Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

వంద కోట్లు ముంచేసి… వాడు మనల్ని ఇట్టే ఎడ్డి గాడిదల్ని చేశాడు..?

November 17, 2024 by M S R

.

“గాడిద పాలు కొనుక్కుంటాం…అంతర్జాతీయంగా గాడిద పాలకు విపరీతమైన డిమాండు” అంటూ ఒక్కో గాడిదను లక్షన్నరకు పైగా అమ్మి… రెండు మూడు నెలలు అన్నట్లుగానే గాడిద పాలు కొని… తరువాత అదృశ్యమయ్యింది డాంకీ ప్యాలెస్ సంస్థ.

దక్షిణ భారతదేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఈ సంస్థ మోసానికి గురైనవారు వేలల్లో ఉన్నారు. ఇప్పటికి ఇది 110 కోట్ల కుంభకోణమని తేలింది. సాధారణంగా 15 వేల నుండి అత్యధికంగా 40 వేల వరకు ధర పలికే గాడిదలను స్థానిక మార్కెట్లోనే కొని… లక్షన్నర నుండి రెండు లక్షల వరకు అక్కడే అమ్మిన ఈ డాంకీ ప్యాలెస్ మార్కెటింగ్ మెలకువలో గాడిదలైనవారెవరో గాడిదలు చెప్పలేకపోవచ్చు కానీ… గాడిదలకు తెలుసు!

Ads

# మొత్తం డాంకీ స్కామ్ లో పెట్టుబడి ఎంత? లాభమెంత?

# ఇన్ని జంతువులుండగా వీరు గాడిదలనే ఎంచుకోవడానికి గల కారణాలేమిటి?

# సమాజంలో ఎవరినైనా గాడిదలను చేయవచ్చని వీరు అనతికాలంలోనే ఎలా పసిగట్టగలిగారు?

# ఇంట్లో, పెరట్లో కట్టిన డాంకీ ప్యాలెస్ అత్యుత్తమ గాడిదలను ఇప్పుడేమి చేయాలి?

# గాడిద పాలతో ఏయే పదార్థాలు చేసుకోవాలి?

# ఇంత ఇన్నోవేటివ్ ఐడియా చిన్న స్టార్టప్ అవుతుందా? భారీ పరిశ్రమ అవుతుందా?

# దీన్ని ఫిన్ టెక్ కంపెనీ అనాలా? లైవ్ స్టాక్ బిజినెస్ అనాలా?

1. Adaptations of successful strategies from industry.

2. Importing strategies from other industries.

3. Combining strategies from multiple different industries.

4. Strategies created from scratch.

  • అని సకల ఇండస్ట్రీ బిజినెస్ స్ట్రాటజీలు ఈ నాలుగు కేటగిరీల్లోనే ఉంటాయని సంప్రదాయ ఎంబిఏ పాఠాల్లో చెబుతారు.

ఈ డాంకీ బిజినెస్ ప్రాఫిట్ అండ్ లాస్ అనలిటిక్స్ ను చూసిన తరువాత ఇది ఏ స్ట్రాటజీ కిందికి వస్తుందో! లేక అయిదో స్ట్రాటజిగా కొత్తగా చేరిస్తే ఎలా ఉంటుందో! స్టాన్ఫోర్డ్ లు, హార్వర్డ్ లు, ఐఐఎంలు, ఐఎస్‌బిలు అర్జెంటుగా ఆలోచించకపోతే నష్టపోయేది ఆ కాలేజీలే… గాడిదలు కాదు!

గాడిదల్లా కళ్ళకు గంతలు కట్టుకుని నాలుగ్గోడల మధ్య క్లాసు రూముల్లో కూర్చుని ఏమి చదువుతారు?
కొంచెం ఇలా బయటికి వచ్చి కళ్ళు తెరిచి విశాల గార్దభ ప్రపంచంలో చదువుకోండి! అడ్డ గాడిదలు కూడా లెక్కలేనన్ని జీవనవ్యాపార విజయరహస్య పాఠాలు చెబుతాయి!

ఇట్స్ ఎ ఫుల్ ఆఫ్ ఫూల్స్ ప్యారడైజ్!
ఇట్స్ ఎ ప్రామిసింగ్ “డాంకీ ప్యారడైజ్” బిజినెస్!!

నేర్చుకుంటే ప్రతిదీ పాఠమే!
నేర్చుకోకుంటే ప్రతిదీ గుణపాఠమే!!

-పమిడికాల్వ మధుసూదన్
9989090018

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • డ్రోన్ల యుద్ధమే కాదు… భీకరమైన సైబర్ యుద్ధానికీ దిగిన పాకిస్థాన్…
  • ఆట నుంచి క్రమేపీ దూరమవుతూ… ఆధ్యాత్మిక అంశాలకు దగ్గరగా…
  • ఓ చిన్న గుడి… కృష్ణా నదిలో ఓ ద్వీపంలో… పూర్తిగా చదవండి ఓసారి…
  • ఔరా అక్కినేనీ… నాసిరకం ఉత్పత్తుల్లో నువ్వూ తక్కువేమీ కాదు….
  • పాక్ పీచమణిచిన S-400 కాదు… దాని తాత S-500 కూడా వస్తుంది…
  • ఇది నిజంగా బాపు తీసిన పాటేనా..?! ఆమె అసలు ఆ జయప్రదేనా..?!
  • వేలాడదలుచుకోలేదు… క్లియర్ ప్లానింగ్… జస్ట్, అలా వదిలేశాడు…
  • మోడీజీ… అన్నీ బాగానే చెప్పావు… కానీ ఆ ఒక్క ప్రశ్నకు జవాబు..?!
  • ఆ భూకంపాలు ప్రకృతి కోపమా..? అణ్వస్త్ర గోదాముకు పడిన తూట్లా..?!
  • నీకోసం యవ్వనమంతా దాచాను మల్లెలలో… ఇదో వింత కథ…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions