Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

దురంధర్… నిజంగా నాటి సాహసి మేజర్ మోహిత్ శర్మ కథేనా..?!

March 23, 2026 by M S R

.

‘దురందర్‘ మేజర్ మోహిత్ శర్మ బయోపిక్ కాదు.. కేవలం ఒక స్ఫూర్తి మాత్రమే! అసలు నిజాలు ఇవీ..

నేడు సోషల్ మీడియాలో, మీడియాలో రణవీర్ సింగ్ నటించిన ‘దుందర్: ద రివెంజ్‘ సినిమాను అశోక చక్ర గ్రహీత మేజర్ మోహిత్ శర్మ బయోపిక్ అన్నట్టుగా ప్రచారం చేస్తున్నారు… కానీ, లోతుగా విశ్లేషిస్తే ఇది బయోపిక్ కంటే కూడా ఆయన సాహసాల నుండి స్ఫూర్తి పొంది అల్లిన ఒక కల్పిత గాథ అని స్పష్టమవుతోంది… నిజాల్లోకి వెళ్తే…

Ads

1. ఆపరేషన్ ఎక్కడ జరిగింది? (లోకేషన్ ముఖ్యం) సినిమాలో ‘దురందర్’ పాత్ర పాకిస్థాన్ భూభాగంలోకి వెళ్లి ఆపరేషన్ చేసినట్లు చూపిస్తున్నారు… కానీ వాస్తవానికి మేజర్ మోహిత్ శర్మ తన అండర్ కవర్ ఆపరేషన్‌ను మన దేశంలోని కాశ్మీర్ లోయలో (కుప్వారా మరియు ఇతర సరిహద్దు ప్రాంతాల్లో) నిర్వహించాడు… మన దేశంలోకి చొరబడిన ఉగ్రవాదుల నెట్‌వర్క్‌ను ఛేదించడానికి ఆయన లోకల్ కాశ్మీరీ వేషధారణలో వారి మధ్యే తిరిగారు తప్ప, పాకిస్థాన్ వెళ్ళలేదు… తన ఆపరేషన్ పూర్తిగా డిఫరెంట్…

2. ఒక సంవత్సరం పాటు ఉగ్రవాదులతోనే… మేజర్ మోహిత్ శర్మ 2004లో ‘ఇఫ్తికార్ భట్‘ అనే మారుపేరుతో సుమారు ఒక సంవత్సరం పాటు అండర్ కవర్ ఆపరేషన్ లో ఉన్నాడు.. గడ్డం పెంచి, స్థానిక భాష నేర్చుకుని హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాదుల నమ్మకాన్ని గెలుచుకున్నాడు… తనను అనుమానించిన ఇద్దరు కరుడుగట్టిన ఉగ్రవాదులను ఇక తప్పనిసరై, అతి సమీపం నుండి హతమార్చి, తన మిషన్‌ను విజయవంతంగా పూర్తి చేసి ఆర్మీ బేస్‌కు తిరిగి వచ్చాడు…

durandhar

3. ప్రతీకారం కాదు.. అది అంకితభావం! సినిమా టైటిల్‌లోనే ‘ద రివెంజ్‘ (ప్రతీకారం) అని ఉంది… వెండితెరపై హీరోలు వ్యక్తిగత పగల కోసం పోరాడుతుంటారు… కానీ, మేజర్ మోహిత్ శర్మ జీవితంలో వ్యక్తిగత కక్షలకు తావులేదు… ఆయన ఆశయం ‘డ్యూటీ’…, ఆవేశం కాదు… 2009 మార్చి 21న కుప్వారా అడవుల్లో ఉగ్రవాదులతో జరిగిన పోరాటంలో తన తోటి కమాండోలను కాపాడే క్రమంలో ఆయన వీరమరణం పొందాడు…

ఎవరీ మోహిత్ శర్మ? హర్యానాలోని రోహ్‌తక్ లో 1978లో జన్మించిన ఆయన, ఇంజనీరింగ్‌ను కాదని దేశ సేవ కోసం ఆర్మీలో చేరాడు… 1వ పారా (స్పెషల్ ఫోర్సెస్) కు చెందిన ఆయన సాహసానికి గుర్తుగా భారత ప్రభుత్వం అత్యున్నత ‘అశోక చక్ర’ను అందించింది…

ముగింపు…: మేజర్ మోహిత్ శర్మ లాంటి వీరుల గురించి నేటి తరానికి తెలియడం మంచిదే… అయితే, వాస్తవాలను పక్కన పెట్టి గానీ, పాకిస్థాన్ ఆపరేషన్ వంటి కల్పిత అంశాలను జోడించినట్టు గానీ… దానిని ‘బయోపిక్’ అని గానీ ఎవరు పిలిచినా, రాసినా ఆయన త్యాగాన్ని తప్పుగా అర్థం చేసుకోవడమే అవుతుంది… ‘దురందర్’ ఒక ఫిక్షనల్ యాక్షన్ సినిమా మాత్రమే.. మేజర్ మోహిత్ శర్మ కథ ఒక అజరామరమైన వాస్తవ గాథ..!

(నిన్న మోహిత్ శర్మ వర్దంతి)

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ‘ఎర్ర’కోటకు బీటలు…! చివరి లెఫ్ట్ నౌక మునక..? కేరళ ముఖచిత్రం..!!
  • దురంధర్… నిజంగా నాటి సాహసి మేజర్ మోహిత్ శర్మ కథేనా..?!
  • రచ్చ ఆగడం లేదు… ఆ రోత పాటకు నానా విఫల సమర్థనలు…
  • రామ రామ… గోత్రాల పేరిట రాములోరి పెళ్లిపై ఓ శుష్క రాద్ధాంతం..!
  • జాణవులే వరవీణవులే – కిలికించితాలలో… స్మితను కూడా మరవలేం…
  • జియో పాలిటిక్స్… క్యూబాలో నిత్యనరకం… 18 నెలల్లో 6 బ్లాక్ అవుట్స్…
  • తెగ నవ్విస్తున్న టూప్లస్‌టూ పెళ్లిచూపుల కథ… మార్కెటింగ్ కన్సల్టెన్సీ…
  • సత్వర న్యాయం Vs చట్టప్రకారం న్యాయం… ఇదెప్పుడూ తెమిలే ప్రశ్న కాదు…
  • సతి అనుమతి లేని సంభోగం కూడా ఓ అత్యాచారమే… చిరైయా…
  • దురంధర్..! మనం సినిమా చూసే విధానాన్ని మార్చేస్తోంది… కొత్తగా, బలంగా…!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions