Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఆమె చెప్పింది సరే… ఆర్ఎస్ఎస్ తరహాలో నిబద్ధత, కృషి సాధ్యమేనా..?!

April 21, 2025 by M S R

.

Subramanyam Dogiparthi ……. అమ్మయ్య ! ఢిల్లీ కాంగ్రెస్ నాయకులకు ఏం చేయాలో కొంచెం కొంచెం అర్ధం అవుతున్నట్లుగా ఉంది . RSS తరహాలో పనిచేయండని హితవు చెప్పింది ఎవరో కాదు , తెలంగాణ రాష్ట్ర పరిశీలకురాలు మీనాక్షి నటరాజన్ .

(అయితే రాహుల్ సొంత తెలివి ప్లస్ తన కోటరీ మార్గదర్శకత్వం మీద దేశానికి, పార్టీలోని ముఖ్యలకే బోలెడు సందేహాలున్నాయి, అది వేరే కథ)

ఈ దేశంలో వంద సంవత్సరాల సంస్థలు రెండే . ఒకటి కాంగ్రెస్ , మరొకటి RSS . ఒకటి నానాటికి తీసికట్టు నాగంభొట్లుగా ఉంటే ; మరొకటి దిన దిన ప్రవర్ధమానం అవుతూ విరాట రూపానికి చేరింది .

Ads

నిన్ననే Indian Express లో వంద సంవత్సరాల RSS గురించి మంచి వ్యాసం వచ్చింది. అందులో ప్రస్తుత RSS విరాట రూపం గురించి వివరించారు . మొత్తం దేశంలో 45,600 ప్రాంతాలలో 73,117 శాఖలు ఉన్నాయి . ఒక్కో శాఖకు కనీసం వంద మంది స్వయంసేవకులు ఉంటే ఎంత మంది ఉంటారో లెక్కించవచ్చు . శాఖకు రాని వారు ఇంకా ఉంటారు .

ABVP 45 లక్షల మంది సభ్యులతో దేశంలోనే అతి పెద్ద విద్యార్ధి సంస్థ . అలాగే , కోటి మంది సభ్యులతో అతి పెద్ద కార్మిక సంఘం BMS . భారతీయ కిసాన్ సంఘ్ లో పది లక్షల మంది సభ్యులు , విద్యాభారతి అధ్వర్యంలో 14,000 పాఠశాలలు , 73,000 టీచర్లు ఉన్నారు .

లాయర్లకు అధివక్త పరిషత్ ఏర్పాటు చేయబడింది . ఇది దేశంలో అతి పెద్ద లాయర్ల సంస్థ . సైన్యంలో పనిచేసిన వారి కోసం 2001 లో అఖిల భారతీయ పూర్వ సైనిక సేవా పరిషత్ ఏర్పాటు చేయబడింది . ఇవన్నీ కాకుండా విశ్వ హిందూ పరిషత్ , సేవాభారతి , సంస్కృత భారతి , భజరంగ దళ్ వంటి సంస్థలు మరెన్నో ఉన్నాయి . (మహిళలు, ఆదివాసీలు, మైనారిటీలు ఎట్సెట్రా మరెన్నో…)

ఇంత నెట్ వర్క్ సంఘ పరివారంలో ఉంది . భాజపాకు ప్రత్యామ్నాయంగా ఎదగగలిగే శక్తి ఉన్నది ఒక్క కాంగ్రెస్ పార్టీకే . Grand Old Party గా పేరు తెచ్చుకున్న కాంగ్రెస్ పార్టీ ముందు ఎలాంటి టాస్క్ ఉందో ఈ సమాచారం చెపుతుంది .

ఇలాంటి సంస్థలు ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి కూడా ఉన్నాయి . ఇవి ఉన్నట్లు కూడా ప్రస్తుత నాయకులు మరచిపోయి ఉంటారు . మీనాక్షి నటరాజన్ పిలుపుతో అర్ధం అవుతుంది ఏంటంటే కాంగ్రెస్ RSS సంస్థాపర శక్తిని గుర్తించినట్లే . మంచిదే . SWOT Analysis is desirable …

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • సీఎం స్వయంగా ఓసారి టాలీవుడ్ యవ్వారాలపై దృష్టిపెట్టడం బెటర్..!!
  • 70 ఏళ్ల వయస్సులోనూ యంగ్‌గా, ఆరోగ్యంగా… భలే తల్లి..!!
  • ట్రంపు… డబ్బు కక్కుర్తి మాత్రమే… నో ఎమోషన్స్, నో మోరాలిటీ…!!
  • రీఎంట్రీ సరే గానీ… కుర్ర వేషాలకు సూటయ్యే సీన్ లేదయ్యా నవీనూ..!
  • ఈ తలనొప్పిని మీకు సమర్పించువారు…!
  • అటెన్షన్ చంద్రబాబు..! అమరావతి వ్యవహారం తనే పర్యవేక్షించాలి..!
  • ఐఫిల్ టవర్‌ను అర్ధచంద్రాకారంలో వొంచి వొంచి రేకులు కప్పినట్టు..!!
  • ప్రపంచదేశాలు ఆల్రెడీ లైట్ తీసుకుంటున్నాయి అమెరికాను… పార్ట్-2
  • ట్రంపు ఒక పాత్ర, అంతే… అమెరికా పతనం ఆరంభమైనట్టేనా..? పార్ట్-1
  • ఈ చరిత్రాత్మక కట్టడం కుప్పకూలిందే కేసీయార్ హయాంలో..!!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions