అందరికీ తెలుసు… టీవీ9 రవిప్రకాష్… సారీ, మాజీ టీవీ9 రవిప్రకాష్… రాజ్‌న్యూస్ రవిప్రకాష్‌కు బీజేపీతో కూడా మంచి సంబంధాలున్నాయని… తను బేసిక్‌గా పీడీఎస్‌యూ బ్యాచే అయినా సరే… మతరాజకీయాలకు వ్యతిరేకి అయినా సరే… టీఆర్ఎస్ క్యాంపు మీద కసికసిగా రగిలిపోతున్నాడు… మైహోం రామేశ్వరరావు కొట్టిన దెబ్బలకు రవిప్రకాష్ నిర్మించుకున్న మీడియా సామ్రాజ్యం కుప్పకూలిపోయింది… ఇప్పటికైతే మైహోందే ఆధిపత్యం… అయితే..?
పాత టీవీ9 గుజరాత్ టీం కావచ్చు… పాత టీవీ9 భారతవర్ష టీం కావచ్చు… రవిప్రకాష్‌ను ఇప్పటికీ ప్రేమించే జర్నలిస్టులు కావచ్చు… మోడీతో సఖ్యతగా ఉండే టీం కావచ్చు… రవిప్రకాష్ మీద ఎన్ని రిజర్వేషన్లు ఉన్నా సరే… బీజేపీ తనను వదులుకోదు… హెక్టిక్ షెడ్యూల్ నడుమ కూడా మోడీ తను అడగ్గానే టీవీ9 భారతవర్ష లాంచింగుకు హాజరు కావడానికి అదే కారణం…
Ads
ఇప్పుడిక తెలుగు రాజకీయాలకు వస్తే… కేసీయార్ అంటే రవిప్రకాష్‌కు తీవ్ర ఆగ్రహం… కేసీయార్ అంటే బీజేపికి కూడా తీవ్ర ఆగ్రహం… ఆ పాయింట్ వాళ్లను మళ్లీ కలిపింది… మొన్న దుబ్బాక… ఇప్పుడు గ్రేటర్… కలిసి పనిచేస్తున్నారు… మళ్లీ టీవీ9 నీకు దక్కేలా మేం చూస్తాంలే అని హామీ ఇచ్చారో ఏమో గానీ… ప్రస్తుతం బీజేపీ ప్రణాళికలు, ఎత్తుగడల వెనుక రవిప్రకాష్ కూడా ఉంటున్నాడనేది ఓ సమాచారం…
తప్పులేదు, రవిప్రకాష్ ఏ పార్టీకి అనుబంధ జర్నలిస్టు కాదు… తన ఇష్టం వచ్చిన వాళ్లకు సహకరించే సౌలభ్యం ఉంది… తను పనిచేస్తున్న రాజ్ న్యూస్ కూడా బీజేపీ వాళ్లదే… తనకేమో మూడునాలుగు చానెళ్లను ఓన్ చేసుకుని, ఓ గ్రూపు చానెళ్ల ద్వారా కేసీయార్‌పై పోరాడాలనే కసి ఉంది… సహజంగానే బీజేపీకి కూడా కావల్సింది అదే కదా…
అదంత వీజీ కాకపోవచ్చు… కానీ ప్రయత్నలోపం లేకుండా రవిప్రకాష్ సీరియస్‌గా అటాచ్ అయిపోతున్నాడు… గ్రేటర్ ఎన్నికలకు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న బీజేపీ ఫస్ట్ ప్రాధాన్యం కాంగ్రెస్ నుంచి, టీఆర్ఎస్ నుంచి కొందరు నాయకుల్ని లాగేయడం… అది కంటోన్మెంట్ ఏరియాలో బలమున్న సర్వే సత్యనారాయణ కావచ్చు… ఒక ఎంపీ స్థానంలో బలమున్న కొండా విశ్వేశ్వరరెడ్డి కావచ్చు… తెలంగాణ ఉద్యోగవర్గాల్లో మంచి పట్టున్న మండలి పాత అధ్యక్షుడు స్వామిగౌడ్ కావచ్చు… చివరకు విజయశాంతి కూడా కావచ్చు… డివిజన్ స్థాయి నాయకులు కావచ్చు… అందరికీ కండువాలు కప్పడానికి బీజేపీ రెడీ…
ఈ స్థితిలో గ్రేటర్ గెలుపు బాధ్యతల్ని అప్పగించబడిన బీజేపీ ముఖ్య నేత, ఇన్చార్జి భూపేంద్రయాదవ్ సహా, రాష్ట్ర బీజేపీ ముఖ్య నాయకులు పలువురు పార్క్ హయాత్‌లో భేటీ అయ్యారనేది తాజా సమాచారం… రవిప్రకాష్ చెప్పిన ప్రతిదీ బీజేపీ అమలు చేయకపోవచ్చు… కానీ టీఆర్ఎస్ వ్యతిరేక శక్తులన్నింటినీ బీజేపీ కూడగడుతోంది… అదీ నిజం…
ఇప్పుడున్న స్థితిలో… ఎక్స్ అఫిషియో వోట్లు ప్లస్ మజ్లిస్ మద్దతు కలిపితే టీఆర్ఎస్కు మేయర్ పీఠం పెద్ద కష్టమేమీ కాదు… కానీ బీజేపీ సంకల్పం అది కాదు… ప్రతి డివిజన్‌లోనూ కేసీయార్‌కు దీటైన పోటీ ఇవ్వడం… కాంగ్రెస్‌ను నోమోర్ చేయడం… హైదరాబాద్ అంటే బీజేపీ అడ్డా అని చెప్పుకోవడం… (అలాగని మజ్లిస్ బీజేపీకి బద్ధ వ్యతిరేకి అని భ్రమపడకండి… చాలా ఈక్వేషన్లుంటయ్… వాటి లోతుల్లోకి వెళ్తే అంత తేలికగా జీర్ణం కావు…) ఇరుపార్టీల సోషల్ మీడియా టీంలు హోరాహోరీగా పోరాడుతున్న గ్రేటర్ ఎన్నికల్లో ప్రతి చిన్న అంశమూ లెక్కలోకి వస్తుంది… రవిప్రకాష్ ఆలోచనలు, బీజేపీతో తన మంతనాలు కూడా కొంత ఉపయోగపడొచ్చు… ఇక్కడ మనం చెప్పుకునేది ఏమిటంటే..?
రోజులన్నీ కేసీయార్‌వి కావు… కాకపోవచ్చు…….. లేదా కేసీయారే తోపు కావచ్చు…… కానీ మునుపు లేని పోటీ, సెగ తగులుతున్నది అనే మాట మాత్రం నిజం…
Share this Article