Jagannadh Goud…………… చైనా ఆయుర్వేదం: ట్రడిషనల్ చైనా మెడిసిన్ (TCM)
ఒక్క చైనాలోనే కాదు, సింగపూర్, మలేషియా, దక్షిణ కొరియా, వియత్నాం, కొన్ని యూరప్ దేశాల్లో కూడా TCM ని వాడతారు. అమెరికాలోని FDA (Food and Drug Administration) కూడా దీని ప్రాముఖ్యతని గుర్తించి సప్లిమెంట్స్ అనే ఒక విభాగాన్ని చేర్చి దాని ప్రాముఖ్యతని అధికారికంగా ఆమోదించింది. NIH (నేషనల్ ఇన్స్స్టిస్ట్యూట్ ఆఫ్ హెల్త్) ఏకంగా NCAM (నేషనల్ సెంటర్ ఫర్ కాంప్లిమెంటరీ అండ్ ఆల్టర్నేటివ్ మెడిసిన్) అనే సంస్థని నెలకొల్పింది. ఇంకా TCM విషయానికొస్తే ఈ మందులో 10% యానిమల్ ప్రొడక్ట్స్, 90% హెర్బ్స్ ఉంటై… కరోనా ట్రీట్మెంట్కి ద్రవరూపంలో దీన్ని ఇస్తారు. అయితే ఇది కరోనా వైరస్‌ని చంపదు, కరోనా వైరస్ క్రియేట్ చేసిన ట్రాష్‌ను క్లీన్ చేస్తుంది. తద్వారా మన శరీరం లోని యాంటీబాడీస్ వైరస్‌పై పోరు జరిపి, వ్యాధి ఎక్కువ అవకుండా చేస్తుంది, లేదా క్యూర్ చేస్తుంది… వ్యాధి మైల్డ్‌గా లేదా మోడరేట్‌గా ఉన్నప్పుడే డాక్టర్స్ కూడా TCM ని ఉపయోగించి ట్రీట్ చేశారు. వ్యాధి సివియర్‌గా ఉన్నప్పుడు మాత్రం వెస్ట్రన్ మెడిసిన్స్‌నే ఉపయోగించారు. అల్లోపతి, ఆయుర్వేదం అక్కడ కలిపి ఉపయోగించారు అందుకే 80 వేల మందికి వచ్చినా 3 వేల మరణాలతోనే వ్యాధిని అదుపులోకి తేగలిగారు. ప్రధానంగా గుర్తు పెట్టుకోవాల్సింది సప్లిమెంట్‌గా ఉపయోగించారు.
Ads
Share this Article