Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

సో వాట్…? కలెక్టర్ ఆటవిడుపు ఫోటోలకు ఈనాడు మెయిన్ పేజీ ఇంపార్టెన్సా..?!

August 6, 2024 by M S R

ఒక వార్త… అదీ ది గ్రేట్ ఈనాడులో.,. పొలం బాటలో కలెక్టర్ దంపతులు అని శీర్షిక… పొలం బాట అనేది సర్కారీ ప్రోగ్రాం పేరు కాదులెండి… నిత్యం సమీక్షలు, క్షేత్ర పర్యటనలో తీరిక లేకుండా విధులు నిర్వహించే కలెక్టర్ ఆదివారం పూట ఆటవిడుపుగా పొలం బాటపట్టారు… అనేది వార్త సారాంశం…

నిజానికి అది ఓ ఫోటో వార్త… అంటే రైటప్‌కు ఎక్కువ, వార్తకు తక్కువ… సదరు కలెక్టర్ మెదక్ జిల్లాకు కలెక్టర్, పేరు రాహుల్ రాజ్… ఆయన సతీమణి శ్రీజ… వోకే, ఏదో ఆదివారం పూట అలా సరదాగా, వార్తలో చెప్పినట్టే ఆటవిడుపుగా ఏదో సమీపంలోని ఓ పొలానికి వెళ్లి నాట్లేశారు… బాగుంది… ఆఫ్ బీట్ ఫోటోగా ఖచ్చితంగా జిల్లా ఎడిషన్‌లో వార్తో, ఫోటో వేసుకోవచ్చు… కానీ..?

eenadu

Ads

దీన్ని ఏకంగా మెయిన్ పేజీలకు తీసుకొచ్చారు… అంతగా వేయదగిన వార్తల్లేకపోతే ఓ రెండు పేజీలు తగ్గించండి సార్, అసలే న్యూస్ ప్రింట్ ఖరీదు మండిపోతుంది… ఇందులో మెయిన్ పేజీకి అనువైన వార్తా ప్రాధాన్యం ఏముంది..? ప్రజాప్రయోజనం ఏముంది..? అందులో అసలు విశేషం ఏముందని..? (గతంలో జిల్లా ఎడిషన్లలో ఓ లేడీ సబ్ రిజిస్ట్రార్ ఫోటోలు కనిపించేవి ఇలా… చివరకు ఏసీబీకి దొరికినట్టుంది… మరో కలెక్టర్ ఫోటో కూడా ఇలాగే చూసినట్టు గుర్తు…)

అది కలెక్టర్ వ్యక్తిగతం… తన ఆటవిడుపు… పైగా వాళ్లేమైనా కాసేపు నిజంగానే నాట్లేస్తారా..? నెవ్వర్… ఆ డ్రెస్సులు చూడండి… అలా ఫోటోలు దిగాడు, చివరకు వాళ్ల చిన్న పిల్లాడు కూడా..! ఫర్ ఫన్ ఓన్లీ… కలెక్టర్ కదా, ఆ రైతు కూడా కిమ్మనలేదు, అనడు, అనకూడదు… అనలేడు…

సరే, ఏదో ఫోటో వేశారు సరే, దానికి ‘ఆ పరిసరాల్లో నాట్లు వేస్తున్న రైతుల పొలాలను పరిశీలించి, సాగు పద్ధతులను, పంటలో వచ్చే లాభం, ఎదురవుతున్న ఇబ్బందుల్ని తెలుసుకుని పలు సూచనలిచ్చారని వార్తలో రాసుకొచ్చారు… తన పొలం బాటకు అఫిషియల్ జస్టిఫికేషన్… పక్కాగా ఇలాంటివి పీఆర్వోలు, ఐఅండ్‌పీఆర్ సిబ్బంది రాస్తుంటారు… చివరకు ఈనాడు సైతం…? ఒకసారి ప్రమాణాల పతనం ప్రారంభమయ్యాక ఎవడూ ఆపలేడు అనుకుంటా…

srisailam

ఇదీ నిన్నటిదే… నిజానికి మంచి ఫోటో… శ్రీశైలం గేట్లు తెరిచినప్పుడు పర్యాటకులు పోటెత్తుతారు… వరద ప్రవాహంలాగే… కిలోమీటర్ల కొద్దీ ట్రాఫిక్ ఇబ్బందులుంటయ్… ఐనా సరే, భరించొచ్చు… ఎప్పుడో ఓసారి ఇలాంటి దృశ్యాలు కనిపించవు… ఆలమట్టి నిర్మాణం తరువాత మరీ మరీ అరుదైపోయాయి శ్రీశైలం గేట్లు తెరవడం వంటి వార్తలు… అదొక మనోహర దృశ్యం…

కానీ ఇదే ఫోటో బదులు కనీసం రెండో మూడో రోడ్లు కవరయ్యేలా ఫోటో ఉంటే, మరింతగా ఈ వార్త పంచ్ పెరిగి ఉండేది… లేదా బాగా వాహనాల రద్దీ ఉన్నచోట ఫోటో తీసి ఉన్నా బాగుండేది… ఇది బాగా లేదని కాదు, మరిన్ని మంచి యాంగిల్స్ ట్రై చేస్తే బాగుండేదీ అని… అఫ్‌కోర్స్, మిగతా పత్రికలకు ఈ టేస్టు కూడా లేదు, అది వేరే విషాదం…

ఈనాడు

ఇది ఇంకో వార్త… శనివారం నాటి ఎడిషన్… కేంద్రం ఏదో కిందామీదా పడుతూ ఉంటుంది నదుల అనుసంధానం పేరిట… చంద్రబాబు పట్టిసీమ లిఫ్ట్ పెట్టేసి గోదావరినీ కృష్ణాను కలిపేశాడని అప్పట్లో ఈనాడు, జ్యోతి లక్షన్నర వార్తలు రాసి, రెండున్నర లక్షల ఫోటోలు వేసి ఉంటాయి… అది సరిపోలేదట… మొన్న ఎప్పుడో గోదావరి – కృష్ణా- పెన్నా కలిపేసే మరో బృహత్తర ప్రాజెక్టు ఆలోచిస్తున్నట్టూ వార్తలు వచ్చాయి… మరి బృహత్తర ప్రాజెక్టులు చేపట్టకపోతే ‘రెవిన్యూ’ ఎలా..? మేఘా కృష్ణారెడ్డి ఉన్నాడు కదా…

ఆల్రెడీ గోదావరి నుంచి కృష్ణాకు పట్టిసీమ లిఫ్టు ద్వారా కలిపారు, పోలవరం పూర్తయితే గ్రావిటీతోనే కలుస్తుంది… ఎగువన శ్రీశైలం, పోతిరెడ్డిపాడు నుంచి తెలుగుగంగ ద్వారా పెన్నా బేసిన్‌కు నీరు పోవడం లేదా..? హేమిటో… మంత్రి ఉత్తమ్ మరో మంత్రి కోమటిరెడ్డితో కలిసి సాగర్ ఎడమకాల్వకు నీటిని విడుదల చేసి గోదారమ్మకు పూజలు చేశాడని ఈనాడు రైటప్…!!

అలా సింపుల్‌గా ఈనాడు కృష్ణా కాలువలోకి గోదారమ్మను వదిలేసింది… హహ… అఫ్‌కోర్స్, తరువాత ఈ-పేపర్‌లో మార్చేసి, కృష్ణమ్మ అని రాసేసినట్టున్నారు… పత్రికల్లో హ్యూమన్ ఎర్రర్స్ ఉండవనేమీ లేదు… ఉంటాయి, తప్పులేదు… కానీ ఈనాడు వంటి అగ్రశ్రేణి, అధిక సర్క్యులేషన్ ఉన్న పత్రికలో ఇలాంటి తప్పులు పంటికింద రాళ్లలా కలుక్కుమంటాయి… మిగతా నాసిరకం నక్క వాతల పత్రికల నుంచి ఏమీ ఆశించలేం కదా, అందుకే ఇవి చెప్పుకోవడం..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ‘అనగనగా..’ ఓ సుమంతుడు… మరొక్కసారి అదే ఫెయిల్యూర్ అడుగు…
  • సుప్రీంకోర్టుకు రాష్ట్రపతి అత్యంత కీలకమైన రాజ్యాంగ ప్రశ్నలు..!
  • అది సరే గానీ… మరి రేవంత్ రెడ్డి ఏమైపోతాడో చెప్పలేదేమిటి..?
  • ఫాఫం, తెలంగాణ వాళ్లు ఎవరూ దొరకడం లేదా సారూ..!!
  • దిక్కుమాలిన, తలకుమాసిన మర్యాద… వీటినే బానిస ధోరణులు అంటారు…
  • ఏ కులమైతేనేం… బలుపు చూపే కులంపై తిరగబడేవాడే,.. కర్ణన్…
  • సినిమా టైటిల్‌లో మొనగాడు ఉంటే చాలు… మనోళ్లకు ఖుషీ…
  • అంతే… ఆ స్పీచ్ తరువాత కాంగీ, సీపీఎం మొహాలు మాడిపోయాయ్…
  • యుద్ధంకన్నా క్లిష్టం… సింధు జలాల వాటాలు… దిక్కుతోచని పాకిస్థాన్…
  • వావ్ మద్రాస్..! అప్పట్లోనే ఆంధ్రాలీడర్లు ఇంకాస్త గట్టిగా పట్టుపట్టి ఉంటే..?!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions