Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

రేవంత్‌రెడ్డి ఎఫెక్ట్..! బనకచర్ల ఏటీఎంకు బాబు కోటరీలోనే వ్యతిరేకత..!!

July 15, 2025 by M S R

.

రేవంత్ రెడ్డి పెడుతున్న కొత్త కొత్త మెలికలతో బనకచర్ల అనే మరో కాళేశ్వరం ఏటీఎం ప్రాజెక్టుపై చంద్రబాబుకు ఎటూ దిక్కుతోచడం లేదు ఫాఫం… రేవంత్ రెడ్డి పర్‌ఫెక్ట్ అస్త్రాలు సంధించి వదిలేశాడు కదా…

ఇప్పుడు ఏపీ మేధావులు మాత్రమే కాదు, చివరకు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ వంటి అత్యంత నిబద్ధ విధేయులు కూడా బనకచర్లను వ్యతిరేకిస్తున్నారు… ఎస్, చంద్రబాబుకు దిక్కుతోచడం లేదు… నా చేతిలో మోడీ ప్రభుత్వం ఆధారపడి ఉంది, అడిగితే కాదంటారా..? అటు అనుమతులు, ఇటు ప్రాజెక్టు స్టార్టయినట్టేనని అనుకున్నాడు…

Ads

  • కానీ ఇలా సిట్యుయేషన్ ఎదురు తిరుగుతుందని అనుకోలేదు ఫాఫం… ఐననూ సరే, చంద్రబాబును తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు… కేంద్రంపై ప్రెజర్ పెంచుతున్నాడు… కేంద్రాన్నే ముందుపెట్టి కథ నడిపించే ప్లాన్ స్టార్టయింది… వెదిరె శ్రీరాం వంటి కేంద్ర జలశక్తి మాజీ సలహాదారులు స్వయంగా రంగంలోకి దిగుతున్నారు… జలశక్తి శాఖ అధికారికంగానే ఇద్దరు ముఖ్యమంత్రులతో భేటీ ఏర్పాటు చేసింది… ఇక్కడే రేవంత్ రెడ్డి స్థిరంగా నిలబడాల్సిన అవసరం కనిపిస్తోంది…

కేసీయార్ పుణ్యమాని, తెలంగాణ నీటిప్రయోజనాలను పాతరేస్తూ జగన్ చేపట్టిన పోతిరెడ్డిపాడు పొక్క వెడల్పు, రాయలసీమ లిఫ్టులాగే… చంద్రబాబు ఏదో ఓ ప్లాన్‌తో ఈ బనకచర్ల అనే ధనప్రాజెక్టును చేపట్టే ప్రమాదం ఎప్పుడూ పొంచి ఉంటుంది… సో, రేవంత్ సర్కారూ బహుపరాక్…

కేంద్ర పర్యావరణ సంస్థ నో అనేసింది… సీడబ్ల్యూసీ నో అనేసింది… నేరుగా నో అని చెప్పకుండా ట్రిబ్యునల్ నీటి కేటాయింపులు, వరదజలాల లభ్యత ఎట్సెట్రా వివరాల్ని అడిగి, ప్రతిపాదనల్ని వాపస్ కొట్టాయి.,. చివరకు ఇప్పుడు పోలవరం అథారిటీ కూడా ఇదెలా కుదురుతుంది అని కొర్రీ వేసింది… బనకచర్ల చేపడితే మొత్తం పోలవరం ప్రాజెక్టు డీపీఆర్ ప్రశ్నార్థకంగా మారుతుందని స్పష్టం చేసింది…

గోదావరి వాటర్ మేనేజ్‌మెంట్ బోర్డు, సుప్రీంకోర్టులో కేసు, ఇతర రాష్ట్రాల అభ్యంతరాలు వంటివి ఇంకా బోలెడు చిక్కులున్నాయి… ఇంకా ఆ వివరాల లోతుల్లోకి వెళ్లలేమేమో గానీ… చంద్రబాబుకు సొంత రాష్ట్రంలోనే బనకచర్ల వ్యతిరేక నినాదాలు, కథనాలు, విశ్లేషణలు, అభ్యంతరాలు, ఆందోళనలు ఎదురవుతున్నాయి…

అన్నింటికీ మించి తన సొంత క్యాంపు... అంటే ఒక ఏబీ వెంకటేశ్వరరావు అనబడే తన అత్యంత భారీ తీవ్ర విధేయ కేరక్టర్ కూడా ఠాట్ బనకచర్ల అంటున్నాడు.,.

banakacharla

ఒక వడ్డే శోభనాద్రీశ్వరరావు కూడా అంతే… అన్నింటికీ మించి ఆంధ్రజ్యోతి వ్యతిరేకించడం పెద్ద విశేషం… బాబా గారు, సారీ, బాబు గారు సై అంటే సై అనేసే ఆంధ్రజ్యోతి కూడా ఈ ప్రాజెక్టు వరమా శాపమా అని పెద్ద కథనాన్ని వెలువరించింది… అఫ్‌కోర్స్, అంతిమంగా, స్థూలంగా అదొక దిక్కుమాలిన ప్రాజెక్టు అని తేల్చేసింది…

ఏపీ ఖజానాను పణంగా పెట్టేబదులు, ఆల్రెడీ పెండింగులో ఉన్న ప్రాజెక్టులను పూర్తిచేయవోయ్ బ్రదరూ అనేసింది… విచిత్రంగా ప్రధాన ప్రత్యర్థి, ప్రతిపక్షం వైసీపీకి మాత్రం ఈ ప్రాజెక్టుపై ఏ పాలసీ లేనట్టుంది ఫాఫం…

https://www.andhrajyothy.com/2025/andhra-pradesh/godavaribanakacharla-boon-or-a-burden-1425236.html

 

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • అయ్యో బాబూ… బనకచర్లపై ‘ముచ్చట’ చెప్పిందే వెదిరె శ్రీరామూ చెప్పాడు..!!
  • కూలేశ్వరం ఏటీఎం కీలక బోల్ట్… ఏళ్లకేళ్లు సర్వీస్ ఎక్స్‌టెన్షన్ …
  • బనకచర్లపై మాట్లాడేదేం లేదు… కేంద్ర-బాబుకు తెలంగాణ ప్రభుత్వం షాక్…
  • ఎవరు ఆ త్రిశూలధారి..? ఆ యుద్ధంలో ఎలా ప్రత్యక్షమయ్యాడు..? ఎందుకు..?!
  • జగడపు చనువుల జాజర… ఓ శృంగార కీర్తనకు వెగటు గెంతుల రీల్స్…
  • రేవంత్‌రెడ్డి ఎఫెక్ట్..! బనకచర్ల ఏటీఎంకు బాబు కోటరీలోనే వ్యతిరేకత..!!
  • ఆహా ఏమి రుచి..! కొత్తిమీర కూరితేనే వంకాయకు ఆ రుచివైభోగం…
  • గాలికదుపు లేదు- కడలికంతు లేదు… ప్రతి పదంలోనూ లోతైన భావన…
  • ఓహ్… ఆ జంబలకిడిపంబ సినిమాకు ఇక్కడ బీజం పడిందా..?!
  • ఆర్ఎస్ఎస్ ముద్ర..! నలుగురు కొత్త ఎంపీలు, ముగ్గురు గవర్నర్లు..!!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions