గ్రామీణ పూజాసంస్కృతుల మీద ఈమధ్య చాలా ఆందోళనను వెలిబుచ్చే సోషల్ మీడియా పోస్టులు కనిపించినయ్… గ్రామదేవతల అర్చన పద్దతుల్ని కూడా బ్రాహ్మణీకరిస్తున్నారనేది వాటి సారం… కానీ మరీ అంత ఆందోళన చెందాల్సిన పని ఉందా..? ఇదొక చిక్కు ప్రశ్న… తెలంగాణ ప్రాంతం మీద ఏళ్ల తరబడీ సాగిన సాంస్కృతిక, ఆధ్యాత్మిక, మత దాడుల నుంచి తెలంగాణ తన సంస్కృతీ మూలాల్ని పదిలంగా కాపాడుకుంది…
అంతకన్నా దారుణంగా ఆంధ్రా పాలనలో సాగిన అవహేళనల్ని, అవమానాల్ని కూడా తట్టుకుంది… కట్టు, బొట్టు, భాష, తిండి, కళ, పూజ, మొత్తంగా బతుకులన్నీ వెక్కిరింపులపాలే… అయితేనేం… తెలంగాణ అంతిమంగా తన అస్థితాన్ని నిలుపుకుంది… కాపాడుకుంది… సంస్కృతిని కూడా..! నిజంగా ఓ పల్లెపడుచు గనుక తన మూలాల్ని కాపాడుకోవాలనుకుంటే… ఎవడు ధ్వంసం చేయగలడు..? ఆమె బతుకమ్మను తన కొంగుముడిలో దాచుకున్న దేవుడి మొక్కునాణెంలా కాపాడుకోలేదా..? బోనం కూడా అంతే… మల్లన్న మైలపోలు, పట్నం, సాగబోసుడు వంటివీ నిలుస్తయ్…
Ads
ఆ నమ్మకం ఎప్పుడు కలుగుతుందీ అంటే… ఒక బొడ్రాయి పూజను ఊరంతా పండుగలా చేసుకున్నప్పుడు… ఊరుఊరంతా కలిసి వరుసకట్టి బోనాల ఊరేగింపు చేసినప్పుడు… వేల పొయ్యిల మీద అమ్మకు ప్రసాదం వండి పెట్టినప్పుడు… ఒక్క ముక్కలో చెప్పాలంటే మెట్‌పల్లి, పెద్దాపురం బోనాల జాతరలాగా..!! ఫేస్‌బుక్‌లో Sampathkumar Reddy Matta షేర్ చేసుకున్న కొన్ని వాక్యాలు బాగనిపించినయ్… ఓ వీడియో కన్నుల పండుగగా ఉంది… మన పాత్రికేయ మిత్రుడు కొంటికర్ల రమణ పంపిన ఫోటోలూ బాగున్నయ్… సంపత్‌కుమార్‌రెడ్డి రైటప్ ఏమిటంటే..?
అన్నంకుండల పండుగ~~~~~~~~~~~~~~~~అన్నయములైనవన్ని జీవంబులుకూడు లేక జీవ కోటి లేదు~ పోతులూరి వీరబ్రహ్మంతెలంగాణ బోనాల సంస్కృతిపైన చెప్పిన తాత్త్వికతతోనే ముడిపడ్డది.బోనం అంటే భువనం! బోనం అంటే భోజనం !విశ్వశక్తికి ఘటం సంకేతమైతేజీవశక్తికి అందలి అన్నం సంకేతం !బోనం.. జీవాత్మ – పరమాత్మల ఏకీకృత రూపం.ఎన్నో శైవ శాక్తేయ సంప్రదాయాల పరంపరలకుకేంద్రస్థానమైన తెలంగాణ మాగాణంలో..బోనం ఒక నిత్యాన్నదాన మహోత్సవం !మెట్టుపల్లి దగ్గరి పెద్దాపురంలో జరిగేమల్లన్న వసంతోత్సవ బోనాల జాతర బహుశా–ప్రపంచంలోనే అతిపెద్ద అన్నమహోత్సవం కావచ్చు.కాముని పున్నమ తర్వాత వచ్చే ఆదివారంపూటఇక్కడ మల్లన్న బాసంతం/వసంతోత్సవం జరుగుతది.మొన్నటి ఆదివారం నాడు జరిగిన బోనాల ఉత్సవంలోఅరువైవేలకు పైచిలుకు బోనాలు దేవునికి అర్పించుకున్నారు.బోనం అంటే మామూలుగా… ఒక జత. (1+1)ఒక బెల్లపన్నపు బోనం + ఒక పసుపన్నపు బోనం.ఊరు ఊరంతా, ఊరిచుట్టు పరిసర ప్రదేశమంతా–బోనాలను వండివార్చే హంగామాతొ కళకళలాడుతది.ఒక్కపూటలో యాభైవేల పైన పొయిలు వెలిగిస్తారంటే…ఆ సంబురాన్ని ఏమని ఎంతని వర్ణించగలము.అత్యంత నిష్టగ ఒక్కపొద్దుండి, బోనాలు వండిమలిసంధ్యకు ముందు భక్తులందరూ ఒకేసారిమల్లన్నదేవునికి బోనాలు సమర్పించుకుంటారు.లక్షలమంది మధ్య, తొక్కిసలాటకు తావులేకుండాఅత్యంత క్రమశిక్షణతో బోనాల ప్రదక్షిణలు జరుగుతాయి.ఈ దృశ్యం చూసుటానికి రెండుకండ్లు చాలవంటే చాలవు.ఇది అచ్చమైన అన్నంకుండల పండుగ !శుద్ధ శాఖాహార అన్నసంతర్పణ మహోత్సవం.బెల్లపు పరమాన్నం, పులగం & కాయగూరల భోజనం.లక్షాధికమైన బోనాలు,ఒకేదగ్గర లక్షలమందికి వితరణలు.బోనం పరంపర ఎంత ప్రాచీనమో.. అంత ప్రశస్తము గదా..!!డా.మట్టా సంపత్కుమార్ రెడ్డి(వీడియో సౌజన్యం.. మా శిష్యరాలు, పెద్దాపురం)
చిల్లర చిల్లర చెత్తాచెదారం వార్తలకు పెద్దపీట వేసే మెయిన్ స్ట్రీమ్ మీడియాకు ఈ వార్త, ఈ ఫోటోలు, ఈ వీడియోలు ఎందుకు ఆనలేదు… ఇంకా మనం పరాయి మీడియా పెత్తనాల దరిద్రాన్నే మోస్తున్నందున..!! ఎవడో ఏదో గుడికి వెళ్లే కలర్ ఫోటోలు అచ్చేసి పరవశించిపోయే మీడియాకు అసలు సిసలు సాంస్కృతిక సౌరభం ఏం పడుతుంది..?! మన అనుకున్న మీడియాకు రాజకీయం తప్ప మరేమీ పట్టదాయె..!!
Share this Article