భయపడకండి… అస్సలు కార్తీకదీపం కథ గురించి చెప్పబోవడం లేదు… మీరు మరీ అంతగా ఠారెత్తిపోవాల్సిన అవసరమూ లేదు… కానీ 1300 ఎపిసోడ్లుగా కోట్లు కొల్లగొడుతున్న సీ-రి-య-ల్ గురించి కొన్ని వివరాలు చెప్పుకోకపోతే ఎలా..? సో, లోతుల్లోకి పోవడం లేదు… కానీ మోనిత పాత్రలోని శోభాశెట్టి, దీప పాత్రలోని ప్రేమీ విశ్వనాథ్ నిజంగానే ప్రతి తెలుగింటికీ ఆడపడుచులయ్యారు… ఆ పాత్రల కేరక్టరైజేషన్ చెత్త… కానీ ఆ ఇద్దరూ మంచి నటన కనబరిచారు… రియల్లీ… మొదట్లో బాగా నటించిన ప్రేమీ తరువాత డల్ అయిపోయి శోభ డామినేట్ చేసింది… నటనలో…
ఇప్పుడు సీరియల్ లుక్కు మారిందిగా… కొత్త జనరేషన్‌లోకి కథను తీసుకుపోయి, మరో 1300 ఎపిసోడ్లకు కొత్త పునాదులు వేశాడు కదా దర్శకుడు… ఏమో, అప్పటికీ ఆగుతుందనే నిర్ధారణ ఏమీలేదు, మరో జనరేషన్‌లోకి తీసుకుపోయి, సౌర్య-హిమల పిల్లలతో కొత్త కథను స్టార్ట్ చేసే ప్రమాదం కూడా ఉంది… దాన్నలా ఉంచితే ఇప్పుడ హిమ, సౌర్య పాత్రల్లోకి మరో ఇద్దరు వచ్చారు కదా… ఎవరు వాళ్లు..?
ఇంకెవరు ఉంటారు..? కన్నడ తారలే… డౌట్ దేనికి..? అసలు తెలుగు టీవీ ఇండస్ట్రీని దున్నేస్తుంది వాళ్లే… తెల్లారిలేస్తే బొచ్చెడు టీవీ ప్రోగ్రాముల్లో తెలుగు ఆడమొహాలు కనిపిస్తాయి కదా, కానీ వాళ్లు సీరియళ్లకు అక్కరకు రారుట… సినిమాలకు ఎప్పట్నుంచో దూరం పెట్టారుగా… ఇప్పుడు ఈ సీరియల్ నుంచి వెళ్లిపోయిన శోభ కన్నడిగురాలు… ప్రేమీ మలయాళీ… ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్లు అమూల్య గౌడ, కీర్తి భట్…
Ads
వీళ్లలో కీర్తి భట్ ప్రస్తుతం అదే స్టార్‌మాటీవీలో మనసిచ్చి చూడు సీరియల్‌లో ప్రధానపాత్ర చేస్తోంది… సహజంగానే అదొక చెత్త పాత్ర, కానీ ఈమె మాత్రం అదరగొడుతోంది… సీరియల్‌కు ఈమే ప్రాణం… నిజజీవితంలో చాలా కష్టాలు పడింది… ఓ యాక్సిడెంటులో ఒకేసారి తల్లిదండ్రుల్ని, అన్నయ్యను పోగొట్టుకుంది… ధైర్యాన్ని కూడదీసుకుని, ఒంటరిగానే నెగ్గుకొస్తున్నది… పాత్ర ఎలా ఉన్నా సరే, తను మాత్రం మ్యాగ్జిమం ఇవ్వగలదు…
మరొకామె పేరు అమూల్య ఓంకార్ గౌడ… కన్నడ సీరియల్ కమాలితో ఫేమస్… చాలామంది బెంగుళూరు బేస్డ్ టీవీ తారలు తెలుగు టీవీల్లో పాపులర్ అయిపోవడంతో తనూ హైదరాబాద్ బాటపట్టింది… సినిమాల్లో మలయాళీ, తమిళ యాక్టర్లు… సీరియళ్లలో కన్నడిగులు… మరి తెలుగు ఆడ లేడీస్ పరిస్థితి ఏమిటంటారా..? తెలుగు టీవీల్లో కామెడీ షోలలో పిచ్చి వేషాలు వేసుకుంటూ, తోటి కమెడియన్ల బాడీ షేమింగ్ కామెంట్లకు కుమిలిపోతూ, కాదంటే ఎవరూ చూడని దిక్కుమాలిన సీరియళ్లలో ఒకటీరెండు పాత్రలు వేసుకుంటూ గడపాల్సిందే..!!
Share this Article