ఒక చుట్టపాయన రీసెంటుగా అమర్నాథ్ యాత్రకు వెళ్లొచ్చాడు… తనకేమో బీపీ, భార్యకేమో ఆస్తమా… ఇద్దరూ మొన్నామధ్య కరోనా బాధితులే… అంటే ఊపిరితిత్తుల మీద ప్రభావం పడిందన్నమాటే కదా… మరి అమర్నాథ్ యాత్రలో ఆ ఎత్తు ప్రదేశంలో మీకు ఆక్సిజన్ తక్కువై ఇబ్బంది కాలేదా అనేది నా ప్రశ్న…
.
ఇబ్బందే అయ్యింది, ఎందుకు కాదు..? వెళ్ళేటప్పుడు ముద్ద కర్పూరం తీసుకుపోయాం, ట్రావెల్ ఏజెన్సీ వాళ్లు ముందే చెప్పారు… బాగా పనిచేసింది, శ్వాస కష్టమనిపించినప్పుడు దాని వాసన చూడటమే… పెద్ద రిలీఫ్… నమ్మరేమో కానీ బ్రదర్, అక్కడికి వచ్చిన చాలా మంది యాత్రికులు వెంట తెచ్చుకున్నారు, డోలీవాలాల్ని అడిగినా ఇస్తారది అన్నాడాయన… Wow…
Ads
.
ఒక ఆయుర్వేద డాక్టర్ ను అడిగితే ఇలా చెప్పాడు… ‘అదొక అద్భుతమైన ఔషధి… మనం ఇగ్నోర్ చేస్తున్నాం… ఊపిరితిత్తుల్లోని శ్లేష్మాన్ని క్లియర్ చేసి శ్వాస ప్రక్రియను మెరుగు పరుస్తుంది… అది చికిత్స కాదు, ఉపశమనం… శ్వాసనాళాల్ని సాఫ్ చేయడంకన్నా ఆ హయ్యర్ కాంటూర్‌లో ఇంకేం కావాలి..? ఇదేనా..? ఇంట్లో దేవుడి దగ్గర కర్పూరం వెలిగిస్తే అది ఇంట్లోని అతి సూక్ష్మ క్రిములను ఖతం చేస్తుంది… జస్ట్, అలా ఇంట్లో ఉంచితే చాలు, బ్యాడ్ స్మెల్ దూరం… చెబితే బోలెడన్ని యూజెస్…’
.
విషయం ఏమిటంటే… అసలు ఇవన్నీ ట్రాష్ అని కొట్టేస్తుంటాం మనం సింపుల్‌గా… కొందరైతే మరీ నీచంగా కామెంట్స్ చేస్తుంటారు సోషల్ మీడియాలో…! మన పూర్వీకులు అందించిన మూలికా జ్ఞానం, ఆయుర్వేదాన్ని పదేపదే వెక్కిరిస్తాం… కానీ మనం విస్మరిస్తున్న ఇలాంటి ఉపయుక్త అంశాలు బోలెడు… అసలు ఏదీ రీసెర్చ్, ఏదీ ఎంకరేజ్మెంట్..? ఒక మూర్ఖపు ఒరవడిలో కొట్టుకు పోతున్నాం… అదీ ట్రాజెడీ…
.
అన్నట్టు, మీ కారులో కృత్రిమ ఫ్రెషనర్స్ తీసేసి ఈ కర్పూరాన్ని అలా పెట్టి చూడండి… ఏదో ఒకటి, పచ్చ కర్పూరమా..? ముద్ద కర్పూరమా..? ఇతరత్రా ఉపయోగాల గురించి తర్వాత మాట్లాడుకుందాం… కానీ జాగ్రత్త… చిన్న పిల్లలతో, పాలిచ్చే తల్లులు కారులో వెళ్తే కర్పూరం అవాయిడ్ చేయండి…
ఇక్కడ చెప్పదలిచింది ఏమిటంటే..? మూలికావైద్యాన్ని, ఆయుర్వేదాన్ని, ఇతర దేశీయ వైద్య విధానాల్ని విమర్శించడం, కొట్టిపారేయడం ఓ ఫ్యాషన్ అయిపోయింది ఈమధ్య… సగటు అల్లోపతీ కార్పొరేట్ వైద్యం సగటు మనిషికి ప్రాణాంతకంగా మారినా ఇలాంటోళ్లు మారరు… మరీ కొందరు ఇంకా నీచం… వీటిని వ్యతిరేకించడం అంటే, సెక్యులర్ అట, యాంటీ మోడీ అట… వీళ్లను ఓ టన్ను పచ్చ కర్పూరం కూడా మార్చలేదు, కాపాడలేదు…!!
Share this Article