సీఎం జగన్మోహన్‌రెడ్డి అక్రమాస్తుల కేసులు అనగానే గుర్తొచ్చే పేరు సీబీఐ నుంచి అప్పటి జేడీ లక్ష్మినారాయణ పేరు… తరువాత రాజకీయాల్లో చేరి, చేదు అనుభవం మూటగట్టుకుని, ప్రస్తుతం తనేమిటో తనకే అర్థం కాని అయోమయంలో ఉన్నట్టున్నాడు… మరో పేరు గుర్తొస్తుంది… ఈడీ నుంచి జేడీ రాజేశ్వర్ సింగ్… దేశంలో పెద్ద పెద్ద కేసుల్ని ఈడీ తరఫున డీల్ చేసిన ఈయన ఇప్పుడు యూపీలో బీజేపీ టికెట్టు మీద పోటీచేస్తున్నాడు… ఇంకా 12 ఏళ్ల సర్వీస్ ఉండగానే వాలంటరీ రిటైర్‌మెంట్ తీసుకుని, రాజకీయాల్లోకి దూకేశాడు…
ఓ పొలిటికల్ సైట్ రాసిందాన్ని బట్టి… (తను కూడా ట్విట్టర్‌లో రాసుకున్న ఓ లేఖ సారాన్ని బట్టి…) టూజీ స్కామ్ సహా చిదంబరం, అహ్మద్ పటేల్ పేర్లున్న అగస్టా వెస్ట్‌ల్యాండ్, జార్ఖండ్ మాజీ సీఎం మధు కోడా, జగన్‌మోహన్‌రెడ్డి, తదితరుల కేసుల్లో రాజేశ్వరే ప్రధాన దర్యాప్తుదారు అంటారు… టూజీ స్కాం తవ్వుతుంటే ఎయిర్‌సెల్-యాక్సిస్ స్కాం, ఐఎన్ఎక్స్ మీడియా బ్రైబరీ స్కాంలు బయటపడ్డయ్… చిదంబరం పేరు బయటికొచ్చింది… Amrapali scam, Noida Ponzi scheme scam, Gomti riverfront scam కూడా ఈయన ఖాతాలోనే ఉన్నయ్…
దాంతో పవర్ ఫుల్ లాబీ ఈ రాజేశ్వర్ వెంటబడింది, పలు కేసులు పెట్టించింది… కేకే వేణుగోపాల్, హరీష్ సాల్వే, ముకుల్ రోహత్‌గీ వాదించేవాళ్లు తన తరఫున… సుబ్రహ్మణ్య స్వామి, ప్రశాంత్ భూషణ్ కూడా సపోర్ట్ చేసేవాళ్లు… కొన్ని సందర్భాల్లో సుబ్రహ్మణ్యస్వామి భార్య, సీనియర్ లాయర్ రోక్సనా స్వామి కూడా రాజేశ్వర్ కోసం కోర్టుకు వచ్చేది… 55 ఫేక్ కంప్లయింట్స్ పడ్డయ్ ఈయన మీద… చివరకు సుప్రీంకోర్టు అండగా నిలిచింది…
Ads
రాజేశ్వర్ ప్రొఫైల్ చూస్తే ఆశ్చర్యమేస్తుంది… ధన్‌బాద్ ఐఐటీలో గ్రాడ్యుయేట్, ఎంఏ, ఎల్ఎల్‌బి, పీహెచ్‌డి… ఆయన తండ్రి రణ్ బహదూర్ సింగ్ రిటైర్డ్ ఐపీఎస్… (ఇప్పుడు లేడు)… రాజేశ్వర్ భార్య లక్ష్మిసింగ్, యూపీ కేడర్ ఐజీ… ఆరు జిల్లాల్లో కలిపి ఓసారి మూడేవారాల్లో 4650 కేసుల్ని పరిష్కరించేసింది… ఆయన సోదరి మీనాక్షి సింగ్ ఓ ఐఆర్ఎస్ అధికారి, ఆమె భర్త రాజీవ్ కృష్ణ యూపీ కేడర్ అడిషనల్ డీజీపీ… మరో సోదరి ఐఏఎస్ అధికారిని ఆభా సింగ్, ఆమె భర్త మహారాష్ట్ర కేడర్ ఐపీఎస్ అధికారి వైపీ సింగ్ (ఈయన వీఆర్ఎస్ తీసుకున్నాడు)… రాజేశ్వర్ పదేళ్లు యూపీ పోలీస్ విభాగంలో పనిచేసి, ఈడీలో పద్నాలుగేళ్లుగా చేస్తున్నాడు..!!
Share this Article