Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

లెక్కల్లో ఈనాడు ఎక్కాలు వేరయా..! కేసీయార్ అంటే భయం, జగన్‌పై విషం…!!

February 14, 2023 by M S R

జగన్ పాలన అడ్డదిడ్డంగా, ఓ దశ, ఓ దిశ లేకుండా కొట్టుకుపోతోంది… వోకే, అంగీకరిద్దాం… అడ్డగోలు అప్పులు చేయడం తప్ప, పంచిపెట్టడం తప్ప, జనానికి నాలుగు కాలాలపాటు ఉపయోగపడే పనులు ఒక్కటీ లేవు… సరే, ఒప్పేసుకుందాం… కానీ ఆ అప్పులు ఎన్ని..? ఓ నాయకుడు, ఓ పాలకుడి పట్ల విపరీత ద్వేషభావం ఉంటే… బుర్రలు పనిచేయడం మానేస్తాయి అనడానికి ఇదొక ఉదాహరణ అనుకోవాలేమో…

ఈనాడు బ్యానర్ వార్త… అసలు అప్పులు 9.16 లక్షల కోట్లు అని… అంటే, ఓ కేంద్ర మంత్రీ, ఏపీ అప్పులు కేవలం 4.52 లక్షల కోట్లే అని లెక్క ఎలా చెబుతావు..? నీకసలు లెక్కల్లో ఎక్కాలు వచ్చా..? అన్నట్టుగా ఉంది ఈ వార్త… ఇదుగో నా లెక్క అన్నట్టుగా 9.16 లక్షల కోట్లుగా చెప్పింది… ఏపీ ఇక తేరుకోలేనంతగా అప్పుల్లో మునిగిపోయింది, ఇక దివాలా తీసినట్టే అని చాటిచెప్పే ప్రయత్నం అన్నమాట… అప్పులు నిజమే, అవి అదుపు తప్పిన మాట నిజమే, కానీ అది చెప్పడానికి ఇలా అబద్ధాలు, అతిశయోక్తులు, హాస్యాస్పద బాష్యాలు దేనికి అనేదే అసలు ప్రశ్న…

ఈనాడు ఏమంటున్నదీ అంటే… రాష్ట్ర ప్రభుత్వ రుణాలు, అంటే బడ్జెట్‌లో చూపిస్తున్నవి కేంద్రం చెబుతున్నట్టు 4.42 లక్షల కోట్లు కావు, 4.65 లక్షల కోట్లు… సరే, 20- 25 వేల కోట్లకు ఏమొచ్చింది, ఈనాడు నిజమే చెప్పింది అనుకుందాం… లక్షల కోట్లు ఎటో పోతున్నయ్, ఈ వేల కోట్లకు ఏమొచ్చింది..? ఈ తేడాను కూడా ఏపీ ప్రభుత్వం నిజాల్ని దాచిపెట్టిన నిర్వాకం వల్ల కనిపిస్తోందట… సరే, ఒప్పేసుకుందాం…

Ads

eenadu

కేంద్రం చెప్పే లెక్క గాకుండా కార్పొరేషన్ల పేరిట తీసుకున్న రుణాలు 1.78 లక్షల కోట్లు ఉంటాయని ఈనాడు లెక్క… కాగ్ ప్రత్యేక ఆడిట్‌లో ఇంకా ఏమీ తేలడం లేదు కాబట్టి కేంద్రం వాటిని చెప్పడం లేదేమో… ఐనా సరే, ఈనాడు చెప్పింది కదా, నిజమే అనుకుందాం… అసలు ఆడిట్‌ పెద్దలు ఈ అప్పులపై ఎందుకింతగా బుర్రలు బద్దలు కొట్టుకుంటున్నారో తెలియదు… తెలంగాణలో ప్రభుత్వ రుణాలు ఎన్నో, కార్పొరేషన్ రుణాలు ఎన్నో ఇట్టే తేల్చేశారు…

నాన్ గ్యారంటీ అప్పులు 87 వేల కోట్లు అని కూడా ఈనాడు ఇంకో లెక్క చెబుతోంది… రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీ ఇవ్వకుండా సైతం 87 వేల కోట్ల అప్పులు చేశారంటే జగన్ ప్రభుత్వ ప్రతిభే మరి… అవునూ, ఇంతకీ ఈ రుణాలు ఇంత ఉదారంగా ఎవరిచ్చారో, ఏ పర్పస్ కోసం ఇచ్చారో కూడా ఈనాడు చెప్పాలి కదా మరి… చెప్పదు… సరే, అదీ అంగీకరిద్దాం, ఫర్ డిబేట్ సేక్… కానీ ఈ 9 లక్షల కోట్ల లెక్కలో 1.85 లక్షల కోట్ల పెండింగ్ బిల్లులు కూడా ఉన్నాయని ఈనాడు చెబుతోంది… ఇదేమిటి..?

