలు ఉన్నాయి గతంలో!

కర్ణాటకలో కూడా ప్రస్తుతం అదే ట్రెండ్ నడుస్తున్నది!

*************************

కర్ణాటక కాంగ్రెస్ లో రెండు పవర్ హౌస్ లు ఉన్నాయి!

సిద్ధరామయ్య, డీకే శివకుమార్…

పేరుకే సిద్ధరామయ్య ముఖ్యమంత్రి!

తనకి, తనవారికి కావాల్సిన పనులని అధికారులని బెదిరించి మరీ చేయించుకుంటున్నాడు DK శివకుమార్!

సచివాలయానికి, క్లియరెన్స్ కోసం CM పేషీకి వచ్చే ఫైళ్ళలో ఎక్కువగా DK శివకుమార్ వే ఉంటున్నాయి.

ఎందుకొచ్చిన గొడవ అనుకోని సిద్ధరామయ్య సంతకాలు పెట్టి పంపిస్తున్నాడు!

మరో వైపు సిద్ధరామయ్య అనుచరులు తమకి దక్కాల్సిన పనులని DK శివకుమార్ తన అనుచరులకు కట్టబెడుతున్నాడు అని అసంతృప్తితో ఉన్నారు!

DK శివకుమార్ ఎప్పుడు ఎలాంటి అవాంఛనీయ చర్యలకు పాల్పడతాడో తెలియదు కాబట్టి సర్దుకుపొమ్మని చెపుతున్నాడు సిద్ధరామయ్య!

*********************

అక్టోబర్ 19, 2023!

కర్ణాటక హైకోర్టు DK శివకుమార్ మీద సీబీఐ దర్యాప్తు చేయకుండా ఇచ్చిన స్టే ఎత్తివేసి మిగిలిన దర్యాప్తు పూర్తి చేయడానికి అనుమతి ఇచ్చింది.

సిద్ధరామయ్యకి ఇది ఊరట కలిగించే అంశం!

కానీ DK శివకుమార్ తాను జైలులోకి వెళితే సిద్ధరామయ్య మరింత బలపడతాడు అని ఆలోచించి ఒక ముందస్తు ప్రణాళిక ని సిద్ధం చేసుకున్నారు!

JDS పార్టీకి చెందిన 13 మంది MLA లకి గాలం వేశాడు!

ఈ విషయం స్వయంగా దేవెగౌడ వెల్లడించాడు! JDS కి చెందిన 13 మంది MLA లు DK పిలిచిన వెంటనే కాంగ్రెసులో చేరడానికి సిద్ధంగా ఉన్నారు!

అయితే JDS MLA లు DK గ్రూపులో ఉంటారు!

తాను జైలుకి వెళ్లే లోపు ముఖ్యమంత్రి అవ్వాలని DK కోరుకుకుంటున్నాడు!

కానీ 70 మంది కాంగ్రెస్ MLA లు సిద్ధరామయ్య గ్రూపులో ఉన్నారు. కానీ సందట్లో సడేమియాలాగా కనీసం 5 ఉప ముఖ్యమంత్రి పదవులు తమకి ఇవ్వాలి అని డిమాండ్ చేస్తున్నారు. అలా అయితేనే DK ప్లాన్ ని సమర్ధంగా ఎదుర్కోగలమని సిద్ధరామయ్యకి నచ్చ చెపుతున్నారు.

కానీ ఈ 70 మందిలో ఎంతమంది చివరి క్షణంలో DK వైపు వెళతారో ఇప్పటికిప్పుడు చెప్పడం కష్టం కానీ DK వైపు వెళ్ళేవాళ్ళు బాగానే ఉన్నారని తెలుస్తున్నది!

సిద్ధరామయ్య 5 ఉప ముఖ్యమంత్రి పదవులు ఇస్తే సరి లేకపోతే సమయం వచ్చినప్పుడు ప్లేటు ఫిరాయించే అవకాశం ఉంటుంది!

కర్ణాటకలో ఒక్కళిగ ఓట్లని తనవైపు తిప్పుకొనేందుకు DK ప్రణాళిక రచించి దానిని అమలులో పెడుతున్నాడు. ఒకవేళ DK వ్యూహం ఫలిస్తే JDS ఖాళీ అవుతుంది. ముందస్తుగా DK కి చెక్ పెట్టేందుకు కుమారస్వామి సిద్ధరామయ్యతో చేతులు కలిపే అవకాశాలు ఉన్నాయి!

అసలు 5 ఉప ముఖ్యమంత్రి పదవులు అనే కాన్సెప్ట్ DK వ్యూహం అనే ప్రచారం కర్ణాటక రాజకీయ వర్గాలలో ఉంది!

**************************

బెల్గాంలో DK కి ప్రతిఘటన ఎదురవుతోంది. ముఖ్యంగా లక్ష్మీ హెబ్బాల్కర్ ని అడ్డుపెట్టుకొని బెల్గాం జిల్లా రాజకీయాలని తన గుప్పిట్లో పెట్టుకోవాలని చూస్తున్నాడు అంటూ అదే జిల్లాకు చెందిన జర్కి హొలీ సోదరులు సిద్ధరామయ్యతో మొర పెట్టుకున్నట్లు తెలుస్తున్నది.

***************************

DK శివకుమార్ మరో జయలలిత కాబోతున్నాడా?

పరిస్థితులు చూస్తుంటే అవును అనే సమాధానం వస్తుంది!

సీబీఐ విచారణ మీద హైకోర్టు స్టే ఇచ్చే సమయానికి CBI తన దర్యాప్తుని దాదాపుగా పూర్తిచేసింది!

11 వాల్యుమ్ లతో 2412 పేజీల రిపోర్ట్ సిద్ధం చేసింది. మరో 5096 పేజీల మెటీరియల్ డాక్యుమెంటరీ సాక్ష్యాలు DK శివకుమార్ కి చెందిన అక్రమ ఆస్తులకి సంబంధం ఉన్నవి సిద్ధం చేసింది CBI!

ఇది సరిగ్గా జయలలిత అక్రమ ఆస్తుల కేసుని పోలి ఉందని తెలుస్తున్నది!

అయితే జయలలిత కేసు కంటే DK శివకుమార్ కేసు మరింత బలమయిన సాక్ష్యాలతో ఉంది కాబట్టి జైలు శిక్ష నుండి తప్పించుకోవడం అసాధ్యం!

DK శివకుమార్ మీద ఆదాయపు పన్ను ఎగవేత, మనీ లాండరింగ్, అవినీతి, బినామీ ఆస్తులు, చాలా కేసులు ఉన్నాయి. అయితే మొత్తం 800 కోట్లు విలువ చేసే భూములు, భవనాలు, విల్లాలు, గుర్తు తెలియని వ్యక్తుల పేరిట ఉన్నట్లు బయటపడ్డది!

ఎలెక్షన్ కమిషన్ కి ఇచ్చిన ఆఫడవిట్ లో తన భార్య పేరు మీద ఉన్న 78 కోట్ల విలువ చేసే ఆస్థులు, కూతురు పేరు మీద ఉన్న 28 కోట్ల ఆస్థులు పేర్కొనలేదు DK శివకుమార్!

DK శివకుమార్ కి చెందిన గ్లోబల్ మాల్ లో 78 కోట్లు నగదు రూపంలో పట్టుకుంది ఆదాయపన్ను శాఖ!

ఈ అక్రమ ఆస్థులు అన్నీ కూడా 2013-18 మధ్య సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సంపాదించినవే!

సిద్ధరామయ్య మాత్రం మిగిలిన దర్యాప్తు విషయంలో సీబీఐ కి సహకరించడానికి సిద్ధంగా ఉన్నట్టు సమాచారం!

IT, ED, CBI లు సంయుక్తంగా దర్యాప్తు చేశాయి!

హైకోర్టు, సుప్రీంకోర్టు లు కేవలం మూడు నెలలు మాత్రమే గడువు ఇచ్చాయి దర్యాప్తు సంస్థలకి!

జనవరి మొదటివారంలోగా విచారణ పూర్తి చేయాల్సి ఉంటుంది!

*************************

2024 లోకసభ ఎన్నికల నాటికి DK జైల్లో ఉంటాడు!

తాను ఎటూ జైలుకి వెళతాడని DK కి తెలుసు!

తాను కోరుకుంటున్నట్లు కర్ణాటకలో సిద్ధరామయ్య ఉండకూడదు కాబట్టి భవిష్యత్ ప్రణాళికలో భాగంగా బీజేపీ పార్లమెంట్ సభ్యుడు తేజస్వి సూర్యతో భేటీ అవడం అనేది జరిగి ఉండవచ్చు!

తెలంగాణ ఎన్నికల కోసం దాదాపుగా 1000 కోట్లు తరలించే సమయంలో DK అనుచరులే పట్టిచ్చారు అని టాక్ కానీ నిజం ఏమిటో తెలియదు!

5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు రాగానే కర్ణాటకలో రాజకీయం రసవత్తరంగా ఉండబోతుంది అనేది నిజం!…….. పార్ధసారధి పోట్లూరి 

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • అవునూ హరీషూ… కొండగట్టు బస్సు ప్రమాద మృతులు గుర్తున్నారా..?!
  • సైన్స్, ఎమోషన్, సంప్రదాయం ఆస్తికత్వం, హేతువాదం… హేట్సాఫ్ టి.కృష్ణ..!!
  • ‘‘హస్తరేఖలు మన పిడికిట్లో ఉన్నట్టే ఉంటాయి, కానీ మన మాట వినవు’’
  • వినేవాడు వెర్రివెంగళప్ప అయితే… చెప్పేది రష్మిక మంధానా..!!
  • పరమ నాసిరకం ఫైటర్లను ఇండియాకు అంటగట్టే యత్నం… పార్ట్-2
  • మోడీ వినక తప్పలేదు… బనకచర్ల కుట్రను చేధించిన రేవంత్‌రెడ్డి…
  • F-35 …. అడ్డగోలు లోపాల ఫైటర్… అమెరికా అంటగట్టే యత్నం… పార్ట్-1
  • దిల్ రాజు మారడు… ఎవడూ తన కళ్లకు ఆనడు… ప్రతి మాటలో అహం..!!
  • ‘సంఘ్’ నేపథ్యమే ప్రధాన అర్హతా..? చంద్రబాబు మాటే చెల్లుబాటా..?!
  • కామాఖ్య కాదు… మన ‘మహా నేతలూ’ నమ్మిన ఈ తాంత్రిక గుడి వేరు…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions