.
ఈ మధ్య కాలంలో బాబాల మీద, ఫేక్ స్వాముల మీద సినిమాలు రావడం కామన్ అయిపోయింది… అదే దారిలో వచ్చిన సినిమానే ఈ ‘ఈషా’… మరి ఈ సినిమా భయపెట్టిందా? లేక భయంకరంగా ఉందా?
కథాకమామిషు ఏంటంటే…
Ads
నైనా (హెబ్బా పటేల్) ఒక గ్యాంగ్‌కు లీడర్… తన పని ఏంటంటే… అమాయక జనాన్ని మోసం చేసే దొంగ స్వాముల ముసుగు తొలగించడం… అలా ఒకసారి డాక్టర్ ఆదిదేవ్ (పృథ్వీరాజ్) అనే ఒక న్యూరాలజిస్ట్ కమ్ స్వామీజీని టార్గెట్ చేస్తుంది…
“దెయ్యాలు లేవు… అన్నీ మీ భ్రమలు” అని నైనా టీమ్ వాదిస్తే… “ఒక దెయ్యాల ఇంట్లో మూడు రోజులు ఉండండి… అప్పుడు తెలుస్తుంది దెయ్యం పవర్ ఏంటో…” అని స్వామీజీ ఛాలెంజ్ చేస్తాడు… ఆ ఇంట్లో వీరికి ఎదురైన అనుభవాలేంటి? క్లైమాక్స్ ట్విస్ట్ ఏంటి? అనేదే ఈ సినిమా…

నటీనటుల పర్ఫార్మెన్స్
-
హెబ్బా పటేల్…: చాలా గ్యాప్ తర్వాత స్క్రీన్ మీద కనిపించింది కానీ, క్యారెక్టరైజేషన్ దెబ్బకొట్టింది… ఆమె పాత్ర చిరాకు తెప్పిస్తుంది తప్ప ఎక్కడా ఇంప్రెసివ్ గా అనిపించదు…
-
త్రిగుణ్ & అఖిల్ రాజ్…: హీరోలు అని పిలిపించుకోవడం కోసం ఉన్నట్టుంది తప్ప వీరికి సరైన స్కోప్ లేదు… ముఖ్యంగా అఖిల్ రాజ్ క్యారెక్టర్ చాలా పూర్ గా రాసుకున్నారు…
-
సిరి హనుమంతు…: ఈ గ్యాంగ్ లో కాస్త ఎమోషన్ పలికించింది ఈమే… కానీ మిగతా పాత్రలలాగే ఇది కూడా రొటీన్ గానే సాగుతుంది…
-
పృథ్వీరాజ్…: విలన్ కమ్ స్వామీజీగా ఆయన గెటప్, డబ్బింగ్ కాస్త విచిత్రంగా ఉన్నా… ఉన్నంతలో ఆయన పాత్రే కొంచెం బెటర్…
దర్శకుడు ఏం చెప్పాలనుకున్నాడు?
దర్శకుడు శ్రీనివాస్ మానే ఒక ప్యూర్ హర్రర్ సినిమా తీయాలనుకున్నాడు… కానీ అది పేపర్ మీద ఉన్నంత క్లారిటీగా స్క్రీన్ మీదకు రాలేదు…
-
లాజిక్ లేని సీన్లు…: హర్రర్ సినిమాల్లో లాజిక్స్ వెతకకూడదు అంటారు కానీ… మరీ పిచ్చి పిచ్చిగా ప్రవర్తించే పాత్రలు ఉంటే చూసే ప్రేక్షకుడికి విసుగు వస్తుంది…
-
జంప్ స్కేర్స్…: సౌండ్ ఎఫెక్ట్స్ గట్టిగా పెడితే భయపడతారు అనుకున్నారు కానీ, ఆ సీన్లలో డెప్త్ లేకపోవడంతో ఆ భయం కలగదు…
-
ట్విస్ట్…: క్లైమాక్స్‌లో ఒక ట్విస్ట్ ఇచ్చి మేనేజ్ చేద్దాం అనుకున్నారు… రెగ్యులర్ గా సినిమాలు చూసే వాళ్లకి అది ముందే అర్థమైపోతుంది… ఏదో అలా అలా సినిమాని సేవ్ చేయడానికి ప్రయత్నించింది ఆ ట్విస్ట్ ఒక్కటే…
థాంక్ గాడ్… సినిమా నిడివి తక్కువ ఉండటం పెద్ద రిలీఫ్… బిజిఎమ్ (BGM) అక్కడక్కడ బాగుంది… సెకండ్ హాఫ్ లో వచ్చే ఒకట్రెండు సీన్లు పర్లేదు… కానీ కథలో బలం లేదు, మాటల్లో పస లేదు… హీరో, హీరోయిన్లను చూస్తే సానుభూతి కలగాల్సింది పోయి చిరాకు వస్తుంది… పాత కాలం నాటి హర్రర్ పోకడలు…
మీకు హర్రర్ సినిమాలు అంటే విపరీతమైన ఇష్టం ఉండి.., "ఏమున్నా సరే చూసేస్తాను" అనుకుంటే ఒకసారి ట్రై చేయొచ్చు... కానీ ఏదో కొత్తగా ఉంటుందని వెళ్తే మాత్రం నిరాశ తప్పదు... క్లైమాక్స్ ట్విస్ట్ కోసం అంత సేపు ఓపిక పట్టడం కష్టమే!
(ఇది యూఎస్ ప్రీమియర్ల ఫీడ్ బ్యాక్)
Share this Article