ప్రభుత్వం బకాయి పడ్డ బిల్లులను సైతం అప్పులుగా చూపించాలా..? చూపిస్తారా..? ఇదేం లెక్క..? అవునులే లెక్కాపత్రం లేని రాతలకు సమర్థన ఏముంటుంది..? రాస్తూ పోవడమే..! జగన్ సర్కారు ఆర్థికస్థితి ఘోరంగా ఉందనేది నిజమే… బిల్లులు పెండింగ్‌లో ఉంటున్నమాట నిజమే… ముందే చెప్పుకున్నాం కదా, అడ్డదిడ్డం పాలన అని..! కానీ పెండింగ్ బిల్లుల్ని కూడా అప్పులుగా చూపించే ఈనాడు తెంపరితనాన్ని ఏమనాలి..?

మరొకటీ చెప్పుకోవాలి… ఈనాడు, ఆంధ్రజ్యోతి ఎలా రాస్తున్నా సరే, జగన్‌కు వాటి జోలికి పోవడం చేతకావడం లేదు… అదే తెలంగాణ అప్పుల మీద ఇదే ఈనాడు ఏం రాసిందో చూడండి…

eenadu

జగన్ అప్పుల నిర్వాకం అంటూ ఫస్ట్ పేజీ బ్యానర్ హంగామా చేసిన ఇదే ఈనాడు తెలంగాణ అప్పుల మీద మాత్రం ఆరో పేజీలో కనీకనిపించకుండా, భయంభయంగా, సింగిల్ కాలమ్‌లో వేసి, హమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంది… మరి హైలైట్ చేస్తే కేసీయార్ ఊరుకోడు కదా… పాతేస్తాడని, తాటతీస్తాడని భయం… అసలు ఈమాత్రం వార్త రాయడానికి కూడా ఈనాడు ఎంతగా గింజుకున్నదో, ఏమో…!! అవునూ, కేసీయార్ ప్రభుత్వ పెండింగ్ బిల్లులు ఏమీ లేవా..? నాన్ గ్యారంటీ అప్పులు ఏమీ లేవా..? అవి లెక్కల్లోకి రావా..? ఈనాడు మేథమెటిక్స్‌లో అవి కనిపించవా..?!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • సారీ రాజేష్… మన దిక్కుమాలిన న్యాయవ్యవస్థలో ఇక ఇంతే…
  • హీరోయిన్‌ను మారుద్దామని పంచాయితీ పెడితే… హీరోనే పీకిపారేశాడు…
  • మ్… తెలుగు పాటల్లో పూర్ణ అనుస్వరంపై చంద్రబోస్ సరైన వ్యాఖ్యానం…
  • టమాట రైతుకు గట్టి భరోసా… టమాటర్ పాలసీతో చైనాను దాటేయొచ్చు..!!
  • BRS లో చేరగానే… ఈ కొత్త బాస్‌పై ఆ పాత ఆరోపణలన్నీ డిలిటేనా..?
  • 70 ఏళ్ల క్రితమే ఓ సూపర్ పాన్ ఇండియా మూవీ… ఆ స్టార్ ఎవరో తెలుసా..?
  • బూతుకూ హాస్యానికీ నడుమ ఓ గీత… దానికి జంధ్యాల గౌరవం…
  • కార్పొరేట్ విద్య అంటేనే ఓ నయా మాఫియా… పిల్లలు బలి..!!
  • ఇతడు..! ఓ లేజర్ తాత గారు… ఓ హిమేశ్ బాబు… ఓ పాత స్పూఫ్…
  • సంతానసాఫల్యం… ఈ వ్యాపారం అనేక మార్గాలు… ఎన్నెన్నో మోసాలు…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions