.
అవును… 5 దాటి రిక్టర్ స్కేల్‌పై కంపనల తీవ్రత ఉండటం వార్తే… పాత వరంగల్ జిల్లా మేడారం ఈ భూకంపం ఎపిసెంటర్ అని భావిస్తున్నారు… అంటే భూకంప కేంద్రం… దానికి దాదాపు 100 నుంచి 200 కిలోమీటర్ల దాకా కంపనల ప్రభావం ఉంటుంది,..
అయ్యో, అయ్యో… అదే మేడారంలో ఈమధ్య వందల హెక్టార్లలో లక్ష చెట్లు అకారణంగా నేలకూలాయి… ఆ మిస్టరీ ఏమిటో ఛేదించలేకపోయారు… ఈలోపు ఎన్నడూ లేనిది ఈ భూకంపం… ఏదో జరుగుతోంది… భూకంపాలకు అవకాశమే లేదు, యాభై ఏళ్ల చరిత్రలో లేదు, ఏమిటిది అని గగ్గోలు…
ఇదేకాదు, పలుచోట్ల దక్షిణ భారతంలో ఇటీవల కంపనలు చోటుచేసుకుంటున్నాయి… దక్షిణ భారతానికి ఏదో మూడింది అన్నట్టుగా గాయిగత్తర వార్తలు మొదలయ్యాయి… పర్వర్షన్ అనాలో, ఏమిటో తెలియదు గానీ కొందరు ఏకంగా నేవీ రాడార్ పెట్టే దామగుండం ఎఫెక్ట్ దాకా వెళ్లిపోయారు కొందరు… అసలు అక్కడ పనులే ప్రారంభం కాలేదు, అప్పుడే ఎఫెక్టులా…
Ads
వచ్చిండు భూకంపం తెచ్చిండు అని రేవంత్ మీద విసుర్లు… కొందరు సమ్మక్కకు కోపమొచ్చింది అట… హేమిటో… రేవంత్ భూమి పొరల్లోకి వెళ్ళి ఏదో హైడ్రా బుల్డోజర్లతో గెలుకుతున్నట్టు… రేవంత్ సిఎం కావడం ప్రకృతికే ఇష్టం లేనట్టు… బాబోయ్…
తెలంగాణ సీస్మిక్ జోన్ కాదని ఎవరన్నారు..? హైదరాబాద్ సహా మొత్తం సీస్మిక్ జోనే… హైదరాబాదులో కంపనలు రాలేదా ఎప్పుడూ..? మల్లన్నసాగర్ సీస్మిక్ జోన్‌లో ఉంది, ఐనా ఇగ్నోర్ చేసి కట్టారు అనే విమర్శలు వినలేదా..? అంతెందుకు,,..? 2022 అక్టోబరులో ఆదిలాబాద్ జిల్లాలో… 2021 అక్టోబరులో అదే ఆదిలాబాద్ జిల్లా, బెల్లంపల్లిలో… 2021 జూలైలో నాగర్‌కర్నూలు ఏరియాలో…
భూమి లోపల పొరల్లోని టెక్టానిక్ ప్లేట్ల కదలికతో స్వల్ప ప్రకంపనలు కనిపిస్తూనే ఉంటాయి… అవి మనం ఫీల్ కాలేం… కానీ 5 సీస్మిక్ స్కేల్ దాటితే మనకు అనుభవంలోకి వస్తుంది… సముద్రమట్టానికి ఎగువన ఉంటే భూకంపాలు రావు అనేది ఓ అబద్ధం, తప్పుడు భావన… నేపాల్‌లో విధ్వంసం చూశాం కదా… మనకు దగ్గరగానే ఉండే లాతూరులో ఒకనాటి భూకంప విధ్వంసమూ చూశాం కదా…
అంతెందుకు… సముద్రపు లోపల భూకంపాలు సృష్టించే సునామీల తీవ్రత కూడా మనకు తెలిసిందే కదా… సో, ఏదో మూడింది, ఏదో జరుగుతోంది అనే ప్యానిక్ క్రియేట్ చేయడం కరెక్టు కాదు… ఆయనెవరో కాలేశ్వరం ప్రాజెక్టు కట్టినందుకే భూకంపం అని అర్జెంటుగా తీర్మానించేశాడు…
ప్రతి దానికీ ఓ శాస్త్రీయ కారణం ఉంటుంది… ఇదేవీ దైవఘటన కాదు, ఆగ్రహమూ కాదు… మనకు అంతుపట్టని ఏదో హేతువు ఉంటుంది… ఎంతగా భయాన్ని క్రియేట్ చేైస్తే అంత సెన్సేషనల్ న్యూస్ అనే భావనే సమాజానికి అరిష్టం… విపత్తుల సందర్భాల్లో మరీ ఎక్కువ సంయమనం అవసరం… దురదృష్టం కొద్దీ అదే ఇప్పుడు లోపించింది… అదే అసలైన విపత్తు..! అడ్డూఅదుపూ లేని సోషల్ మీడియా వల్ల ఈ విపత్తు తీవ్రతను రిక్టర్ స్కేల్స్ కూడా కొలవలేవు…
Share this Article