నిన్నటి నుంచీ టీవీల్లో హోరు… ఆయనెవరో కేపీ చౌదరి అట… సినిమా వాడు అట… డ్రగ్స్ సప్లయర్ పేరిట అరెస్టు చేశారట… పత్రికల్లో జోరుగా వార్తలు… ఊదరగొడుతున్నారు… సురేఖావాణి, జ్యోతి, ఆషురెడ్డి ఎట్సెట్రా బోలెడు మందికి సదరు చౌదరి ఫోన్ల నుంచి వందల కాల్స్ వెళ్లాయట… నాలుగు ఫోన్లలో వందల సెలెబ్రిటీల పేర్లున్నాయట… ఇక చూసుకో నా రాజా… ఎవడికి తోచింది వాడు రాసేస్తున్నాడు, చూపించేస్తున్నాడు… ఒకటే హోరు…
టీవీ మీడియాకు పాత సంచలన కేసుల ఫాలో అప్ ఎలాగూ పట్టదు… ఆ సోయి లేదు, ఆ తెలివీ లేదు… ఏదో అప్పటికప్పుడు శెనిగెలు బుక్కి చేతులు కడుక్కున్నట్టుగా… ఓ కొత్త వార్త దొరికితే చాలు, ఇక దాని వెంబడి పడి ఏదో ఒకటి రాయడం… మరో వార్త దొరికితే ఇక దీన్ని వదిలేసి కొత్తదాని వెంట పడటం… అందుకే అంటారు… టీవీల్లో వార్తలు అంటే టీవీల్లో సీరియళ్లలాగే అని… లోతు ఉండదు, దిశ ఉండదు, దశ ఉండదు… ముందైతే ఏదో ఒకటి బ్రేకింగ్ కొట్టు, స్క్రోల్ నడుపు, ప్లేట్స్ కొట్టు… అంతే, మిగతావి తరువాత చూసుకుందాం…
డ్రగ్స్ కేసు విషయమే తీసుకుందాం… నిందితుడు ఫోన్లలో నంబర్లుంటే ఇక వాళ్లంతా నిందితులేనా…? పోలీసులు కావాలనే ఒకటీరెండు పేర్లు లీక్ ఇస్తారేమో… సురేఖావాణి, జ్యోతి మాత్రమేనా..? మన ఇండస్ట్రీలో ఎందరో కదా… సినిమావాళ్లే కాదు, హైదరాబాద్ పబ్బుల్లో బహిరంగమేనట కదా… ఇవన్నీ నాలుగు రోజుల హడావుడి… తరువాత ఫసాక్… ఎవడూ పట్టించుకునేవాడు ఉండడు… గుర్తుందా..?
Ads
అకున్ సబర్వాల్ అనే ఓ ఐపీఎస్ ఆమధ్య ఒక్కో సినిమా సెలబ్రిటీని రోజుకొకరిని విచారణ పేరిట పిలిచి నానా హంగామా క్రియేట్ చేశాడు… తరువాత ఏమైంది..? కేసీయార్ ఒకేమాటతో ఆ కేసు జస్ట్, అలా ఆగిపోయింది… తరువాత సదరు ఐపీఎస్ అయిపూజాడా లేదు మళ్లీ… నిజమే కదా… చౌదరి ఫోన్లలో నంబర్లుంటే ఇక వాళ్లు నిందితులేనా..? అందరూ పెడ్లర్లేనా..? మాఫియా సభ్యులేనా..?
పరిమితంగా డ్రగ్స్ కలిగి ఉన్నా, తీసుకున్నా, ఆ వ్యసనానికి గురైతే బాధితుడు అవుతాడు గానీ నిందితుడు అవుతాడా..? అసలు ఈ కేసులు నిలుస్తాయా..? వాడి వెంట్రుకలు తీసుకున్నారు, వాడి గోళ్లు సేకరించారు అంటూ ఊదర… చివరకు ఈ కేసులు పెట్టే అధికారులకు మిగిలేవి అవే… పోనీ, నాలుగు రోజులయ్యాక క్రైమ్ రిపోర్టర్లు మళ్లీ దీని ఫాలో అప్ చేస్తారా..? చేయరు… మళ్లీ ఏ హీరోకు బిడ్డ పుట్టడమో, వీళ్లంతా వెళ్లి హాస్పిటల్ ఎదుట పడిగాపులు కాయడం…
ఆమధ్య ఏదో పబ్బుపై పోలీసులు దాడిచేసి, అందరినీ చెక్ చేసి, స్టేషన్ తీసుకెళ్లి, సంతకాలు చేయించుకుని ఏ తెల్లవారుజామునో వదిలేశారు… తీరాచూస్తే తీగె దొరికిందీ లేదు… సాధించిందీ లేదు… అప్పట్లో ఓ మెగా కూతురు కూడా దొరికిందన్నారు… ఏమైంది..? వేగంగా వ్యాప్తి చెందుతున్న డ్రగ్స్ నిర్మూలన ఇలాంటి కేసులతో, లీకులతో, సెలబ్రిటీల పేర్లతో సాధ్యం కాదు… కొడితే అసలైన సప్లయర్లు, పెడ్లర్స్‌ను పట్టాలి… నెట్‌వర్క్ బ్రేక్ చేయాలి… ఈ వార్తల విషయానికి వద్దాం… సదరు నిందితుడు 12 మందికి డ్రగ్స్ సప్లయ్ చేసినట్టు వెల్లడించాడట… అంతేనా..? ఇంకేముంది..? ఖేల్ ఖతం… కేస్ ఖతం…!!
Share this Article