Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

దృశ్యం-3… రాంబాబు మార్క్ ‘ట్విస్ట్’… అడుగు దూరంలో అసలు క్లైమాక్స్!!

December 24, 2025 by M S R

.

సినిమా షూటింగ్ కంటే ముందే ఒక ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌ను తలపిస్తోంది దృశ్యం 3… మలయాళంలో మోహన్‌లాల్ (జార్జ్‌ కుట్టి), హిందీలో అజయ్ దేవగన్ (విజయ్ సల్గాంకర్), తెలుగులో వెంకటేష్ (రాంబాబు) – ఈ ముగ్గురూ తమ కుటుంబాన్ని కాపాడుకోవడానికి చేసే పోరాటం ప్రేక్షకులకు ఒక ఎమోషన్… అయితే, ఈసారి ఈ ముగ్గురు ‘తండ్రుల’ మధ్య ఒక వింతైన యుద్ధం నడుస్తోంది… అది కథలో కాదు, రిలీజ్ డేట్లలో..!

హిందీ వెర్షన్ షూటింగ్ శరవేగంగా జరుగుతూ, అక్టోబర్ 2, 2026న రిలీజ్ డేట్‌ను లాక్ చేసేసింది… మలయాళ వెర్షన్ ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని, 2026 ప్రథమార్ధంలోనే థియేటర్లలోకి రావడానికి సిద్ధమవుతోంది… ఇక్కడే మన తెలుగు రాంబాబు (వెంకటేష్) కి అసలైన చిక్కు వచ్చి పడింది…

Ads

  • స్పాయిలర్ల భయం…: మలయాళం లేదా హిందీ వెర్షన్లు ముందుగా వస్తే, సోషల్ మీడియా పుణ్యమా అని క్లైమాక్స్ ట్విస్ట్లు ఇట్టే లీక్ అయిపోతాయి… థ్రిల్లర్ సినిమాలకి ‘సస్పెన్స్’ ప్రాణం… అది పోతే రాంబాబు వేసే తెలివైన ఎత్తుగడలకు వెయిట్ ఉండదు…

  • షూటింగ్ ఆలస్యం…: వెంకటేష్ ప్రస్తుతం ఇతర ప్రాజెక్టులతో బిజీగా ఉండటం వల్ల, దృశ్యం 3 తెలుగు షూటింగ్ ఇంకా పట్టాలెక్కలేదు… దీంతో 2026 దసరా నాటికి సినిమాను తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి…

ఒకే కథ.. మూడు వెర్షన్లు.. కానీ?

దర్శకుడు జీతూ జోసెఫ్ ఈసారి ఒక వినూత్న ప్రయత్నం చేస్తున్నాడు… గత రెండు భాగాల్లో మలయాళం రిలీజ్ అయిన చాలా కాలానికి రీమేక్‌లు వచ్చాయి… కానీ ఈసారి అలా కాకుండా, అన్నీ వెర్షన్లను దాదాపు ఒకే సమయంలో రిలీజ్ చేయాలనేది ప్లాన్…

ఆసక్తికరమైన ట్విస్ట్…: మలయాళ వెర్షన్ రిలీజ్ అయిన రెండు నెలల తర్వాతే మిగిలిన భాషల వెర్షన్లు రిలీజ్ చేయాలని అగ్రిమెంట్ ఉన్నట్లు సమాచారం… అంటే, మలయాళం చూసిన వారు సీక్రెట్ దాచగలిగితేనే, తెలుగు ప్రేక్షకులకు రాంబాబు ఇచ్చే షాక్ తగులుతుంది…! లేదా వీగిపోతుంది…

ఫ్యాన్స్ ఆశ అంతా అక్కడే!

తెలుగులో రాంబాబు పాత్రకు ఉన్న క్రేజ్ వేరు… “మనం చేసే ప్రతి పనికి ఒక సాక్ష్యం ఉంటుంది” అని నమ్మే రాంబాబు, ఈ ‘రిలీజ్ డేట్ల’ గందరగోళం నుండి ఎలా బయటపడతారో చూడాలి… బహుశా రాంబాబు తన స్టైల్‌లో ఏదైనా కొత్త ప్లాన్ వేసి, హిందీ వెర్షన్‌తో పాటే అక్టోబర్ 2న థియేటర్లోకి వచ్చేస్తాడేమోనని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు…




drishyam3


దృశ్యం 3: రాంబాబు 'మాస్టర్ ప్లాన్' – ది ఫైనల్ చాప్టర్

గత రెండు భాగాల్లో రాంబాబు (వెంకటేష్) శవాన్ని మాయం చేయడం, పోలీస్ స్టేషన్ కిందనే పాతిపెట్టడం చూశాం… కానీ ఈసారి పోలీసులు పాత పగతో రగిలిపోతున్నారు… కేవలం సాక్ష్యాల కోసం వెతకడం మానేసి, రాంబాబును మానసికంగా దెబ్బకొట్టాలని ఫిక్స్ అవుతారు…

1. కొత్త ప్రత్యర్థి – కొత్త వ్యూహం

ఈసారి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్‌గా ఒక యంగ్ అండ్ అగ్రెసివ్ ఐపీఎస్ ఆఫీసర్ వస్తాడు… పుష్పలో షెకావత్ టైపు… అతను పాత ఫైల్స్ అన్నీ తిరగేసి ఒక విషయాన్ని గమనిస్తాడు… రాంబాబు ప్రతిదీ సినిమా నాలెడ్జ్‌తోనే ప్లాన్ చేస్తున్నాడు…. అందుకే, రాంబాబుని పట్టుకోవాలంటే ‘సినిమా కథ’ కంటే వేగంగా, డిఫరెంటుగా ఆలోచించాలని నిర్ణయించుకుంటాడు…

2. ఊహించని ట్విస్ట్ (The Twist)

రాంబాబు కూతురు అంజలి పెళ్లి సంబంధాలు చూస్తుంటారు… పోలీసులు అంజలికి కాబోయే భర్తను లేదా ఆ కుటుంబంలో ఒకరిని తమ ఇన్ఫార్మర్‌గా రాంబాబు ఇంట్లోకి పంపిస్తారు… రాంబాబుకి తెలియకుండానే అతని ఇంట్లో సర్వైలెన్స్ (నిఘా) పెడతారు…

ట్విస్ట్ ఏంటంటే….: పోలీసులు అనుకున్నట్లుగా రాంబాబు దొరికిపోయాడని అందరూ భావిస్తున్న తరుణంలో… అసలు క్లైమాక్స్ మొదలవుతుంది…రాంబాబుకు మొదటి నుండే తను నిఘాలో ఉన్నానని తెలుసు! తన ఇంట్లో మైకులు, కెమెరాలు ఉన్నాయని తెలిసి కూడా, పోలీసులను తప్పుదోవ పట్టించడానికి తనే ఒక ఫేక్ క్రైమ్ సీన్ క్రియేట్ చేస్తాడు…

3. ది క్లైమాక్స్ షాక్

పోలీసులు ఒక చోట తవ్వకాలు జరిపి ‘శవం’ దొరికిందని సంబరపడతారు… కానీ, ఫోరెన్సిక్ రిపోర్ట్‌లో అది మనిషి శవం కాదు, కేవలం సినిమా షూటింగ్‌లో వాడే డమ్మీ అని తేలుతుంది… ఆ డమ్మీ లోపల ఒక చిన్న చిట్టీ ఉంటుంది:… “సినిమాలో క్లైమాక్స్ ఎప్పుడూ మనం ఊహించినట్టు ఉండదు సార్!”

అదే సమయంలో, రాంబాబు పాత కేసుకి సంబంధించిన అసలు సాక్ష్యాలన్నింటినీ శాశ్వతంగా నాశనం చేసి, తన కుటుంబాన్ని ఒక సురక్షితమైన దేశానికి పంపించే ఏర్పాట్లు పూర్తి చేస్తాడు… పోలీసులు రాంబాబును అరెస్ట్ చేసినా, చట్టం ముందు నిలబెట్టడానికి ఒక్క చిన్న ఆధారం కూడా మిగలదు…


ఈ కథనాన్ని రక్తికట్టించే అంశాలు…. 

  • ఎమోషనల్ బాండింగ్…: ఈసారి రాంబాబు తన భార్య నందిని (మీనా)ని కూడా తన ప్లాన్‌లో భాగస్వామిని చేస్తాడు…

  • టెక్నాలజీ vs కామన్ సెన్స్…: పోలీసులు అత్యాధునిక టెక్నాలజీ వాడితే, రాంబాబు తన ‘కేబుల్ ఆపరేటర్’ తెలివితేటలతో దాన్ని ఎలా తిప్పికొట్టాడనేది హైలైట్….

  • ఓపెన్ ఎండింగ్…: రాంబాబు జైలుకు వెళ్తూ కూడా చిరునవ్వుతో వెళ్లడం… లోపల కూడా తన ఆట కొనసాగుతుందని హింట్ ఇవ్వడం….

…….. ఇదీ ఓ ఫ్యాన్ మేడ్ స్టోరీ… అసలు మూడో భాగం కథ కాదు ఇది… కానీ బాగుంది కదా… అసలు పరిస్థితి ఏమిటంటే….

కథ ఇంకా రహస్యం…: మలయాళంలో కూడా షూటింగ్ పూర్తయినట్లు వార్తలు వస్తున్నాయి కానీ, అఫీషియల్ స్టోరీ లైన్ ఎక్కడా లీక్ అవ్వలేదు… జీతూ జోసెఫ్ స్క్రిప్ట్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు… హిందీ, తెలుగు, మలయాళం… ఇలా ఏ భాషలో తీసినా క్లైమాక్స్ మాత్రం ఒక్కటే ఉంటుంది… అందుకే ఒక భాషలో రిలీజ్ అయితే మిగిలిన వారికి సస్పెన్స్ ఉండదని భయం…. స్వస్తి…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • దృశ్యం-3… రాంబాబు మార్క్ ‘ట్విస్ట్’… అడుగు దూరంలో అసలు క్లైమాక్స్!!
  • ఏరు దాటాక బోడి మల్లన్న… ఇది పవర్ లిఫ్టర్ ప్రగతి మరో మొహం…
  • అక్రమాల తిరుమల చీకట్లలో… ఒకటీఅరా మంచి నిర్ణయాలు… ఇలా…
  • బీఆర్ఎస్‌కు పార్టీ విరాళాల్లో భారీ క్షీణత… ఇది దేనికి సంకేతం..?!
  • ఎవరేం తక్కువ..? శివాజీ సామాను రచ్చ కాస్తా పెద్ది చికిరి పాట వైపు మళ్లింది…!
  • Delhi pollution triggered allergies… Here is an Innovative Treatment
  • కేసీయార్‌పైకే ‘ఉల్టా వాటర్ వార్’… నిజాలన్నీ బయటపడుతున్నయ్….
  • నైనర్ నాగేంద్రన్… సైలెంటుగా తమిళ బీజేపీకి జవజీవాలు…
  • శ్రీరాముడు ముస్లిం అట… ఈ తృణమూల్ నేతలందరూ అదో టైపు…
  • సామాన్ల మగ శివాజీ డర్టీ భాషపై ఓ సైకాలజిస్టు విశ్లేషణ…!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions