Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

అశ్వత్థామ మ్యూజిక్… ఆపై సినారె రాత… ఆ పాటతో సినిమా సూపర్ హిట్…

June 2, 2024 by M S R

Subramanyam Dogiparthi…..  లవర్ బాయ్ , సాఫ్ట్ బాయ్ ఇమేజిలో నుండి రెబల్ , నెగటివ్ షేడున్న పాత్రలోకి దూరి హీరోగా తన స్థానాన్ని సుస్థిరపరచుకున్న సినిమా ఇది శోభన్ బాబుకు … వీరాభిమన్యు , కాలం మారింది , చెల్లెలి కాపురం వంటి చక్కని చిత్రాల ద్వారా మంచి పేరు తెచ్చుకున్న శోభన్ బాబు ఈ సినిమా ద్వారా మాస్ హీరోగా అవతరించాడని చెప్పవచ్చు . సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ …

అఖల్ & జేన్ అనే నవల ఆధారంగా ఈ సినిమా కధను నేసారట . కధ , స్క్రీన్ ప్లే బాధ్యతలను చేపట్టిన నిర్మాత పి చిన్నపరెడ్డిని , దర్శకుడు పి చంద్రశేఖరరెడ్డిని అభినందించాలి . బిర్రయిన స్క్రీన్ ప్లే సినిమాను పరుగెత్తిస్తుంది . నటీనటులు అందరూ చాలా బాగా నటించారు . ముఖ్యంగా శోభన్ బాబు , కృష్ణకుమారి , ముక్కామల .

మోదుకూరి జాన్సన్ మాటలు తూటాల్లాగా పేలుతుంటాయి . సినిమా ఈరోజుకీ ప్రేక్షకులు గుర్తు ఉంచుకోవటానికి కారణం అశ్వత్థామ సంగీతం , పాటలు , డాన్సులు … జ్యోతిలక్ష్మి , జయకుమారి రెండు డాన్సులు , పాటలు సూపర్బ్ … కొప్పు చూడు కొప్పందము చూడు అనే పాటలో జ్యోతిలక్ష్మి డాన్స్ , ఆ జానపద పాటలోని సరదా అయిన సాహిత్యం అద్భుతంగా ఉంటాయి . అలాగే జయకుమారి డాన్స్ చేసే క్లబ్ సాంగ్ కంచె కాడ మంచె కాడ కందిచేను గుబురు కాడ పాట కూడా వీర హుషారుగా ఉంటుంది .

Ads

ఈ సినిమాలో మరో పాట ఈరోజుకీ స్వాతంత్య్ర దినోత్సవం నాడు , రిపబ్లిక్ దినోత్సవం నాడు వినిపించే సందేశాత్మక పాట సి నారాయణరెడ్డి వ్రాసిన అణువూ అణువున వెలసిన దేవా . ఆ పాటలోని సాహిత్యం చాలా గొప్పగా ఉంటుంది . మరో పాట సి నారాయణరెడ్డి వ్రాసిన ఎవరు వీరు ? ఎవరు వీరు ? దేశమాత పెదవి పైన మాసిన చిరునవ్వులు . వేశ్యావాటిక / రెడ్ లైట్ ఏరియాలోని వేశ్యల బతుకుల మీద చిత్రీకరించబడిన పాట ప్రేక్షకుల హృదయాలను తాకుతుంది . ఈ పాట ఇరవై రోజులు షూట్ చేసారట .

దాశరధి వ్రాసిన అమ్మ లాంటి చల్లనిది , లోకం ఒకటి ఉందిలే పాట , ఓ అబ్బాయో నిలు నిలు నిలు అనే శారద శోభన్ బాబుని టీజింగ్ చేసే పాట , పచ్చని మన కాపురం పాట చాలా శ్రావ్యంగా ఉంటాయి . వీటన్నింటితో సమానంగా మోదుకూరి జాన్సన్ మాటలు చాలా సన్నివేశాలలో తూటాల్లాగా పేలుతుంటాయి .

తెలుగులో కనక వర్షం కురిపించిన ఈ సినిమా హక్కులను శారద కొనుక్కొని మళయాళంలో నిర్మించింది . తమిళంలో వి బి రాజేంద్రప్రసాద్ శివాజీ గణేశన్ తో , హిందీలో డూండీ వినోద్ ఖన్నాతో నిర్మించారు . అయితే , తెలుగులో శోభన్ బాబు జగన్ పాత్ర పేలినట్లు ఇతర భాషల్లో పేలలేదు .

కృష్ణంరాజు అతిధి పాత్రలో కనిపిస్తారు . సత్యనారాయణ , రాజబాబు , ఏడిద నాగేశ్వరరావు ప్రభృతులు నటించారు . మా నరసరావుపేటలో సత్యనారాయణ టాకీసులో ఎన్ని సార్లు చూసానో ! టి విలో వచ్చిన ప్రతిసారీ కాసేపయినా చూస్తుంటా .

కృష్ణకుమారి పాత్ర , ఆ పాత్రలో ఆమె నటన నాకు బాగా నచ్చాయి . ప్రేక్షకుల సానుభూతి పొందే పాత్ర . యూట్యూబులో ఉంది . చూడనివారు అర్జెంటుగా చూడతగ్గ సినిమాయే . ఎక్కడా బోర్ కొట్టదు , పరుగెత్తిస్తుంది , ఎవరు వీరు వంటి పాటలప్పుడు ఆలోచింపచేస్తుంది . Excellent , unmissable and entertaining movie #తెలుగుసినిమాలసింహావలోకనం #తెలుగుసినిమాలు

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • నిజమే… ఆడ వారసులు ఐతేనేం… కేసీయార్‌కు అస్సలు నచ్చదా..?!
  • డ్రోన్ల యుద్ధమే కాదు… భీకరమైన సైబర్ యుద్ధానికీ దిగిన పాకిస్థాన్…
  • ఆట నుంచి క్రమేపీ దూరమవుతూ… ఆధ్యాత్మిక అంశాలకు దగ్గరగా…
  • ఓ చిన్న గుడి… కృష్ణా నదిలో ఓ ద్వీపంలో… పూర్తిగా చదవండి ఓసారి…
  • ఔరా అక్కినేనీ… నాసిరకం ఉత్పత్తుల్లో నువ్వూ తక్కువేమీ కాదు….
  • పాక్ పీచమణిచిన S-400 కాదు… దాని తాత S-500 కూడా వస్తుంది…
  • ఇది నిజంగా బాపు తీసిన పాటేనా..?! ఆమె అసలు ఆ జయప్రదేనా..?!
  • వేలాడదలుచుకోలేదు… క్లియర్ ప్లానింగ్… జస్ట్, అలా వదిలేశాడు…
  • మోడీజీ… అన్నీ బాగానే చెప్పావు… కానీ ఆ ఒక్క ప్రశ్నకు జవాబు..?!
  • ఆ భూకంపాలు ప్రకృతి కోపమా..? అణ్వస్త్ర గోదాముకు పడిన తూట్లా..?!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions