ఫేస్‌బుక్‌లో హఠాత్తుగా ఓ ప్రోమో కనిపించింది… చాలా విస్తుపోయేలా చేసింది… ఆ విస్తుకు పలురకంబుల కారణాలు కలవు… ఎందుకంటే..? అది ఈటీవీ వాళ్ల ప్రోమో… ఎప్పుడూ జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి రియాలిటీ షోల గురించే తప్ప సదరు టీవీ సీరియళ్ల గురించి కూడా ప్రమోషన్ చేసుకోదు… అవెవరూ చూడరనీ, ప్రమోషన్ ఖర్చు కూడా వేస్టనీ అభిప్రాయం కావచ్చు…
ఇది మరో రియాలిటీ షో… అనగా టీవీ నాన్-ఫిక్షన్ కేటగిరీ షో గురించి… పేరు… బాబాయ్ హోటల్… వావ్, ఆల్‌రెడీ జెమినివాడు మాస్టర్ చెఫ్ అని చేతులు కాల్చుకున్నాడు కదా… ఇప్పుడు ఈటీవీ వాడి వంతేమో అనిపించింది… కానీ ఆల్‌రెడీ తెలుగు రుచి అని వంటల షో వస్తోంది కదా… మళ్లీ ఇదేమిటి అనుకుంటే… ఇది మెయిన్ ఈటీవీలో కాదట… ఈటీవీ అభిరుచి అనే ఇంకో చానెల్ ఉంది కదా… అందులో వస్తుందట…
ఓహో… అదొక చానెల్ ఉంది కదా… వాటిని ఎవడూ చూడటం లేదు… ఇక కాస్త ప్రమోషన్ పెంచి, ఒకటో రెండో రేటింగ్స్ వస్తే తప్ప వాటి ఉనికికి అర్థం లేదని ఫాఫం ఈటీవీ వాళ్లు తమ మీద తామే జాలిపడిపోయినట్టున్నారు… ఈటీవీ ప్లస్ కోసం ప్రత్యేకంగా జాతిరత్నాలు అని ఓ కామెడీ షో చేయిస్తున్నారు కదా… ఆమధ్య ఏదో సినిమా ప్రీమియర్ కూడా ప్రసారం చేసినట్టున్నారు సాహసించి…
Ads
ఇప్పుడు అభిరుచి చానెల్ కోసం ఈ బాబాయ్ హోటల్ షో అన్నమాట… అయితే అదే చానెల్‌లో ‘మీ కోసం’ పేరిట మరో వంటల షో వస్తుంటుంది కదా… మళ్లీ ఇదెందుకు అంటారా..? భలేవారే, ఈటీవీ వాళ్ల ఆలోచనలకు కూడా రీజనింగు ఉంటుందా..? (ఈటీవి లైఫ్ అని మరో చానెల్ కూడా ఉన్నట్టు గుర్తు…) ఈ బాబాయ్ హోటల్ ప్రోమోలో ఆకర్షించింది ఏమిటంటే… అదీ మల్లెమాల ఎంటర్‌టెయిన్‌మెంట్ వాళ్లే నిర్మిస్తుండటం…
క్రమేపీ ఈటీవీ షోలన్నీ మల్లెమాలకు కంట్రాక్టుకు లేదా ఔట్ సోర్సింగుకు ఇస్తున్నట్టు అనిపిస్తోంది… డాన్స్, కామెడీ ఎట్సెట్రా షోలే కాదు, ఇక వంటల కథల్నీ ఆ కంపెనీయే వండి వారుస్తుందన్నమాట… తాజా ప్రోమోలో శాంతి కనిపించింది… సారీ, శాంతిస్వరూప్ కనిపించాడు… హబ్బ, అదేలెండి, శాంతిగా లేడీ గెటప్ వేసి ఈటీవీ కామెడీ షోలలో కనిపిస్తుంటాడు కదా… తను… ఏదో కొత్తగా అనిపించింది… పండుగ స్పెషల్స్, జబర్దస్త్, ఎక్సట్రా జబర్దస్త్, డ్రామా కంపెనీ, డాన్స్ ఢీ… ఏ షో అయినా సరే, ఆ కమెడియన్సే… కమెడియన్స్‌తో వంటావార్పు అనేది కొత్త కాన్సెప్టు అన్నమాట…
ఎప్పుడూ ఎవరో ఓ గెస్టును పిలిచి, వండింది పెట్టి, మాట్లాడిస్తారేమో బహుశా… శాంతి కాస్త ఇక్కడా ఓవరాక్షన్… అప్పట్లో టీవీల్లో అర్ధరాత్రి బూతు ముచ్చట్లు చెబుతూ కనిపించేవాడు ఒకాయన… ఇప్పుడు ఈ షోకు హోస్ట్… సరే, రాకింగ్ రాకేష్ కో-హోస్ట్… ఈ అభిరుచి, ఈటీవీ ప్లస్ ప్రోమోలను ప్రేక్షకులు కూడా పెద్దగా పట్టించుకోరు… లైకులు, కామెంట్లు, వ్యూస్ దయనీయంగా ఉంటాయి… ఆ షోలను కూడా పెద్దగా ఎవరూ చూడరు కదా… అదీ కారణం…!! ఐనా ఇన్‌స్టా, యూట్యూబ్, రీల్స్, ఫేస్‌బుక్… ఏది ఓపెన్ చేసినా బోలెడు వంటల వీడియోలు… ప్రత్యేకంగా టీవీలు ట్యూన్ చేసి చూసేవాళ్లు ఎందరు..? ఇదీ అసలైన ప్రశ్న..!!
Share this Article