మొన్నటి ఢిల్లీ ట్రాక్టర్ ర్యాలీ అనంతరం… రైతుల పేరిట సాగుతున్న ఉద్యమం అనేక మలుపులు తిరుగుతోంది కదా… ఆ ర్యాలీ సందర్భంగా మరణించిన ఆ యువకుడు ఎవరు..? అక్కడ ప్రత్యక్ష సాక్షుల కథనాలు చెప్పే వివరాల ప్రకారం… ఒక యువకుడు ర్యాష్‌గా ట్రాక్టర్ నడిపిస్తూ బారికేడ్లను బ్రేక్ చేయడానికి ప్రయత్నించాడు… అది అదుపు తప్పింది… బోల్తా కొట్టింది… తనపైనే పడింది… అక్కడికక్కడే తను మరణించాడు… ఇక ఇలాంటి ఒక సంఘటన జరగాలని కాచుక్కూచున్న సెక్షన్ వెంటనే రంగంలోకి దిగిపోయింది… రాజదీప్ సర్దేశాయ్ వంటి శక్తులు, జర్నలిస్టులు వెంటనే ట్వీట్లు సంధించారు… ‘‘పోలీసులు కాల్పులు ఓపెన్ చేయడంతో ఈ దుర్ఘటన జరిగింది’’ ధ్రువీకరణ లేకుండా ట్వీట్ కొట్టడం, తన టీవీలో చెప్పడం, అక్కడి ఉద్రిక్తతల్ని ఇంకింత పెంచే ప్రయత్నం చేయడం సర్దేశాయ్ మొత్తం జర్నలిజం కెరీర్‌కే మరక… సరే, అది వేరే కథనంలో చెప్పుకుందాం కానీ… ఇంతకీ మృతుడు ఎవరు..? రైతేనా..?
రైతు కాదు… పంజాబ్, హర్యానా బాపతు సిక్కు బ్యాచ్ కాదు… తను ఉత్తరప్రదేశ్, రాంపూర్‌కు చెందిన నవరీత్ సింగ్… వయస్సు 25… ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లో బీకామ్ చేశాడు… పార్ట్‌టైమ్ ఏదో ఓ రెస్టారెంట్లో పనిచేస్తాడు… యూపీకే చెందిన ఒకామెను 2019లో పెళ్లి చేసుకున్నాడు… ఇద్దరూ స్టూడెంట్ వీసా మీద ఆస్ట్రేలియా వెళ్లిపోయారు… తరువాత ఇండియాకు వచ్చారు, ఆమె తిరిగి వెళ్లిపోయింది. తమపెళ్లి రిజిస్ట్రేషన్ గట్రా ఇంకేదో పేపర్ వర్క్ బాకీ ఉంది కాబట్టి ఈ నవరీత్ ఇక్కడే ఉండిపోయాడు… ఆ పనిపూర్తిచేసుకుని తను భార్య దగ్గరకు వెళ్లాల్సి ఉంది… ఈలోపు కరోనా… విమానాల్లేవు… ఇక్కడే ఆగిపోయాడు… ఇదీ సదరు ఆస్ట్రేలియా విద్యార్థి కథ… మరి ట్రాక్టర్ ర్యాలీకి ఎందుకు వెళ్లాడు..?
Ads
ఆయన తాత ఉన్నాడొకాయన… పేరు హరదీప్… రైటర్‌ను అని చెప్పుకుంటాడు… ‘‘ఈ రైతు ఉద్యమంపై బుక్ రాయాలనుకుంటున్నా, ఆ టెంట్లలోనే ఉంటున్నాను, నా దగ్గరికి వచ్చాడు నవరీత్… ఆరోజు ట్రాక్టర్ ర్యాలీకి వెళ్లాడు… పోలీసులు కాల్చిన బుల్లెట్ వల్లే తను మరణించాడు… కానీ పోస్ట్ మార్టం రిపోర్టులో తప్పుడు వివరాలు రాశారు… ప్రభుత్వం నా మనమడిని బలితీసుకుంది…’’ ఇదీ తన వివరణ… కానీ పోలీసులు దాన్ని కొట్టేస్తున్నారు… అసలు ఆరోజు ఎక్కడా కాల్పులు జరగలేదు… దాదాపు 350 మందివరకూ పోలీసులే తీవ్రంగా గాయపడ్డారు ఆందోళనకారుల దాడిలో… తమకు గాయాలు తగులుతున్నా సరే, భరించారు తప్ప ఎక్కడా ఫైరింగు చేయలేదు… ఈ ఒక్క నవరీత్సింగ్ మీద కాల్పులు జరిపాం అనడం నాన్సెన్స్ అని బరేలీ పోలీసు అధికారులు చెబుతున్నారు… అటాప్సీ రిపోర్టు అబద్ధం చెప్పదు కదా అంటారు వాళ్లు……… ఇప్పటిదాకా రాసుకొచ్చిన ఈ కథనం యాంటీ-బీజేపీ సైటుగా పేర్కొనబడే దిప్రింట్ అనబడే న్యూస్సైటులోని ఓ కథనానికి తెలుగు అనువాదం…!!
Share this Article