Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఆసక్తిని రేపుతున్న ‘యుఫోరియా’… నేటి సొసైటీకి అవసరమైన సబ్జెక్టు…

January 18, 2026 by M S R

.

యుఫోరియా సినిమా కాస్త ఆసక్తిని రేకెత్తిస్తోంది… చాన్నాళ్ల తరువాత భూమిక కనిపించింది… ఒకప్పుడు స్టార్ హీరోలతో జతకట్టిన ఆమె పెళ్లయ్యాక, పిల్లాడు పుట్టాక తెరమరుగైంది… పెళ్లయితే చాలు ఇక ఇండస్ట్రీ వదిలేస్తుంది కదా సాధారణంగా… (కొందరు మినహాయింపు)…

తరువాత ఎంసీఏలో వదినగా, మరీ ఎంఎస్ ధోనీ సినిమాలో అక్కగా (మరీ డీగ్లామరస్ రోల్)… అడపాదడపా ఏవో పెద్ద ప్రాముఖ్యం లేని పాత్రలు చేస్తోంది… ఇప్పుడు గుణశేఖర్ యుఫోరియా సినిమాలో ఓ కీలకపాత్ర ఇచ్చాడు… ఇంటెన్స్ ఉన్న పాత్రలాగా కనిపిస్తోంది… నిన్నో మొన్నో ట్రెయిలర్ రిలీజ్ చేసినట్టున్నారు.,. బాగుంది…

Ads

నిజానికి భారీ సెట్ల పిచ్చి ఎక్కువగా ఉన్న గుణశేఖర్ చాన్నాళ్లుగా సక్సెస్‌లో లేడు… చారిత్రిక ప్రేమకథ శాకుంతలం ఫ్లాప్… బహుశా సమంత రాంగ్ చాయిస్ కావచ్చు… అలాగే ఇలాంటి సినిమాలకు ఆత్మలా మెరవాల్సిన పాటలు పేలవంగా ఉండటం… దుష్యంతుడు, శకుంతల నడుమ సీన్స్ పండకపోవడం… పూర్ గ్రాఫిక్స్… ఇలా ఎన్నో కారణాలు…

భూమిక

రుద్రమదేవి కాస్త బెటర్… కానీ కమర్షియల్‌గా గెటాన్ అయ్యిందో లేదో తెలియదు… మహేశ్ బాబుతో మూడు సినిమాలు చేస్తే, ఒక దాంట్లో చార్మినార్ సెట్, అర్జున్‌లో మధురై గుడి సెట్… బహుశా యుఫోరియాలో ఆ సెట్ల పిచ్చి కనిపించకపోవచ్చు… ప్రధానంగా యూత్‌లో కనిపిస్తున్న అవలక్షణాలు, పోక్సో, డ్రగ్స్, క్రూరత్వం, టీనేజ్ క్రైమ్ ఎట్సెట్రా సబ్జెక్టు డీల్ చేసినట్టున్నాడు…

(వాడిని కని తప్పు చేశాను, కడుపులో ఉన్నప్పుడే చంపేసి ఉండాల్సింది అనే భూమిక డైలాగ్, వాళ్లు రాక్షసులమ్మా అనే సారా డైలాగ్, “మేము వయసులో మాత్రమే చిన్నవాళ్లం, కిక్కులో కాదు” అనే ధోరణి…  ఈ కథ దేని చుట్టూ తిరుగుతుందో చెప్పేస్తున్నాయి… బాగుంది సబ్జెక్టు…)

భూమిక

చెప్పాల్సింది మరో లేడీ గురించి… సారా అర్జున్… నటుడు రాజ్ అర్జున్ బిడ్డ… బాలనటి నుంచి నిన్నటి దురుంధర్ తో బ్రహ్మాండమైన హిట్ కొట్టింది… యుఫోరియాకు ఆమె కూడా ఓ ప్లస్ పాయింట్… సారా, భూమిక మాత్రమే కాదు, గౌతమ్ మేనన్ పాత్ర కూడా కీలకమైనదిగా చెబుతున్నారు… మంచి కాంబో… వీళ్లకు తోడుగా నాజర్…

గుణశేఖర్‌ను మణిశర్మ నిరుత్సాహపరిచాడు… కానీ ఇప్పుడు సీనియర్లను వదిలేసి ఆర్ఆర్ఆర్ ఫేమ్ కాలభైరవను తీసుకున్నాడు గుణశేఖర్.. (కీరవాణి కొడుకు)… టీజర్ బీజీఎం కూడా డిఫరెంటుగా బాగుంది… ఐతే కొన్నిసార్లు అన్నీ కుదిరినా కీలకమైన కథాకథనాలు సరిగ్గా పండకపోతే సినిమా ఢమాలే… చాలా ఉదాహరణకు చూశాం కదా…

గుణశేఖర్ ప్రతిభావంతుడే… కానీ ఏదో తేడా కొడుతోంది… బహుశా యుఫోరియా తన కెరీర్‌కు లైఫ్ అండ్ డెత్ మూవీ… ఇండస్ట్రీ పదే పదే అవకాశాలివ్వదు, రవితేజ,  గోపీచంద్ వంటి కొందరికే ఆ అదృష్టం… ఇలా పలుకోణాల్లో యుఫోరియా కాస్త ఇంట్రస్టును క్రియేట్ చేస్తోంది… ఇదుగో టీజర్ లింక్…

యుఫోరియా అంటే అపరిమితమైన ఆనందం లేదా పరమానందం... ఆ ఆనందం కోసం తొక్కే అడ్డదారులు, వాటి విపరిణామాలే కథ అయితే... గుణశేఖర్ ఆల్ ది బెస్ట్..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఆసక్తిని రేపుతున్న ‘యుఫోరియా’… నేటి సొసైటీకి అవసరమైన సబ్జెక్టు…
  • వరి వేస్తే ఉరే అంటివి కేసీయార్..! చూడు, నేడు వరిలో కొత్త రికార్డులు..!!
  • అన్నీ మసాలాలే… కానీ కథ అనే ఉప్పు మరిచాడు రాఘవేంద్రుడు…
  • PhotonSync… మన డిజిటల్ సైంటిస్టుల ‘సూపర్ షీల్డ్’ ఆవిష్కరణ…
  • ‘కాశ్మీర్ ప్రిన్సెస్’… ఆకాశంలో మృత్యువు… ఫస్ట్ ఇండియన్ జేమ్స్ బాండ్…
  • ఓహ్…! ఎన్టీవీ జర్నలిస్టుల అరెస్టు వెనుక అసలు కథ, కుట్రలు ఇవా..?!
  • ఎంజీఆర్..! ఇప్పటికీ ఆ పేరును ఎందుకు స్మరించుకోవాలంటే..!!
  • అన్ని న్యూస్ వీడియోల్లో ఆ మిస్సింగ్ కుర్రాడి జాడ వెతకడం ఎలా..?
  • సినిమా ఇండస్ట్రీకి ప్రమాద ఘంటికలు… బాగా పడిపోయిన వసూళ్లు…
  • అరుణారుణ జ్ఞాపకం హరితీకరణ..! ఆ స్థూపం ఆకుపచ్చబడింది..!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions