ప్రతాప్ పోతన్… ఇప్పటి తెలుగు తరానికి చాలామందికి తెలియకపోవచ్చు తనెవరో…! కానీ ప్రతిభావంతుడైన నటుడు… కానీ ఓ చిత్రమైన మనిషి… సరిగ్గా కెరీర్ ప్లాన్ చేసుకుంటే కమలహాసన్ తరహాలో వెలిగిపోవల్సినంత ప్రతిభ ఉంది… మరి డెస్టినీ ఒకటి ఉంటుంది కదా… తన వ్యక్తిగత ప్రవర్తనో, లోపభూయిష్టమైన కెరీర్ ప్లానింగో గానీ ఎప్పటికప్పుడు డెస్టినీ తనను ఎదురుతంతూనే ఉంది… 69 ఏళ్లు సెలబ్రిటీగా బతికాడు కదా అనకండి…
తనకు మెరిట్ ఉంది… నిర్మాత, దర్శకుడు, నటుడు… అన్నీ… కానీ నెత్తి మీద శని ఉంది… అదెప్పుడూ వదల్లేదు… తన మాట తీరులో, తన ప్రవర్తన తీరులో, తన ప్లానింగ్ తీరులో శని ప్రభావం చూపిస్తూనే వచ్చింది… తన మెంటాలిటీయే ఓ డిఫరెంట్… అప్పట్లో రాధికను పెళ్లి చేసుకున్నాడు… ఆమె అసలే రాధిక… ఈయనేమో ప్రతాప్… శృతి ఎలా కుదురుతుంది..? ఏడాది నిండకుండానే పెళ్లి పెటాకులయ్యాయి… తరువాత ప్రతాప్ కొన్నాళ్లకు అమల సత్యనాథ్‌ను పెళ్లి చేసుకున్నాడు…
రాధికతో విడాకులు, గొడవ, రచ్చతో ప్రతాప్‌లో ఓ అపరిచితుడు ప్రాణం పోసుకున్నాడు… ఆమె ఎవరో ఎవరికీ తెలిసేది కాదు… ఆమె ఫోటోలు, వీడియోలు బయటికి రావు… ఏ సినిమా ఫంక్షన్‌లోనూ ఆమె కనిపించదు… ఓ జైలు… సాధారణంగా ఓ సెలబ్రిటీ భార్య అంటే కాస్త హైఫై సోషల్ లైఫ్ ఉంటుంది కదా… ఆమెకు అవి పూర్తిగా నిషిద్ధం… నమ్మడం లేదా..?
Ads
ప్రతాప్ పోతన్ మరణించాడు అనేసరికి, ఆయన కుటుంబం తాలూకు ఫోటోలు, వీడియోల కోసం మీడియా వెతుకుతుంది కదా… ఎక్కడా ఏమీ దొరకలేదు… అసలు ఆమె బయటికి వస్తే కదా… ఇదుగో ఈ ఒక్క ఫోటో దొరికింది అందరికీ…
.… (pratha pothen with his second wife, right side his daughter)….
ఎడమ వైపు ఫోటో ఒక్కటే అందరికీ దొరికింది… కుడిపక్కన ఉన్నది ఆమె కూతురు కెయా పోతన్… 12 సినిమాల దర్శకుడు, 100 సినిమాలతో సంబంధం ఉన్న సినిమా సెలబ్రిటీ… తెలుగు, తమిళం, మలయాళం ఇండస్ట్రీలో నోటెడ్ ఫిగర్, ఐనా సరే ప్రతాప్ పోతన్ తన కుటుంబ జీవనాన్ని లైమలైట్‌లోకి తీసుకురాలేదు…
చివరకు ఆమె 22 ఏళ్ల సంసార జీవనం తరువాత విడాకులు ఇచ్చింది… సింపుల్‌గా చెప్పాలంటే తనే వదిలేసింది… తరువాత కూడా ఆమె పెద్దగా మీడియా తెర మీదకు రాలేదు… చాలా ఇంట్రస్టింగు జీవితం… బిడ్డ కెయా కూడా చాన్నాళ్లు మీడియాకు దూరం… సంగీతం నేర్చుకుంది… ఎదిగింది… కాస్త మీడియా దృష్టికి రాసాగింది… సోషల్ మీడియాలో అడపాదడపా ఫోటోలు, వీడియోలు షేర్ చేసుకునేది… ఐనాసరే, తల్లి వాటిల్లో కనిపించదు…
…. ( pratap daughter keya)…
ఈమె సింగర్, మ్యూజిషియన్… పెద్దగా క్లిక్ కాలేదు కూడా… ఇంతకీ ఈమె తల్లి ఇప్పుడెలా ఉంది..? ఎవరికీ తెలియదు…! మొన్న కార్డియాక్ స్ట్రోక్‌తో దాదాపు 70 ఏళ్ల వయస్సులో ప్రతాప్ తెల్లారేసరికి విగతజీవుడు… ఒంటరి పక్షి… ఓ మెరిటోరియస్ కేరక్టర్ చేజేతులా వ్యక్తిగత జీవితాన్ని, కుటుంబ జీవితాన్ని, ఆ బంధాల్ని తన్నేసుకున్నాడా..? లేక విధివశాత్తూ తనకు దక్కింది ఇదేనా..? గాడ్ నోస్…!!
Share this Article