Chegondi Chandrashekar…. మొన్న అనుకోకుండా అటు వెళ్ళినపుడు, బుక్ ఫెయిర్ వేదిక మీద విక్రమ్ సంపత్ స్పీచ్ విన్నాను.
ఆయన రాసిన పుస్తకం my name is gauhar jaan ని తెలుగులో కూడా తెచ్చారు. దాని ఆవిష్కరణ సభ.
నేను ఎప్పుడూ ఆ పేరు వినలేదు.
Ads
ఆయన షార్ట్ స్పీచ్ ద్వారా కొంచెం తెలిసింది.
మన దేశంలో మొట్టమొదటిగా గ్రామ్ ఫోన్ లో రికార్డ్ అయిన వాయిస్ ఆమెదే.
అప్పట్లోనే ఆమె ఒక్క కచేరికి 3000 రూపాయలు ఛార్జ్ చేసేది అంట.
రికార్డ్ చేసేటప్పుడు మేరా నామ్ గౌహర్ జాన్ అని చెప్పి రికార్డ్ చేసేది అట.
చాలా ఆత్మ విశ్వాసం గల మహిళ.
పేరెంట్స్ క్రిస్టియన్స్.
విడాకులు అయ్యాక తల్లి బెనారస్ లో ఒక ముస్లింని చేసుకున్నారు.
అలా ఇద్దరి పేరు మారింది.
అక్కడే ఆమె హిందుస్తానీ మ్యూజిక్ నేర్చుకున్నది. డాన్సర్ కూడా.
ఒకసారి గాంధీజీ పార్టీ ఫండ్స్ కోసం ఒక కన్సర్ట్ చేయమని అభ్యర్దించారు అట.
నేను వస్తాను కానీ మీరు కూడా నా కచేరికి హాజరు కావాలి అని నిబంధన పెట్టింది అట.
గాంధీజీ ఆశ్ఛర్యపడి, మళ్ళీ సరే వస్తాను అని చెప్పారు అట.
కానీ ఎందుకో ఆయన రాలేక తన రిప్రెసెంటిటివ్ గా షౌకత్ అలీ అనే అతన్ని పంపాడు.
కచేరి ఫుల్ సక్సెస్.
మొత్తం 24 వేల రూపాయలు కలెక్ట్ అయ్యాయి.
అయితే గౌహర్ జాన్ మొత్తం ఇవ్వకుండా, జస్ట్ 12 వేలు మాత్రమే ఇచ్చింది అట.
మీ గాంధీ మాట తప్పడు అంటారు గదా, వస్తా అని రాలేదు. మిమ్మల్ని పంపి సగం మాట మాత్రమే దక్కించుకున్నారు. నేను కూడా సగమే ఇస్తున్న అన్నది అట.
హ హ.. ఆ లెవల్ లో ఉండేది ఆమె ఆటిట్యూడ్.
పాపం, జీవితం చివరికి వచ్చే సరికి చాలా కష్టాలు పడింది అట.
సావిత్రి, జయలలిత , రేఖ వీరి లెక్కనే ఉన్నది స్టోరీ.
పార్టనర్స్ మోసం చేయడం, ఆర్థికంగా నష్టపరచడం వలన చివర్లో చాలా కష్టపడ్డారు.
అది విని కర్ణాటకలో ఒక రాయల్ ఫ్యామిలీ షెల్టర్ ఇచ్చారు అని చెప్పారు.
చాలా తక్కువ కాలంలో అక్కడే చనిపోయారు.
చావుకి కారణం తెలియలేదు. సూసైడ్ కావచ్చు అని రైటర్ చెప్పిండు.
ఆయన దాదాపు 5 సంవత్సరాలు ఈ బుక్ మీద చాలా వర్క్ చేశారు.
గోదావరి ప్రచురణలు తెలుగులో తెచ్చింది.
నాకో డవుట్, చాలా సక్సెస్ అయిన వారి మహిళల జీవితాలు ఇలా విషాదంగా ఎందుకు ముగుస్తాయి. ఎందుకో ఏమో…
నెట్ లో చూసిన, లగాన్ డైరెక్టర్ అశుతోష్ ఈ స్టోరీని సినిమా తీయడానికి రైటర్ దగ్గర రైట్స్ తీసుకున్నారు అని.
మంచి మ్యూజికల్ ఫిల్మ్ , మంచి ఎమోషనల్ ఫిల్మ్ అవుతుంది అని అనిపిస్తుంది. https://www.last.fm/music/Gauhar+Jan/+wiki
Share this Article